హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

National Voters Day: నేడు జాతీయ ఓటర్ల దినోత్సవం.. ఓటు హక్కుపై దేశవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు.. ఈ ఏడాది ప్రత్యేక థీమ్ ఏంటో తెలుసా?

National Voters Day: నేడు జాతీయ ఓటర్ల దినోత్సవం.. ఓటు హక్కుపై దేశవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు.. ఈ ఏడాది ప్రత్యేక థీమ్ ఏంటో తెలుసా?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

భారత్‌లో జనవరి 25వ తేదీకి ఒక ప్రత్యేకత ఉంది. ఈ రోజు దేశవ్యాప్తంగా జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని (National Voters’ Day) నిర్వహిస్తారు.

భారత్‌లో జనవరి 25వ తేదీకి ఒక ప్రత్యేకత ఉంది. ఈ రోజు దేశవ్యాప్తంగా జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని (National Voters’ Day) నిర్వహిస్తారు. దేశంలో ఎన్నికల కమిషన్ (Election Commission of India- ECI)ను ఏర్పాటు చేసిన సందర్భంగా నేషనల్ ఓటర్స్ డేను నిర్వహిస్తున్నారు. భారత ఎన్నికల సంఘం 1950లోనే ఏర్పడింది. కానీ 2011 నుంచే ఈ వేడుకలను అధికారికంగా నిర్వహిస్తున్నారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం దేశంలో ఎలక్షన్ కమిషన్ ఉండాలి. ఎన్నికల సంఘంలోని సభ్యులను భారత రాష్ట్రపతి నియమిస్తారు. ఈ సంవత్సరం 11వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని అధికారులు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. యువత రాజకీయ కార్యకలాపాల్లో నిమగ్నం అయ్యేలా చూడాలనేది నేషనల్ ఓటర్స్ డే లక్ష్యం. ఇందుకు ప్రతి సంవత్సరం జనవరి 1 నాటికి 18 సంవత్సరాలు నిండిన వారిని గుర్తించి, వారిపేరుతో ఓటు నమోదు చేయాలి. జనవరి 25న కొత్త ఓటర్లకు ఎన్నికల ఫోటో గుర్తింపు కార్డును అందజేస్తారు.

ఏ ఒక్క ఓటరునూ విడిచిపెట్టకూడదనే నినాదంతో ఈ కార్యక్రమం జరుగుతోంది. యువత, వృద్ధులు ఓటు హక్కును వినియోగించుకోవాలని, ప్రజా ప్రతినిధులను ఎన్నుకునే ప్రజాస్వామ్య ప్రక్రియలో ప్రతి ఒక్కరూ భాగం కావాలని ప్రభుత్వం ఆశిస్తోంది. దీనిపై అవగాహన పెంచేందుకు ప్రభుత్వం, ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలల్లో క్విజ్‌లు, చర్చలు, మాక్ పోల్స్ నిర్వహిస్తున్నాయి.

* ప్రాధాన్యత ఏంటి?

మన దేశంలో ఒక దశలో యువ ఓటర్ల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో అధికారులు ఆందోళన చెందారు. యువతకు ఓటు హక్కుపై అవగాహన పెంచేందుకు, దేశ భవిష్యత్తులో వారిని భాగం చేయాలనే ఉద్దేశంతో నేషనల్ ఓటర్స్ డేకు రూపకల్పన చేశారు. యువతీయువకులకు 18ఏళ్లు రాగానే ఓటు నమోదు చేసుకునేందుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. "ఓటరుగా గర్వపడండి, ఓటు వేయడానికి సిద్ధమవ్వండి" అనే నినాదంతో యువ ఓటర్ల సంఖ్యను పెంచేందుకు ఎన్నికల సంఘం విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతోంది.

* ఈ సంవత్సరం ప్రత్యేక థీమ్

జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం జనవరి 25వ తేదీన ఒక ప్రత్యేక థీమ్‌తో ఎన్నికల సంఘం కార్యక్రమాలు నిర్వహిస్తుంది. 2020లో బలమైన ప్రజాస్వామ్యానికి ఎన్నికలపై అవగాహన పెంచడం (Electoral Literacy for Stronger Democracy) అనే థీమ్‌ను తీసుకున్నారు. ఈ సంవత్సరం "ఓటర్లకు సాధికారత, జాగరూకత, భద్రత కల్పిస్తూ, సమాచారాన్ని అందించటం" (Making our voters empowered, vigilant, safe and informed) అనే థీమ్‌తో ఎన్నికల సంఘం అవగాహన కార్యక్రమాలు చేపడుతోంది.

First published:

Tags: National News

ఉత్తమ కథలు