హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Emergency Medical Care: ఎమర్జెన్సీ సమయంలో ప్రాణాలు కాపాడే క్యూఆర్ కోడ్స్‌.. ఎలా పనిచేస్తాయంటే..

Emergency Medical Care: ఎమర్జెన్సీ సమయంలో ప్రాణాలు కాపాడే క్యూఆర్ కోడ్స్‌.. ఎలా పనిచేస్తాయంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Emergency Medical Care: బెంగళూరు సిటీ ట్రాఫిక్ పోలీస్ (Bengaluru City Traffic Police) టీమ్ బృహత్ బెంగళూరు మహానగర పాలికే (BBMP), మణిపాల్ హాస్పిటల్స్‌తో కలిసి ఒక డిజిటల్ సొల్యూషన్‌ను ప్రారంభించింది. బెంగుళూరు ప్రజల కోసం ప్రతి ట్రాఫిక్ సిగ్నల్ వద్ద QR కోడ్‌లు పోస్ట్ చేస్తోంది.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

Emergency Medical Care: హార్ట్ ఎటాక్ (Heart attack) వంటి మెడికల్ ఎమర్జెన్సీ సమయంలో సకాలంలో వైద్య చికిత్స అందడం చాలా అవసరం. లేదంటే ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉంది. అయితే అత్యవసర వైద్య పరిస్థితి ఎప్పుడు వస్తుందో ఎవరూ ఊహించలేరు. రోడ్డుపై ప్రయాణాలు చేస్తున్నప్పుడు మెడికల్ ఎమర్జెన్సీ తలెత్తితే ఆస్పత్రి ఫోన్ చేసేంత ఓపిక కూడా ఉండదు. దీనివల్ల చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అయితే ఇలాంటి ఇబ్బందులు ఎవరికి ఎదురు కాకుండా ఉండేందుకు బెంగళూరు సిటీ ట్రాఫిక్ పోలీస్ (Bengaluru City Traffic Police) టీమ్ బృహత్ బెంగళూరు మహానగర పాలికే (BBMP), మణిపాల్ హాస్పిటల్స్‌తో కలిసి ఒక డిజిటల్ సొల్యూషన్‌ను ప్రారంభించింది. బెంగుళూరు ప్రజల కోసం ప్రతి ట్రాఫిక్ సిగ్నల్ వద్ద QR కోడ్‌లు పోస్ట్ చేస్తోంది.

బెంగళూరులోని మణిపాల్ హాస్పిటల్స్ (Manipal Hospitals) రీజనల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ దీపక్ వేణుగోపాలన్ ఈ డిజిటల్ సొల్యూషన్‌పై స్పందించారు. "మెడికల్ ఎమర్జెన్సీ సమయంలో బాధితులపై మానసికంగా చాలా ఒత్తిడి ఉంటుంది. వారు ఎక్కువగా ప్యానిక్ అవుతుంటారు. ఇలాంటప్పుడు ఫోన్ నంబర్లను గుర్తుంచుకోవడం కష్టం. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని బెంగళూరు సిటీ ట్రాఫిక్ పోలీసుల సహాయంతో అన్ని సిగ్నల్స్‌లో QR కోడ్‌లు ఇన్‌స్టాల్ చేస్తున్నాం" అని ఆయన చెప్పారు. సెప్టెంబర్ 29న 'వరల్డ్ హార్ట్ డే (World Heart Day)' పురస్కరించుకున్న వారం తర్వాత ఈ డిజిటల్ సొల్యూషన్‌ను బెంగళూరు పోలీసులు ప్రారంభించారు.

* ప్రథమ చికిత్సకు ఉపయోగం

బెంగళూరు ప్రజలు ఈ QR కోడ్‌లు సింపుల్‌గా స్కాన్ చేసి కార్డియాక్ ఎమర్జెన్సీ సమయంలో ప్రథమ చికిత్స, వైద్య సేవలను పొందొచ్చు. ఈ క్యూఆర్ కోడ్స్‌ అనేవి స్కాన్ చేసే వ్యక్తిని నేరుగా ఎమర్జెన్సీ నంబర్‌కు కనెక్ట్ చేస్తాయని, అక్కడి నుంచి ఒక్క క్లిక్‌తో ఆ వ్యక్తి అంబులెన్స్ బుక్ చేసుకోవచ్చని మణిపాల్ హాస్పిటల్స్ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రజలు కార్డియోపల్మోనరీ రిససిటేషన్ (CPR) ప్రక్రియ గురించి సులభమైన స్టెప్స్‌లో తెలుసుకోవడానికి QR కోడ్‌లను కూడా ప్రవేశపెట్టినట్లు హాస్పిటల్ తెలిపింది. ఈ QR కోడ్‌ని స్కాన్ చేశాక, CPR ఎలా చేయాలో సింపుల్ ప్రాసెస్‌లో కనిపిస్తుంది. తద్వారా ఒక మెడికల్ ఎమర్జెన్సీ వ్యక్తిని ఇతరులు ఒక్కసారిగా వేగంగా రక్షించడం సాధ్యమవుతుంది.

* సీపీఆర్ ప్రాధాన్యం

CPR అనేది ప్రాణాలను రక్షించే ఒక గొప్ప టెక్నిక్. ఈ టెక్నిక్ సమర్థవంతంగా ఎలా ఉపయోగించాలో భారతదేశ జనాభాలో కేవలం రెండు శాతం కంటే తక్కువ మందికి మాత్రమే తెలుసు అని ఒక సంస్థ పేర్కొంది. ప్రథమ చికిత్స, గుండె సంబంధిత వైద్య సేవలను అందించే ప్రయత్నంలో బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు QR కోడ్‌లు ప్రతి ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద అంటించడాన్ని ప్రజలు ప్రశంసిస్తున్నారు. బెంగళూరు వంటి సిటీలలో ట్రాఫిక్ అధికంగా ఉంటుంది. ఇలాంటి సిటీలలో సొంతంగా హాస్పిటల్‌కి చేరుకోవాలన్న కష్టమే. అలాంటప్పుడు ట్రాఫిక్ సిగ్నల్ వద్ద QR కోడ్‌లను స్కాన్ చేసి సమీపంలోని అంబులెన్స్‌ సేవలను పొంది వెంటనే హాస్పిటల్‌కి వెళ్లిపోవచ్చు.

First published:

Tags: Bengaluru, Karnataka, Medical Research, Technology

ఉత్తమ కథలు