తుఫాన్‌లో గర్భిణీని కాపాడిన ఎన్డీఆర్ఎఫ్...నిజమైన హీరోలంటూ ప్రశంసలు

ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో ఎన్డీఆర్ఎఫ్ చేసిన ఈ రెస్క్యూ ఆపరేషన్‌పై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. మీరు నిజమైన హీరోలంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు.

news18-telugu
Updated: June 14, 2019, 8:23 AM IST
తుఫాన్‌లో గర్భిణీని కాపాడిన ఎన్డీఆర్ఎఫ్...నిజమైన హీరోలంటూ ప్రశంసలు
తుఫాన్‌లో గర్భిణీని కాపాడిన ఎన్డీఆర్ఎఫ్...నిజమైన హీరోలంటూ ప్రశంసలు
  • Share this:
తుఫాన్‌ వచ్చినా...వరద ముంచెత్తినా....వెంటనే ప్రత్యక్షమవుతారు. అపద్బాంధవుల్లా వచ్చి ..తమ ప్రాణాలకు తెగించి.. జనాల ప్రాణాలకు భరోసా ఇస్తారు. ఈదురుగాలుల హోరులో...వరద ప్రవాహంలో కష్టపడుతూ బాధితులకు బాసటగా నిలుస్తారు. వారే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది. నిజమైన హీరోలంటే వాళ్లే. అది మరోసారి రుజువైంది. అసలేం జరిగిదంటే.... అరేబియా తీరంలో అలజడి రేపిన వాయు తుఫాన్ గుజరాతీల వెన్నులో వణుకుపుట్టించింది. తుఫాన్ చివరకు దిశ మార్చుకోవడంతో గుజరాత్‌కు పెనుముప్పు తప్పిన విషయం తెలిసిందే. ఐనా వాయు ప్రభావంతో గుజరాత్ తీరంలో భారీగా వర్షాలు కురిశాయి. ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి.

ఆ సమయంలో షియాల్బెట్ ద్వీపంలో ఓ గర్భిణీ స్త్రీకి పురిటి నొప్పులు వచ్చాయి. వెంటనే ఆస్పత్రికి తరలించాలి. కానీ బయట భారీ వర్షం కురుస్తోంది. ఏం చేయాలో తెలియక కుటుంబ సభ్యులు టెన్షన్ పడుతున్నారు. ఐతే ఎన్డీఆర్ఎఫ్ గుర్తురావడంతో వెంటనే వారికి సమాచారమిచ్చారు. క్షణాల్లో అక్కడ ప్రతక్షమైన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఆ గర్భిణీని ఫెర్రీ బోట్ సాయంతో సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. సకాలంలో ఆస్పత్రికి తీసుకెళ్లడంతో ఆమెకు సుఖప్రసవమైంది. పండంటి మగబిడ్డకు ఆమెకు జన్మనిచ్చింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో ఎన్డీఆర్ఎఫ్ చేసిన ఈ రెస్క్యూ ఆపరేషన్‌పై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. మీరు నిజమైన హీరోలంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు.


First published: June 13, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>