గొడ్డు మాంసం తినడాన్ని ప్రోత్సహిస్తున్న బీజేపీ మంత్రి.. చికెన్, మటన్ కంటే బీఫ్ ఎక్కువగా తినండి..

బీజేపీ మంత్రి సన్‌బోర్ షుల్లాయ్

జనాలు గొడ్డు మాంసం తినాలని ఓ బీజేపీ మంత్రి పిలుపునిచ్చారు. ఇతర మాంసం కంటే ఎక్కువగా గొడ్డు మాంసం తినడానికి జనాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని కూడా అన్నారు.

 • Share this:
  జనాలు గొడ్డు మాంసం తినాలని ఓ బీజేపీ మంత్రి పిలుపునిచ్చారు. ఇతర మాంసం కంటే ఎక్కువగా గొడ్డు మాంసం తినడానికి జనాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని కూడా అన్నారు. ఈ వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత ఎవరంటే.. మేఘాలయ రాష్ట్ర మంత్రి సన్‌బోర్ షుల్లాయ్. ఆయన దక్షిణ షిల్లాంగ్ నుంచి మూడు సార్లు శాసనసభ్యునిగా గెలుపొందారు. చికెన్, మ‌ట‌న్, చేప‌ల కంటే అధికంగా గొడ్డు మాంసం ప్ర‌జ‌లు తినేందుకు ప్రోత్స‌హిస్తాన‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ఇలా చేయడం ద్వారా బీజేపీ గోవధపై నిషేధం విధిస్తుందనే తప్పుడు భావన తొలగిపోతుంది అని ఆయ‌న పేర్కొన్నారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు తమకు ఇష్టమైన ఆహారం తినే స్వేచ్ఛ ఉంటుందని తాను విశ్వసిస్తున్నట్టు షుల్లాయ్ తెలిపారు.

  ఇటీవలే షుల్లాయ్ పశుసంవర్ధక మరియు పశువైద్య శాఖ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ రకమైన వ్యాఖ్యలు చేఆరు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. అసోం ప్ర‌భుత్వం తీసుకొచ్చే కొత్త ఆవు చ‌ట్టంతో మేఘాల‌య‌కు ప‌శువుల ర‌వాణా చేసే విష‌యంలో ఎలాంటి ప్ర‌భావం చూప‌కుండా.. ఆ రాష్ర్ట సీఎం హిమంత బిశ్వా శ‌ర్మ‌తో మాట్లాడుతాన‌ని తెలిపారు.

  మేఘాలయ, అసోం మధ్య ఉన్న సరిహద్దు వివాదంపై మంత్రి షుల్లాయ్ మాట్లాడుతూ... సరిహద్దులను, రాష్ట్ర ప్రజలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రజలను రక్షించడానికి రాష్ట్రం తన పోలీసు బలగాలను ఉపయోగించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని వ్యాఖ్యానించారు. అసోం ప్రజలు సరిహద్దుల్లో ఉన్న మన ప్రజలను వేధిస్తుంటే... చర్చలకే పరిమితం కాకుండా, అవసరమైతే తక్షణమే స్పందించాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రజలను రక్షించేందుకు పోలీసులు ముందువరసలో నిలిచేలా ఉన్నతాధికారులు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అయితే తాను హింసకు వ్యతిరేకమని స్పష్టం చేశారు.
  Published by:Sumanth Kanukula
  First published: