Home /News /national /

NCP CHIEF SHARAD PAWAR GETS INCOME TAX NOTICES CALLS THEM LOVE LETTERS PVN

IT Notice To Sharad pawar : టార్గెట్ పవార్..షిండే సీఎం అయిన 24 గంటల్లోనే పవార్ కు నోటీసులు!

శరద్ పవార్ (పాత ఫొటో)

శరద్ పవార్ (పాత ఫొటో)

IT Notice To Sharad pawar : నాటకీయ ప‌రిణామాల మ‌ధ్య గురువారం శివసేన రెబల్ నేత ఏక్‌నాథ్ షిండే(Eknath Shinde) మ‌హారాష్ట్ర సీఎంగా ప్ర‌మాణ స్వీకారం చేసిన విష‌యం తెలిసిందే. అయితే సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఎన్పీసీ అధినేత శరద్ పవార్ (Sharad Pawar)ని షిండేగా టార్గెట్ చేసినట్లు అర్థమవుతోంది.

ఇంకా చదవండి ...
IT Notice To Sharad pawar : నాటకీయ ప‌రిణామాల మ‌ధ్య గురువారం శివసేన రెబల్ నేత ఏక్‌నాథ్ షిండే(Eknath Shinde) మ‌హారాష్ట్ర సీఎంగా ప్ర‌మాణ స్వీకారం చేసిన విష‌యం తెలిసిందే. అయితే సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఎన్పీసీ అధినేత శరద్ పవార్ (Sharad Pawar)ని షిండేగా టార్గెట్ చేసినట్లు అర్థమవుతోంది. షిండే సీఎంగా బాధ్యతలు చేపట్టిన గంటల వ్యవధిలోనే శరద్ పవార్ కి ఐటీ శాఖ నోటీసులు(IT Notice) జారీ చేసింది. ఎన్సీపీ,శివసేన,కాంగ్రెస్ నేతృత్వంలోని మహా వికాస్ అఘాడి(MVA) ప్రభుత్వం కూలిపోయిన తర్వాత మహారాష్ట్ర సీఎంగా ఏక్‌నాథ్‌ షిండే బాధ్యతలు చేపట్టి 24 గంటలు కాకముందే పవార్ కు ఐటీ నుంచి నోటీసులు రావడం గమనార్హం.

తనకు ఐటీ నోటీసులు జారీ చేసిన విషయాన్ని పవార్ తన ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఈ నోటీసులను ప్రేమ లేఖగా పేర్కొంటూ కేంద్రం పైన విమర్శలు చేశారు పవార్. పవార్ తన ట్వీట్ లో..."నాకో ప్రేమ లేఖ అందింది. 2004, 2009, 2014, 2020 ఎన్నికల సమయంలో నేను సమర్పించిన అఫిడవిట్లకు సంబంధించి ఆదాయపు పన్ను విభాగం నుంచి ఈ ప్రేమ లేఖ వచ్చింది"అని పేర్కొన్నారు పవార్. అయితే ఈ నోటీసుుల గురించి తాను ఆందోళన చేందడం లేదని, దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తన వద్ద ఉన్నట్టుగా పవార్ తెలిపారు.



Sharad pawar :  భారీ ప్రిపరేషన్ తర్వాతనే షిండే సీఎం..అసంతృప్తిగానే ఫడ్నవీస్!

అయితే కొత్త ప్రభుత్వం ఏర్పాటయిన కొద్ది గంటల్లోనే శరద్ పవార్ కు ఐటీ శాఖ నోటీసులు ఇవ్వడంపై నోటీసులపై ఎన్సీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మహారాష్ట్రలో ప్రభుత్వం మారగానే..పవార్ కిఐటీ నోటీసులు వచ్చాయి...ఇది యాదృచ్ఛికంగా జరిగిందా? లేదా దీని వెనుక ఇంకేమైనా ఉందా?' అని ఎన్సీపీ నేత మహేశ్ తపస్‌ అనుమానాలు వ్యక్తం చేశారు.

మరోవైపు, రూ.1,043 కోట్లు విలువైన పాత్రచాల్​ భూకుంభకోణంలో శివసేన ముఖ్య నేత సంజయ్​ రౌత్ ఇవాళ ఈడీ ఎదుట హాజరయ్యారు. సంజయ్​ రౌత్,ఆయన కుటుంబ సభ్యులకు చెందిన రూ.11.15 కోట్లు విలువ చేసే ఆస్తులను ఏప్రిల్​లో ఈడీ జప్తు చేసింది. నగదు అక్రమ చలామణి వ్యవహారం కేసులో విచారణకు రావాలంటూ కొన్ని రోజుల క్రితమే ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ విచారణ నిమిత్తం రౌత్‌ నేడు ఈడీ ఎదుట హాజరయ్యారు.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Eknath Shinde, Income tax, NCP, Sharad Pawar

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు