హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Draupadi Murmu: చీపురు పట్టి శివాలయాన్ని ఊడ్చిన కాబోయే రాష్ట్రపతి.. వీడియో వైరల్

Draupadi Murmu: చీపురు పట్టి శివాలయాన్ని ఊడ్చిన కాబోయే రాష్ట్రపతి.. వీడియో వైరల్

ఆలయాన్ని ఊడ్చుతున్న ద్రౌపది ముర్ము

ఆలయాన్ని ఊడ్చుతున్న ద్రౌపది ముర్ము

Draupadi Murmu: ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా 64 ఏళ్ల ద్రౌపది ముర్మును బీజేపీ ప్రకటించిన విషయం తెలిసిందే. విపక్షాల నుంచి యశ్వంత్ సిన్హా బరిలో దిగుతున్నారు. బీజేపీకి సంఖ్యాబలం ఎక్కువగా ఉన్నందున ద్రౌపది ముర్ము విజయం నల్లేరు మీద నడకే అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇంకా చదవండి ...

కాబోయే భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Draupadi Murmu) చీపురుపట్టారు. రాయ్‌రంగ్‌పూర్‌లో ఓ శివాలయాన్ని శుభ్రం చేశారు. చీపురుతో ఆలయ పరిసరాలను ఊడ్చారు. అనంతరం శివుడికి ప్రత్యేక పూజలు చేశారు. అంతకు ముందు జగన్నాథ్ ఆలయంలోనూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు ద్రౌపది ముర్ము. ప్రస్తుతం ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఇక ద్రౌపది ముర్మును రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించిన నేపథ్యంలో ఆమెకు భద్రతను పెంచింది కేంద్రం. జెడ్ ప్లస్ కేటగిరి భద్రతను కల్పించారు. కేంద్రహోంశాఖ పరిధిలోని సీఆర్‌పీఎఫ్ సిబ్బంది ఇకపై ఆమెకు నిరంతరం సెక్యూరిటీగా ఉంటారు.

కాగా, ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా 64 ఏళ్ల ద్రౌపది ముర్మును బీజేపీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఒడిశాలోని(Odisha) ఓ సాధారణ ఆదివాసీ గిరిజన మహిళ స్థాయి నుంచి రాష్ట్రమంత్రి, గవర్నర్ స్థాయికి ఎదిగారు ద్రౌపది ముర్ము. ఆమెకు రాష్ట్రపతిగా అవకాశం ఇవ్వడం ద్వారా మహిళకు ఆదివాసీలకు అత్యున్నత స్థానం ఇవ్వడంతో పాటు ఓ మహిళకు దేశ అత్యున్నత పదవి ఇచ్చినట్టు అవుతుందని బీజేపీ నాయకత్వం భావించింది. విపక్షాల తరపున యశ్వంత్ సిన్హా రాష్ట్రపతి పదవికి పోటీ చేస్తున్నారు. రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించిన నేపథ్యంలో ఆయన తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. జూన్ 27న ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు.

ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ (Ramnath Kovind) పదవీ కాలం జులై 24తో ముగియనుంది. ఈ క్రమంలోనే రాష్ట్రపతి ఎన్నికలకు (President Elections) కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. రాష్ట్రపతి పదవికి పోటీ చేసే వారి నుంచి జూన్ 29 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. జులై 18న ఎన్నికలు జరుగుతాయి. జులై 21 కౌంటింగ్ చేసి.. ఫలితాలను ప్రకటిస్తారు. ఈ ఎన్నికల్లో పార్లమెంట్ సభ్యులు, రాష్ట్ర/కేంద్రపాలిత ప్రాంత శాసన సభ్యులు ఓటు వేస్తారు. ప్రస్తుతం పార్లమెంట్లో బీజేపీకి సంఖ్యాబలం ఉంది. అలాగే యూపీ సహా పలు రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. అక్కడ ఎమ్మెల్యే సంఖ్యా బలంగా కూడా బాగానే ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీ అభ్యర్థి ద్రౌపది ముర్ము విజయం నల్లేరు మీద నడకే కానుంది.

First published:

Tags: Draupadi Murmu, President Elections 2022

ఉత్తమ కథలు