గోవాలో కూలిన మిగ్-29కె యుద్ధ విమానం

కూలిన మిగ్ విమానం

టేకాఫ్ అయిన కాసేపటికే అకస్మాత్తుగా ఇంజన్‌లో మంటలు వ్యాప్తిచెందాయని అధికారులు తెలిపారు.

  • Share this:
    గోవాలో మిగ్-29 కె యుద్ధ విమానం కూలిపోయింది. అయితే ఈ ఘటనలో అందులో ఉన్న ఇద్దరు పైలెట్లు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ మేరకు నావికాదళం వర్గాలు తెలిపాయి. ప్రమాదానికి గురైన విమానం శిక్షణ కోసం ఉపయోగిస్తున్న యుద్ధ విమానమని నావికాదళ వర్గాలు ప్రకటించాయి. ఈ ఘటనపై నావీ కమాండర్ వివేక్ మద్వాల్ మాట్లాడుతూ ... హన్సా నుంచి టేకాఫ్ అయిన కాసేపటికే అకస్మాత్తుగా ఇంజన్‌లో మంటలు వ్యాప్తిచెందాయని అన్నారు. పైలెట్లు కెప్టెన్‌ ఎం. షీఖండ్, లెఫ్టినెంట్ కమాండర్ దీపక్ యాదవ్ సురక్షితంగా బయటపడినట్టు తెలిపారు.

    Published by:Sulthana Begum Shaik
    First published: