హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

NIA Alert : వీళ్లను పట్టిస్తే రూ.20లక్షల రివార్డ్.. NIA ప్రకటన

NIA Alert : వీళ్లను పట్టిస్తే రూ.20లక్షల రివార్డ్.. NIA ప్రకటన

NIA Announcement

NIA Announcement

ఎవరైనా వారిని గుర్తుపట్టినా.. ఎక్కడ ఉన్నారో సమాచారం తెలిసినా తమను సంప్రదించాలని కోరారు. అందుకోసం కొన్ని ఫోన్ నంబర్లను కూడా సూచించారు.

NIA : నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ((NIA) అధికారులు ముగ్గురు సీపీఐ మావోయిస్టులపై కేసు నమోదు చేశారు. వారిపై భారీ నగదు రివార్డు ప్రకటించారు. ఎవరైనా వారిని గుర్తుపట్టినా.. ఎక్కడ ఉన్నారో సమాచారం తెలిసినా తమను సంప్రదించాలని కోరారు. అందుకోసం కొన్ని ఫోన్ నంబర్లను కూడా సూచించారు.

ఈ ముగ్గురు సీపీఐ మావోయిస్టుల ఆచూకీ చెప్పినవారి పేరు, ఊరు, వివరాలు గోప్యంగా ఉంచుతామని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులు భరోసా ఇచ్చారు. నక్సలైట్ల పేరుపై ఉన్న రివార్డు డబ్బులను వారికి అందిస్తామని తెలిపారు.

ముగ్గురు సీపీఐ మావోయిస్టు ముగ్గురు వివరాలు

1.

పేరు : అమిరుద్దీన్ అహ్మద్@ అమిరుద్దీన్ లాస్కర్ @ సునిల్ @ రామ చౌదరి @ రామదాస్ @ సూర్య

తండ్రి : ఆరిఫ్ ఉద్దీన్ హైమద్

నివాసం : సత్సిపోకియా.. పోస్ట్ జాందర్హత.. జిల్లా దుబ్రీ.. రాష్ట్రం అస్సాం

ఇతడిపై రూ.5 లక్షల క్యాష్ రివార్డ్ ను అధికారులు ప్రకటించారు

2.

పేరు : నిర్మల బిస్వాస్ @ నిర్మలాదేవి @ సీమ విశ్వాస్ @ కొనిక @నిము @ స్వప్న@ టీనా

తండ్రి : సుభాయి బిస్వాస్

నివాసం : కలిపూర్.. జిల్లా నదియా.. రాష్ట్రం వెస్ట్ బెంగాల్

ఈమెపై రూ.5 లక్షల క్యాష్ రివార్డ్ ఉంది.

3.

పేరు : సభ్యసచి గోస్వామి@ కిషోర్ దా @ బాబు@ పంకజ్@ అజయ్

తండ్రి : సుధా చంద్ర గోస్వామి

నివాసం : ఘోలా బారక్ పూర్.. వెస్ట్ బెంగాల్

ఇతడిపై రూ.10 లక్షల క్యాష్ రివార్డ్ ఉంది


వీరి సమాచారం అందించాల్సిన ఫోన్ నంబర్లు ఇవీ.

NIA నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ

సీజీవో కాంప్లెక్స్

లోధి రోడ్

న్యూఢిల్లీ పిన్ - 110003

ఇమెయిల్ అడ్రస్ info.nia@gov.in

ఫోన్ నెంబర్

011-24368800.

మొబైల్ నెంబర్ 9859161420, 9436054792

First published:

Tags: Assam, Maoist, NIA, Reward