Home /News /national /

NAVJOT SIDHU SPECIAL JAIL DIET CHART FLAX SEEDS CHAMOMILE TEA LASSI AND MORE PVN

Sidhu Special Jail Diet : జైలులో సిద్దూ డైట్ ఛార్ట్ చూస్తే బిత్తరపోవాల్సిందే

సిద్ధూ (ఫైల్ ఫోటో)

సిద్ధూ (ఫైల్ ఫోటో)

Sidhu Special Jail Diet : 1988 నాటి రోడ్ రేజ్ కేసులో పంజాబ్ కాంగ్రెస్ మాజీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూకి సుప్రీంకోర్టు గత గురువారం ఏడాది జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. గతంలో 2018 మార్చిలో ఈ కేసులో రూ. 1,000 జరిమానాతో సిద్ధూను విడిచిపెట్టారు.

ఇంకా చదవండి ...
Sidhu Special Jail Diet : 1988 నాటి రోడ్ రేజ్ కేసులో పంజాబ్(Punjab) కాంగ్రెస్ మాజీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ(Navjot Singh Sidhu)కి సుప్రీంకోర్టు గత గురువారం ఏడాది జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. గతంలో 2018 మార్చిలో ఈ కేసులో రూ. 1,000 జరిమానాతో సిద్ధూను విడిచిపెట్టారు. ఇప్పుడు, IPC సెక్షన్ 323 ప్రకారం గరిష్టంగా పడాల్సిన శిక్ష సిద్ధూకి విధించబడింది. 1988 డిసెంబర్ 27న గుర్నామ్ సింగ్ అనే వ్యక్తిపై సిద్దూ దాడి చేయడంతో అతడు మరణించారు. సిద్దూ రోడ్డు మధ్యలో తన జిప్సీ వాహనాన్ని నిలపడంతో... గుర్నామ్ సింగ్ దాన్ని తొలగించాలన్నారు. మాటా మాటా పెరగడంతో గొడవ పెద్దదైంది. ఈ ఘర్షణలో గుర్నామ్‌ సింగ్ మరణించడంతో అతడి కుటుంబ సభ్యులు కోర్టులో కేసు వేశారు. ఈ కేసులో దాదాపు 34 ఏళ్ల తర్వాత సుప్రీం కోర్టు .. తాజాగా సిద్దూకు ఏడాది పాటు జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. అయితే కేసు విచారణ అనేక మలుపులు తిరిగింది. తగిన ఆధారాలు లేవంటూ 1999 సెప్టెంబర్ 22న పాటియాల కోర్టు సిద్దూను నిర్దోషిగా ప్రకటించింది. దీనిపై బాధిత కుటుంబ సభ్యులు హరియాణా పంజాబ్ హైకోర్టును ఆశ్రయించారు. 2006లో పంజాబ్‌ హైకోర్టు ఈ కేసులో సిద్దూను దోషిగా ప్రకటించి 3 ఏళ్ల జైలు శిక్ష విధించింది. పంజాబ్ హైకోర్టు తీర్పుపై సిద్దూ సుప్రీం కోర్టుకు వెళ్లారు. 2018లో సుప్రీం త్రిసభ్య ధర్మాసనం సిద్దూను నిర్దోషిగా ప్రకటించి.. వెయ్యి రూపాయల జరిమానాతో సరిపెట్టింది. ఈ తీర్పుపై గుర్నామ్ కుటుంబ రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. మార్చి 25న వాదనలు ముగించిన సుప్రీం కోర్టు తీర్పు రిజర్వ్ లో పెట్టింది. తాజాగా ఏడాది పాటు జైలు శిక్ష ఖరారు చేసింది.

అయితే తన వైద్య వ్యవహారాల నిర్వహణ నిమిత్తం తనకు లొంగిపోయేందుకు కొన్ని వారాల సమయం కావాలని సిద్దూ తన న్యాయవాది ద్వారా శుక్రవారం ఉదయం కోర్టును అభ్యర్థించారు. అయితే సాయంత్రానికి పాటియాలా కోర్టులో సిద్దూ లొంగిపోయారు. అధికారిక వర్గాల సమాచారం ప్రకారం... సిద్ధూకు పాటియాలా సెంట్రల్ జైలులో ఒక టేబుల్, ఒక కుర్చీ, రెండు తలపాగాలు, ఒక అల్మారా, ఒక దుప్పటి, మూడు సెట్ల లోదుస్తులు, రెండు టవల్స్, ఒక దోమ తెర, ఒక పెన్, ఒక నోట్‌బుక్, ఒక జత బూట్లు, రెండు బెడ్ షీట్లు, నాలుగు జతల కుర్తా పైజామాలు, రెండు దిండు కవర్లు ఇచ్చారు. అతని ఖైదీ నంబర్ 241383. నవజ్యోత్ సింగ్ సిద్ధూకు బ్యారక్ నంబర్ 7గా కేటాయించబడినట్లు సమాచారం.

ALSO READ  Karnataka : యడియూరప్ప కుమారుడికి బీజేపీ బిగ్ షాక్..టిక్కెట్ నిరాకరించిన అధిష్ఠానం..శాంతించాలని మద్దతుదారులకు విజయేంద్ర పిలుపు

అయితే.. శిక్ష ప్రారంభ‌మైన రోజు నుంచి సిద్దూ జైలు తిండి తిన‌డానికి ఏమాత్రం ఆస‌క్తి చూప‌డం లేద‌ట‌. జైలు అధికారులు ఇచ్చే దాల్ రోటీని తిర‌స్క‌రిస్తున్నార‌ట‌. దీంతో ఆయ‌న ఆరోగ్యం క్షీణించిన‌ట్లు సమాచారం. దీంతో జైలు అధికారులు సిద్దూ ఆరోగ్య విష‌యంలో డాక్టర్లను సంప్ర‌దించారు. దీంతో డాక్లర్లు ప్ర‌త్యేకంగా ఓ డైట్ ఛార్ట్‌నే రూపొందించి, జైలు అధికారుల‌కు ఇచ్చారు.

డైట్ చార్ట్ ప్రకారం... ఉదయం పూట రోజ్‌మేరీ టీ మరియు అర గ్లాసు పెటా జ్యూస్ లేదా కొబ్బరి నీళ్ళు. అల్పాహారం కోసం లాక్టోస్ లేని పాలు, 1 టేబుల్ స్పూన్ గింజలు (అవిసె/పొద్దుతిరుగుడు/పుచ్చకాయ/చియా) మరియు బాదం, వాల్‌నట్‌లు మరియు పెకాన్ గింజల వంటి గింజలు. మధ్యాహ్నానికి ఏదైనా ఒక పండు లేదా కూరగాయల రసాన్ని( (పుచ్చకాయ, స్ట్రాబెర్రీ మరియు జామ లేదా ఆపిల్) ఇవ్వాలని సూచించింది.

మధ్యాహ్న భోజనంలో జొన్న పిండితో చేసిన ఒక చపాతీ, సింహారా పిండి మరియు రాగుల పిండితో సీజనల్ గ్రీన్ వెజిటేబుల్స్ మరియు రైతా ఉంటాయి. మధ్యాహ్న భోజనంలో బీట్‌రూట్ రైతా, ఒక గిన్నె గ్రీన్ సలాడ్ మరియు లస్సీని సిఫార్సు చేశారు డాక్టర్లు.

ALSO READ  Shocking : ఒక స్కూటర్ పై ఆరుగురు ప్రయాణం..వీడియో వైరల్

సాయంత్రం పూట తక్కువ కొవ్వు పాలు టీ మరియు సగం నిమ్మకాయతో పనీర్ స్లైస్ లేదా టోఫు. రాత్రి భోజనం కోసం మిక్స్డ్ వెజిటబుల్ మరియు దాల్ సూప్ లేదా సాల్టెడ్ గ్రీన్ వెజిటేబుల్స్‌తో బ్లాక్ చన్నా సూప్‌. చమోమిలే టీ మరియు సైలియం పొట్టు రాత్రావేళ సిద్దూకి ఇవ్వాలని డాక్టర్లు సూచించారు.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Diet, Navjot Singh Sidhu, Punjab

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు