
INS Konaపై నుంచి మిసైల్ ప్రయోగం (Image: Indian Navy)
షిప్‌లను ధ్వంసం చేసే యాంటీ షిప్ మిసైల్‌ను భారత నేవీ విజయవంతంగా ప్రయోగించింది. INS Kora మీద నుంచి దీన్ని సక్సెస్‌ఫుల్‌గా ప్రయోగించింది.
షిప్‌లను ధ్వంసం చేసే యాంటీ షిప్ మిసైల్‌ను భారత నేవీ విజయవంతంగా ప్రయోగించింది. INS Kora మీద నుంచి దీన్ని సక్సెస్‌ఫుల్‌గా ప్రయోగించింది. అత్యంత దూరంలో ఉన్న టార్గెట్‌ను కూడా ఈ మిసైల్ కచ్చితంగా ఛేదించింది. బంగాళాఖాతంలో ఈ ప్రయోగం జరిగింది. టార్గెట్‌ను గురి పెట్టి మిసైల్‌ను ఫైర్ చేసిన ఫొటోలతో పాటు, టార్గెట్ షిప్‌కు కచ్చితంగా ఆ మిసైల్ తగలడం, అది మంటల్లో కాలిపోతున్న ఫొటోలను ఇండియన్ నేవీ ట్వీట్ చేసింది.
ఈ సందర్భంగా మరో విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. ఇటీవల INS Prabhal పై నుంచి జరిపిన క్షిపణి ప్రయోగం కూడా విజయవంతం అయింది. దీనికి సంబంధించిన వీడియోను కూడా ఇటీవలే ఇండియన్ నేవీ తన అధికారిక ట్విటర్ ఖాతాలో రిలీజ్ చేసింది. ఆ టెస్టు అరేబియా సముద్రంలో జరిగింది.
త్రివిధ దళాలను బలోపేతం చేయడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్‌కు ఆయుధ సంపత్తిని సమకూరుస్తోంది. తాజాగా, కేంద్ర ప్రభుత్వం ఆత్మనిర్భర్ భారత్ తీసుకొచ్చింది. అందులో త్రివిధ దళాలకు సంబంధించి కూడా కీలక నిర్ణయం తీసుకుంది. ఆత్మనిర్భర్ భారత్ నినాదాన్ని ముందుకు తీసుకెళ్లడంలో భాగంగా రక్షణ శాఖ అతి పెద్ద నిర్ణయాన్ని తీసుకుంది. ఆయుధాలు, యుద్ధ సామాగ్రి కలిపి మొత్తం 101 రకాల వస్తువుల దిగుమతులపై ఆంక్షలు విధించింది. రక్షణ శాఖ ఆంక్షలు విధించిన 101 వస్తువుల జాబితాలో.. ఆర్టిలరీ గన్స్, అసాల్ట్ రైఫిల్స్, సోనార్ సిస్టమ్స్, ట్రాన్స్ పోర్ట్ ఎయిర్ క్రాఫ్టులు, లైట్ వెహికల్స్, రాడార్ల వంటి కీలక సంపత్తి కూడా ఉండటం గమనార్హం. రక్షణ రంగంలో విదేశీ పెట్టుబడులకు విపరీతంగా అవకాశం కల్పించడం, ఇటీవలే ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేసిన రాఫెల్ ఫైటర్ జెట్స్ కు ఎక్కువ ధర చెల్లించారనే విమర్శలు వస్తోన్న నేపథ్యంలో ఇప్పుడు విదేశీ వస్తువుల దిగుమతలుపై మోదీ సర్కార్ ఆంక్షలు విధించడం కీలకంగా మారింది.
కరోనా అనంతర పరిస్థితుల్లో దేశ ఆర్థిక, తయారీ రంగం తిరిగి కోలుకునేలా, స్వదేశీ ఉత్పత్తులకు పెద్ద పీట వేస్తూ ప్రధాని మోదీ ''ఆత్మనిర్భర్ భారత్'' నినాదం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే టెలికాం సహా పలు శాఖలు విదేశీ దిగుమతులపై ఆంక్షలు విధించగా.. రక్షణ శాఖ సైతం ఆత్మనిర్భర్ నినాదాన్ని అందిపుచ్చుకుంది. శాఖా పరంగా ఇదొక చరిత్రాత్మక ముందడుగని మంత్రి రాజ్ నాథ్ అన్నారు.
Published by:Ashok Kumar Bonepalli
First published:October 30, 2020, 15:41 IST