NCB OFFICIAL SAMEER WANKHEDE HAS RESPONDED TO HIS DISMISSAL FROM THE TRIAL IN THE DRUGS CASE PRV
Aryan khan drugs case: డ్రగ్స్ కేసు నుంచి తనను తప్పించలేదన్న సమీర్ వాంఖడే.. అసలేం జరిగిందో వివరించిన ఎన్సీబీ అధికారి
సమీర్ వాంఖడే (ఫైల్)
బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ (Aryan khan) డ్రగ్స్ కేసులో (Mumbai Cruise Drug Case) విచారణ నుంచి ఎన్‌సీబీ (NCB) అధికారి సమీర్ వాంఖడేను (Sameer Wankhede NCB) తప్పించిన సంగతి తెలిసిందే. విచారణ బాధ్యతల నుంచి తప్పించడంపై సమీర్ వాంఖడే స్పందించారు.
బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ (Aryan khan) డ్రగ్స్ కేసులో (Mumbai Cruise Drug Case) విచారణ నుంచి ఎన్‌సీబీ (NCB) అధికారి సమీర్ వాంఖడేను (Sameer Wankhede NCB) తప్పించిన సంగతి తెలిసిందే. ఆయనపై అవినీతి ఆరోపణల నేపథ్యంలో విచారణను నుంచి తప్పిస్తున్నట్లు ఎన్‌సీబీ డీజీ (NCB DG) శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం వాంఖడే నేతృత్వంలోని ఎన్‌సీబీ ముంబయి జోన్ ఆర్యన్ ఖాన్ కేసును విచారిస్తుండగా.. ఇకపై ఎన్‌సీబీ సెంట్రల్ యూనిట్ దర్యాప్తు (NCB Drug Investigation) చేపట్టనుంది. ఆర్యన్‌ఖాన్ కేసు సహా మొత్తం ఐదు కేసులను సెంట్రల్ యూనిట్ (Central unit)కు బదలాయించారు. ఈ కేసులను ఎన్‌సీబీ అధికారి సంజయ్ సింగ్ విచారించనున్నారు.
డ్రగ్స్ కేసు వ్యవహారంలో విచారణ బాధ్యతల నుంచి తప్పించడంపై సమీర్ వాంఖడే స్పందించారు (responded to his dismissal from the trial in the drugs case). తనను ముంబై డ్రగ్స్ కేసుతో పాటు ఇతర కేసుల విచారణ బాధ్యతల నుంచి తనను ఎవరూ తప్పించలేదని తెలిపారు. కొన్ని కేసుల దర్యాప్తును ఇతర సంస్థలకు, అధికారులకు బదలాయించినట్లు ఉన్నతాధికారులు ప్రకటించడంతో అనుమానాలు రేకెత్తాయని ఆయన పేర్కొన్నారు.
ఢిల్లీ విభాగానికి చెందిన సిట్ కు బదిలీ..
ఎన్‌సీబీ డీడీజీ జ్ఞానేశ్వర్ సింగ్ మాట్లాడుతూ.. ‘ముంబై డ్రగ్స్ కేసు విచారణను ఎన్సీబీ ఢిల్లీ విభాగానికి చెందిన సిట్ కు బదిలీ చేశాం. సమీర్ వాంఖడే వాంగ్మూలాన్ని మేం రికార్డు చేసుకున్నాం. ఇది చాలా కీలకమైన దర్యాప్తు, కనుక ఇప్పుడే అన్ని విషయాలను బహిర్గతం చేయలేం. దర్యాప్తు ముమ్మరం చేశాం. సాక్షులను ఒక్కొక్కరిగా పిలిచి వాంగ్మూలాలు రికార్డ్ చేస్తున్నామని’ పేర్కొన్నారు.
తనపై ఆరోపణలు వస్తున్నందున ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని కోరుతూ తాను కోర్టులో పిటిషన్ దాఖలు చేశానని సమీర్ వాంఖడే స్పష్టం చేశారు. తన పిటిషన్‌కు స్పందనగా ముంబై డ్రగ్స్ కేసును ఎన్సీబీ ఢిల్లీ విభాగానికి చెందిన సిట్ దర్యాప్తు చేస్తుందని సమీర్ వాంఖడే వెల్లడించారు. వాంఖడే దర్యాప్తు చేస్తున్న 6 డ్రగ్స్ కేసులను ఇక నుంచి అధికారి సంజయ్ సింగ్ దర్యాప్తు చేయనున్నారు. కేసును ఒకరి నుంచి మరో అధికారికి గానీ, సంస్థకు బదలాయించడం మాత్రమే.. కేసు దర్యాప్తు నుంచి తొలగించారని ప్రచారం జరిగిందన్నారు.
ఏం జరిగింది..
అక్టోబర్ 2, 2021 రాత్రి ముం బయిలోని క్రూజ్ నౌకలో జరుగుతున్న డ్రగ్స్‌పార్టీపై వాం ఖడే నేతృత్వంలో ఎన్‌సీబీ దాడిచేసింది. ఈ దాడిలో షారుక్ కొడుకు ఆర్యన్ ఖాన్ అరెస్టయ్యారు. ఆ దాడి సమయంలో తాను కేపీ గోసావి అనే వ్యక్తితో కలిసి ఘటనాస్థలికి వెళ్లానని ఎన్‌సీబీ తరఫు 9మం ది సాక్షుల జాబితాలో ఉన్న ప్రభాకర్ తెలిపారు. ఎన్‌సీబీ తరఫున మరో సాక్షిగా ఉన్న గోసావికి తాను వ్య క్తిగత అం గరక్షకుడిగా పనిచేస్తున్నట్లు చెప్పా రు. ఆర్యన్‌ను ఎన్‌సీబీ కార్యా లయానికి తీసుకొచ్చాక శామ్ డిసౌజా అనే వ్య క్తితో గోసావి ఫోన్‌లో మాట్లాడాడని, రూ.25 కోట్లు డిమాం డ్ చేయాలని అతడికి చెబుతుండగా విన్నట్టు పేర్కొన్నారు.
చివరకు రూ.18 కోట్లకు ఖరారు చేయమని, అందులో రూ.8 కోట్లు వాం ఖడేకు ఇవ్వా ల్సి ఉందని డిసౌజాకు గోసావి చెప్పాడన్నా రు. ఆ తర్వా త గోసావి, డిసౌజాలను షారుక్ మేనేజర్ పూజా దద్లానీ కలిశారని చెప్పా రు. గోసావికి ఇద్దరు వ్య క్తులు రూ.50 లక్షలు ఇచ్చారని, అం దులో రూ.38 లక్షలు తిరిగి ఇచ్చాడని.. ఈ వివరాలన్నిం టినీ తాను కోర్టుకు సమర్పిం చిన అఫిడవిట్‌లో పేర్కొ న్న ట్లు తెలిపారు.
Published by:Prabhakar Vaddi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.