ముస్లింలంతా కాంగ్రెస్‌కి ఓటు వేయాలి... సిద్ధూ వ్యాఖ్యలపై చర్యలకు బీజేపీ డిమాండ్...

Lok Sabha election 2019 : మాయావతి రూట్‌లోనే సిద్ధూ కూడా వెళ్తున్నారు. మరి కేంద్ర ఎన్నికల సంఘం ఆయనపై చర్యలు తీసుకుంటుందా...

Krishna Kumar N | news18-telugu
Updated: April 16, 2019, 7:52 PM IST
ముస్లింలంతా కాంగ్రెస్‌కి ఓటు వేయాలి... సిద్ధూ వ్యాఖ్యలపై చర్యలకు బీజేపీ డిమాండ్...
నవజ్యోత్ సింగ్ సిద్ధూ
  • Share this:
క్రికెటర్ నుంచీ రాజకీయ నేతగా మారిన నవజ్యోత్ సింగ్ సిద్ధూ వివాదంలో చిక్కుకున్నారు. బీహార్ లోక్ సభ ఎన్నికల్లో పాల్గొన్న ఆయన... ముస్లింలు కాంగ్రెస్‌కి ఓటు వేయాలనీ, తద్వారా ప్రధాని మోదీ అధికారంలోకి రాకుండా చెయ్యాలని కోరారు. కతిహార్‌లో ర్యాలీ నిర్వహిస్తూ ఆయన ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వెటరన్ కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి తారిఖ్ అన్వర్‌ తరపున ప్రచారం చేస్తూ... ఆయన చేసిన కామెంట్లపై బీజేపీ మండిపడుతోంది. మతపరంగా ఓట్లు కోరడం ఎన్నికల కోడ్‌కి వ్యతిరేకమన్న ఆ పార్టీ నేతలు... కేంద్ర ఎన్నికల సంఘం ఈ విషయాన్న సుమోటోగా తీసుకొని... సిద్ధూపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

మీరు (ముస్లింలు) తక్కువ సంఖ్యలో ఉన్నారని అనుకోవద్దు. ఇక్కడ మీరు ఎక్కువ మందే ఉన్నారు. దాదాపు 64 శాతం మంది ఉన్నారు. అసదుద్దీన్ ఒవైసీ లాంటి నేతల మాటలు విని ఉచ్చులో చిక్కుకోకండి. వాళ్లంతా బీజేపీ చెప్పుచేతల్లో ఉంటున్నవాళ్లే. మీరంతా ఒక్కటై ఓటు వేస్తే... ప్రధాని నరేంద్ర మోదీ ఓడిపోక తప్పదు.
ఎన్నికల ప్రచారంలో నవజ్యోత్ సింగ్ సిద్ధూ


సిద్ధూ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ఫుటేజ్‌ను టీవీ ఛానెళ్లు ప్రసారం చేశాయి. బీహార్‌లోని సీమాంచల్ ఏరియాలో కాంగ్రెస్ తరపున ప్రచారం చేసిన పంజాబ్ మంత్రి కూడా ఈ వీడియోలో ఉన్నారు. కతియార్‌తోపాటూ పక్కనే ఉన్న కిషన్‌గంజ్‌లో ముస్లింల సంఖ్య ఎక్కువ. ఇక్కడ ఎంఐఎం తమ అభ్యర్థిని నిలబెట్టింది. ఇలాంటి వ్యాఖ్యలే చేసిన బీఎస్పీ అధినేత్రి మాయావతిపై కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది. మరి సిద్ధూపైనా చర్యలుంటాయా అన్నది రెండ్రోజులలో తేలనుంది.

 

ఇవి కూడా చదవండి :

దయచేసి అలాంటి వార్తలు ఇవ్వొద్దు... మీడియాకు తెలంగాణ సీఈసీ రజత్ కుమార్ వినతి

అంబటి రాయుడు త్రీడీ గ్లాసెస్ ట్వీట్... టీంఇండియా సెలెక్టర్లపై సెటైర్ వేసేశాడుగా...తమిళనాడులో ఐటీ దాడులు... చంద్రబాబు టార్గెట్‌గా చేయించారా...

మాయావతి షూస్ పాలిష్ చేసేలా చేస్తాను... మరో వివాదంలో అజంఖాన్...
First published: April 16, 2019, 7:52 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading