HOME »NEWS »NATIONAL »navy day 2020 know the history and importance of indian navy day sk gh

Indian Navy Day 2020: ఇండియన్ నేవీ డే.. ఇవాళే ఎందుకు జరుపుకుంటారో తెలుసా?

Indian Navy Day 2020: ఇండియన్ నేవీ డే.. ఇవాళే ఎందుకు జరుపుకుంటారో తెలుసా?
ప్రతీకాత్మక చిత్రం

Indian Navy Day 2020: ఐదు దశాబ్దాల క్రితం ఇదే రోజున ఇండో-పాక్ యుద్ధంలో ఆపరేషన్ ట్రైడెంట్‌లో భాగంగా PNS ఖైబర్‌ సహా నాలుగు పాకిస్థాన్ నౌకలపై ఇండియన్ నేవీ దాడులు చేసింది. ఈ ఆపరేషన్‌లో వందలాదిమంది పాకిస్థాన్ నేవీ సిబ్బందిని మనవాళ్లు చంపేశారు.

  • Share this:
నేడు ఇండియన్ నేవీ డే ((Indian Navy Day) భారతదేశ రక్షణ విభాగంలోని త్రివిధ దళాల్లో నావికాదళానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. ఇండియన్ నేవీ సాధించిన విజయాలకు గుర్తుగా ప్రతి సంవత్సరం డిసెంబర్ 4న దేశవ్యాప్తంగా నావికాదళ దినోత్సవంను నిర్వహిస్తారు. మరి ఇవాళే ఎందుకు జరుపుకుంటారు? దాని చరిత్రేంటి? అనే వివరాల్లోకి వెళ్తే.. 1971లో జరిగిన ఇండో-పాకిస్థాన్ యుద్ధంలో కరాచీ నౌకాశ్రయంపై దాడి చేసేందుకు ఇండియన్ నేవీ ఆపరేషన్ ట్రైడెంట్‌ను చేపట్టింది. దాదాపు ఐదు దశాబ్దాల క్రితం ఇదే రోజున ఇండో-పాక్ యుద్ధంలో ఆపరేషన్ ట్రైడెంట్‌లో భాగంగా PNS ఖైబర్‌ సహా నాలుగు పాకిస్థాన్ నౌకలపై ఇండియన్ నేవీ దాడులు చేసింది. ఈ ఆపరేషన్‌లో వందలాదిమంది పాకిస్థాన్ నేవీ సిబ్బందిని మనవాళ్లు చంపేశారు. యుద్ధంలో భాగంగా డిసెంబర్ 4- 5 మధ్యరాత్రి దాయాది దేశానికి చెందిన ఓడలకు మన నావికాదళం భారీ నష్టం కలిగించింది. ఆ దాడిలో పాల్గొన్న వీరుల పరాక్రమానికి గుర్తుగా ప్రతిఏటా డిసెంబరు 4న నేవీ డేను జరుపుకుంటారు.




ఆపరేషన్ ట్రైడెంట్:
ఇండియన్ నేవీ నిర్వహించిన అత్యంత విజయవంతమైన ఆపరేషన్‌లలో ‘ఆపరేషన్ ట్రైడెంట్‌’ ఒకటి. ఈ మిషన్‌లో మన నావికాదళానికి ఎలాంటి నష్టం కలగకపోవడం విశేషం. కరాచీలో మైన్ స్వీపర్, డిస్ట్రాయర్, మందుగుండు సామగ్రిని తీసుకెళ్తున్న కార్గో నౌక, ఫ్యూయెల్ స్టోరేజ్‌ ట్యాంకులపై ఇండియన్ నేవీ ప్రణాళిక ప్రకారం దాడులు చేసి, ఆ దేశానికి భారీ నష్టాన్ని కలిగించింది. ఆపరేషన్ ట్రైడెంట్లో మన దేశం తొలిసారిగా యాంటీ షిప్ మిసైల్స్‌ను వాడింది. INS నిపాత్, INS నిర్ఘాత్, INS వీర్ యుద్ధనౌకలు ఆపరేషన్‌లో పాల్గొని, అనుకున్న లక్ష్యాన్ని విజయవంతంగా పూర్తిచేశాయి.

పక్కా ప్రణాళికతో దాడులు:
గుజరాత్‌లోని ఓఖా పోర్ట్ (Okha Port) ద్వారా మన నేవీ సిబ్బంది పాకిస్థాన్ జలాల్లోకి ప్రవేశింశారు. ముందు మైన్ స్వీపర్ PNS ముహఫీజ్ పై దాడి చేసి, కరాచీలోని పాకిస్థాన్ నేవీ హెడ్ క్వార్టర్స్‌కు సిగ్నల్ పంపకుండా ఓడను విచ్ఛిన్నం చేశారు. మన టాస్క్ గ్రూపులో INS నిపాత్, INS నిర్ఘాత్, INS వీర్ అనే మూడు విద్యుత్-క్లాస్ మిసైల్ బోట్స్ ఉన్నాయి. వీటితో పాటు మరో రెండు యాటీ సబ్‌మెరైన్ అర్నాలా క్లాస్ వార్‌షిప్‌లైన INS కిల్తాన్, INS కాట్చాల్, INS పోషాక్ అనే ఒక ఫ్లీట్ ట్యాంకర్ కడా పాల్గొన్నాయి.

ఈ బృందానికి 25వ మిసైల్ బోట్ స్క్వాడ్రన్ కమాండింగ్ ఆఫీసర్, కమాండర్ బాబ్రూ భన్ యాదవ్ నాయకత్వం వహించారు. ఈ ఆపరేషన్లో పాల్గొన్న చాలామంది ఇండియన్ నేవీ సిబ్బందికి శౌర్య పురస్కారం లభించింది. నేవీ డే సందర్భంగా ప్రతి సంవత్సరం ముంబైలోని గేట్‌వే ఆఫ్ ఇండియా వద్ద బీటింగ్ రిట్రీట్ సెర్మనీని ఇండియన్ నేవీ నిర్వహిస్తుంది.
Published by:Shiva Kumar Addula
First published:December 04, 2020, 10:52 IST