హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Subrata Mukherjee: సీనియర్ మంత్రి సుబ్రతా ముఖర్జీ ఇక లేరు.. అనారోగ్యంతో ఆస్పత్రిలో కన్నుమూత

Subrata Mukherjee: సీనియర్ మంత్రి సుబ్రతా ముఖర్జీ ఇక లేరు.. అనారోగ్యంతో ఆస్పత్రిలో కన్నుమూత

 సుబ్రతా ముఖర్జీ ఇక లేరు

సుబ్రతా ముఖర్జీ ఇక లేరు

Subrata Mukherjee: అనారోగ్యం కారణంగా ఓ మంత్రి  (Minster) కన్నుమూశారు. రాజకీయంలో సీనియర్‌ నేతగా, మంత్రిగా ఉన్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. పశ్చిమ బెంగాల్‌ (West Bengal) తృణమూల్‌ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి 75 ఏళ్ల సుబ్రతా ముఖర్జీ (Subrata Mukherjee) మరణించారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ఎస్‌ఎస్‌కేఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రాత్రి కన్నుమూశారు. అయితే వారం రోజుల కిందట ఆయనకు శ్వాస సంబంధమైన ఇబ్బందులు తలెత్తడంతో వెంటనే కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆయనను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఆయన మరణ వార్తను ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Chief MInster Mamata Banerjee ) వెంటనే ఆస్పత్రికి వెళ్లారు. సుబ్రతా మృతి పట్ల మమతా తీవ్ర దిగ్ర్బాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణాన్ని ఆమె జీర్ణించుకోలేకపోయారు. సుబ్రతా మరణం వల్ల తనకు వ్యక్తిగతంగా ఎంతో నష్టమని, ఆయన లోటు తీరనిదని అన్నారు. కాగా, మమతా మంత్రివర్గంలో కీలక మంత్రిగా పని చేసిన ఆయన పంచాయతీరాజ్‌ శాఖతో సహా పలు ఇతర శాఖల బాధ్యతలు కూడా చేపట్టారు. ఆయన తృణమూల్‌ కాంగ్రెస్‌ (Trinamool Congress)లో కీలక బాధ్యతలు చేపట్టి మంత్రి వరకు ఎదిగారు. 26 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడే సిద్ధార్థ శంకర్‌ రే నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వంలో అతి పిన్న వయస్కుడైన మంత్రులలో సుబ్రతా ముఖర్జీ ఒకరు.

2000 నుంచి 2005 వరకు కోల్‌కతా మున్సిపల్‌ కార్పొరేషన్‌కు మేయర్‌గా కూడా పని చేశారు. 1999 వరకు కాంగ్రెస్‌ పార్టీలో ఉన్నారు. ప్రియా రంజన్‌ దాస్కున్షి, సోమేంద్రనాథ్‌ మిత్ర వంటి ప్రముఖ నాయకులలో ఆయన ఒకరు.1999లో తృణమూల్‌ కాంగ్రెస్‌లో చేరి, 2005 వరకు పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించారు.

ఇదీ చదవండి : ఆ ప్రాంతంతో దీపావళి వేడుకలు ఐదు రోజులు.. కాకి, కుక్క, ఎద్దులకు పూజ

2011లో మమతా బెనర్జీ ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఐదు దశాబ్దాల పాటు సాగిన తన రాజకీయ జీవితంలో కోల్‌కతాలోని బల్లిగంజ్‌, చౌరింగీతో సహా పలు అసెంబ్లీ నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహించారు.

ఇదీ చదవండి : కుప్పం క్లీన్ స్వీప్ టార్గెట్‌గా వైసీపీ వ్యూహం.. పరువు కోసం టీడీపీ ప్రయత్నం.. చంద్రబాబు పర్యటన తరువాత ఏం జరగబోతోంది..?

2011లో అసెంబ్లీ ఎన్నికల్లో బల్లిగంజ్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన మృతిపై పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ నేతలు సైతం ఆయన లేని లోటు తీరనిది అని.. గతాన్ని గుర్తు చేసుకుంటున్నారు. అధికార పార్టీతో పాటు, మమతా బెనర్జీకి ఇది తీరని లోటే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు..

ఇదీ చదవండి : కార్తీక మాసంలో వన భోజనాలు ఎందుకు..? ఉసిరి చెట్టుకింద భోజనం విశిష్టత ఏంటి..?

First published:

Tags: India news, National News, Politics, West Bengal

ఉత్తమ కథలు