Home /News /national /

Navratna oil: నవరత్న ఆయిల్ అంత పని చేసిందా..? బాత్ రూమ్ పైప్ లైన్లోకి దూరిన పాము.. చివరికి ఏం జరిగిందంటే..?

Navratna oil: నవరత్న ఆయిల్ అంత పని చేసిందా..? బాత్ రూమ్ పైప్ లైన్లోకి దూరిన పాము.. చివరికి ఏం జరిగిందంటే..?

పామును పట్టుకునేందుకు నవరత్న ఆయిల్

పామును పట్టుకునేందుకు నవరత్న ఆయిల్

How to Catch Snake: ఓ మ్యాన్‌హోల్‌ లోకి పెద్ద పాము దూరింది. అది చూసిన వారంతా హడలిపోయారు. అది అటు నుంచి ఎవరి ఇంట్లోకైనా దూరితే పరిస్థితి ఏంటి అని భయపడ్డారు. అయితే అక్కడికి చేరుకున్న పాముల పట్టే టీమ్ చేసిన పని చూసి అంతా షాక్ కు గురయ్యారు.

ఇంకా చదవండి ...
    Navratna oil Catch Snake: సాధారణంగా నవరత్న ఆయిల్ (Navratna Oil) ను ఏఏ సందర్భాల్లో వాడుతారంటే.. తలనొప్పి (Headache) గా ఉంది అంటే ఇంట్లో తలకు ఆయిల్ రాసుకుంటారు.. బయట బాగా అలసి పోయి వచ్చినప్పుడు కూల్ కూల్ గా ఉండేందుకు కూడా నవరత్న ఆయిల్ వాడుతారు. ఇక సెలూన్ షాపు (Saloon Shop)ల్లో అయితే కచ్చితంగా నవరత్న ఆయిల్ ఉండాల్సిందే.. చాలామంది హెడ్ మసాజ్ (Head Message) చేయించుకునేందుకే సెలూన్ షాపులకు వెళ్లేవారు ఉంటారు. తల నొప్పి ఉన్నలేకున్నా.. కాసేపు రిలాక్స్ అవ్వడానికి నవరత్న ఆయిల్ తో మసాజ్ చేయిస్తారు. కానీ దీనిని ఈ మధ్య పాములను పట్టడాని (Snake Catchers)కి కూడా ఉపయోగించేస్తున్నారు.. వినడానికి నమ్మకంగా లేదా.. ఇది అసాధ్యం అని అనుకుంటున్నారా? కానీ అది నిజం.. హర్యానా (Haryana Satate) లో చోటు చేసుకున్న ఓ ఘటన గురించి వింటే మీరు కూడా దీన్ని నిజం అని అంగీకరిస్తారు. అసలు విషయం ఏంటంటే..? హర్యానాలోని పతేహాబాద్ ప్రాంతంలో ఉన్న ఓ ఇంట్లోకి మంగళవారం ఓ పాము దూరింది. దీంతో ఆ పాము (Snake)ను పట్టుకునేందుకు నవరత్న ఆయిల్ వాడారు..

    ఈ ఘటన హర్యానాలోని పతేహాబాద్ ప్రాంతంలో ఉన్న ఓ ఇంట్లోకి ఓ పాము దూరింది. దీంతో భయాందోళనలకు గురైన కుటుంబ సభ్యులు హడావిడి చేయడంతో అదికాస్తా వేళ్లి.. బాత్‌రూంలోని పైప్‌లైన్‌ (Bathroom Pipeline)లో దూరింది. ఈ క్రమంలో ఆ కుటంబ సభ్యులు వైల్డ్‌లైఫ్ (Wild life) అధికారులకు సమాచారం ఇచ్చారు.

    ఇదీ చదవండి: రియల్ లైఫ్ లో స్పైడర్ సినిమా.. శ్మశానంలో కాపురాలు.. సమాధులే పట్టు పరుపులు.. ఎక్కడో తెలుసా?

    నవజోత్ ధిల్లాన్ అనే అధికారి తన టీంతో సహా అక్కడికి చేరుకున్నారు. తరువాత పైపులో దూరిన పామును పట్టుకునేందకు మొదట అందులో కొన్ని నీళ్లు పోశారు. అనంతరం కొంచెం నవరత్న ఆయిల్‌ను పోశారు. ఆయిల్ పోసిన కొద్ది సేపటికే ఆ పాము పైపులోంచి బయటికొచ్చింది.

    ఇదీ చదవండి: కోడిగుడ్లు కోసం అప్పు ఇవ్వలేదని పుస్తెల తాడు తెంపాడు.. కానీ చివరికి ఏం చేశాడంటే..?

    దీంతో దాన్ని బంధించిన అధికారులు.. సురక్షిత ప్రాంతంలో వదిలిపెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడిన నవజోత్ ధిల్లాన్.. ఆ పాముకు విషం ఉండదని వెల్లడించారు. అంతేకాకుండా పామును పట్టుకునేందకు తాను నవరత్న ఆయిల్‌ను ఉపయోగించినట్లు పేర్కొన్నారు. ఆయిల్‌ వాసనకు పాము బయటకు వచ్చినట్లు చెప్పారు. కాగా.. ప్రస్తుతం ఈ అంశం స్థానికంగా చర్చనీంశం అయింది. ఈ విషయం వైరల్ గా మారడంతో.. ఇకపై నవరత్న ఆయిల్ కు డిమాండ్ పెరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

    ఇదీ చదవండి: 2024 నాటికి ఏపీలో మారనున్న రాజకీయాలు.. ఎవరు ఎవరితో పొత్తుపై క్లారిటీ..?
    Published by:Nagesh Paina
    First published:

    Tags: Haryana, India, National News, Snake

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు