హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

National Politics: రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో బీజేపీ స‌రికొత్త వ్యూహం.. అత‌నేనా రాష్ట్రప‌తి అభ్య‌ర్థి!

National Politics: రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో బీజేపీ స‌రికొత్త వ్యూహం.. అత‌నేనా రాష్ట్రప‌తి అభ్య‌ర్థి!

National Politics | దేశ వ్యాప్తంగా బీజేపీ వ్య‌తిరేక కూట‌మి అంతా ఒక్క‌టి కాబోతున్నాయి. అయితే త్వ‌ర‌లో రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌లు స‌మీపిస్తున్న నేప‌థ్యంలో బీజేపీ రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి ఎన్నిక‌ల్లో ఆచితూచి వ్య‌వ‌హిస్తుంది అన‌డంలో సందేహం లేదు. అయితే తాజాగా ఢిల్లీ స‌ర్కిల్‌లో ఓ కొత్త వార్త చ‌క్క‌ర్లు కొడుతుంది.

ఇంకా చదవండి ...

  దేశ వ్యాప్తంగా బీజేపీ (BJP) వ్య‌తిరేక కూట‌మి అంతా ఒక్క‌టి కాబోతున్నాయి. అయితే త్వ‌ర‌లో రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌లు స‌మీపిస్తున్న నేప‌థ్యంలో బీజేపీ రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి ఎన్నిక‌ల్లో ఆచితూచి వ్య‌వ‌హిస్తుంది అన‌డంలో సందేహం లేదు. అయితే తాజాగా ఢిల్లీ స‌ర్కిల్‌లో ఓ కొత్త వార్త చ‌క్క‌ర్లు కొడుతుంది. అదే.. బిహార్‌ ముఖ్యమంత్రి, జేడీయూ నేత నితీశ్‌ కుమార్‌ (Nitish Kumar) భారత రాష్ట్రపతి కాబోతున్నారు..ఈ అంశం ఇప్పుడు బిహార్‌ రాజకీయాల్లో కలకలం సృష్టించాయి. ప్రస్తుత రాష్ట్రపతి కోవింద్‌ పదవీ కాలం కొద్ది నెలల్లో ముగియబోతున్న నేపథ్యంలో రాష్ట్రపతి (President) గా నితీశ్‌ అనే వార్త ప్రాధాన్యం సంతరించుకుంది. ప్ర‌తిప‌క్షాలు ఒక్క‌ట‌వుతున్న వేళ ఇటువంటి నిర్ణ‌యం బీజేపీ తీసుకొంటుందా అనేది ప్ర‌ధాన అంశం.

  Ukraine Crisis: వీటి ధ‌ర‌లు పెరిగే అవ‌కాశం.. ఇండియాపై ర‌ష్యా-ఉక్రెయిన్ సంక్షోభం ప్ర‌భావం

  శివ‌సేన నుంచి మ‌ద్ద‌తు..

  నితీశ్‌ రాష్ట్రపతి పదవికి పోటీ చేస్తే తమ పార్టీ మద్దతునిస్తుందని ఎన్‌సీపీ నేత నవాబ్‌ మాలిక్‌ వ్యాఖ్యానించారు. అయితే ముందుగా నితీశ్‌ బీజేపీతో మైత్రి వదులుకోవాలని సూచించారు. ఈ విషయమై నితీశ్‌ను మీడియా ప్రశ్నించగా, అసలు అలాంటి ఆలోచనే తనకు లేదని చెప్పారు. నితీశ్‌ మిత్రపక్షం బీజేపీ కూడా ఈ విషయమై ఎలాంటి కామెంట్లు చేయలేదు. లోక్‌సభ (Lok Sabha) లో బీజేపీకి భారీ మెజార్టీ ఉన్నా, రాష్ట్రపతిగా తనకు నచ్చిన అభ్యర్ధిని ఎన్నిక చేయాలంటే బీజేపీకి ఇతర పార్టీల మద్దతు అవసరం. అందుకే నితీశ్‌ లాంటి క్లీన్‌ ఇమేజ్‌ ఉన్న వ్యక్తిని బీజేపీ నిలబెట్టవచ్చని ఊహాగానాలు వ‌స్తున్నాయి.

  నితీష్ రాష్ట్ర‌ప‌తి అయితే ఏం లాభం..

  దేశంలో కాంగ్రెస్ కాకుండా అన్ని పార్టీలు ప్ర‌త్యేక ఫ్రంట్ ఏర్పాటు చేయాల‌ని ప్ర‌య‌త్నాలు సాగుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ఆంధ్రప్ర‌దేశ్ సీఎం జ‌గ‌న్‌, ఒడిశా సీఎం న‌వీన్ ప‌ట్నాయ‌క్‌, బీహార్ సీఎం నితీష్ వీరిలో ఎవ‌రు చేరినా కూట‌మి మ‌రింత బ‌లోపేతం అవుతుంద‌న‌డంలో సందేహంలేదు. తెలంగాణ సీఎం కేసీఆర్ (KCR), మహారాష్ట్ర సీఎం ఉద్దవ్‌, అరవింద్‌ కేజ్రీవాల్, మమతా బెనర్జీలను కలిపి ఐక్య కూటమి నిర్మించాలన్నది ప్రతిపక్ష ప్రణాళిక అయితే కూట‌మిలో కాంగ్రెస్ ఉండ‌కుండా చూడాలి అనేది మమ‌తా వాద‌న‌.

  Ukraine Crisis: అవ‌స‌రాలు, అహం, ఆత్మాభిమానం.. ఉక్రెయిన్ సంక్షోభానికి కార‌ణాలు ఏంటీ?

  ఏపీ సీఎం జ‌గ‌న్ ఇప్ప‌ట్లో కూట‌మి వైపు చూసే అవ‌కాశం త‌క్కువ‌గా ఉంది. న‌వీన్ పట్నాయ‌క్ ఈ రాజ‌కీయ అంశాల‌పై ఇప్ప‌టికీ పెద‌వి విప్ప‌లేదు. ఇక నితీష్‌ను కూట‌మిలోకి లాగాల‌నే ప్ర‌య‌త్నం చేస్తున్నాయి ప్ర‌తిప‌క్షాలు. ఒక వేళ నితీష్ రాష్ట్ర‌ప‌తిగా ఎంపిక‌చేస్తే ప్ర‌తిప‌క్షాల ఆశాల‌కు గండి కొట్టిన‌ట్టు ఉంటుందని బీజేపీ భావించ వ‌చ్చు. కానీ ఇది ఎంత ల‌బ్ధి అనేది ఇప్ప‌ట్లో చెప్ప‌లేని ప‌రిస్థితి.

  రాష్ట్రపతి పదవికి నితీశ్‌ సరిపోతారని బిహార్‌ మాజీ సీఎం జితన్‌రామ్‌ మాంజీ అభిప్రాయప‌డ్డారు..బిహారీగా నితీశ్‌ రాష్ట్రపతి అయితే సంతోషిస్తామని ఆర్‌జేడీ నేత మృత్యంజయ్‌ తివారీ అన్నారు. కానీ లాలూ, ల్‌జేపీ నేత చిరాగ్‌ పాశ్వాన్‌ మాత్రం నితీశ్‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు.

  First published:

  Tags: Bihar, Bjp, Congress, Nitish Kumar

  ఉత్తమ కథలు