సోనియా, రాహుల్ గాంధీలకు షాక్.. ఆ కేసులో నోటీసులు జారీచేసిన ఢిల్లీ హైకోర్టు..

సోనియా, రాహుల్(ఫైల్ ఫొటో) (Image-PTI)

కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆమె కుమారుడు రాహుల్ గాంధీకి ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీచేసింది.

 • Share this:
  కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆమె కుమారుడు రాహుల్ గాంధీకి ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీచేసింది. నేషనల్‌ హెరాల్డ్‌ కేసుకు సంబంధించి బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి వేసిన పిటిషన్ ఆధారంగా.. సోమవారం కోర్టు నోటీసులు ఇచ్చింది. సోనియా, రాహుల్‌తో పాటుగా ఏఐసీసీ జనరల్ సెక్రటరీ ఆస్కార్ ఫెర్నాండెజ్, సుమన్ దుబే, శ్యామ్ పిట్రోడా‌, యంగ్ ఇండియా(YI)కు కూడా న్యాయస్థానం నోటీసులు జారీచేసింది. సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్‌పై ఏప్రిల్ 12లోగా సమాధానం తెలియజేయాలని నోటీసుల్లో పేర్కొంది. ఇక, కోర్టులో సుబ్రహ్మణ్యస్వామి తరఫున న్యాయవాది సత్య సబర్వాల్‌, కాంగ్రెస్‌ నేతల తరఫను న్యాయవాది తరన్నం చీమ కోర్టులో హాజరయ్యారు. హైకోర్టు సోనియా, రాహుల్‌తో పాటు మిగతా వారికి నోటీసులు జారీచేసిన విషయాన్ని న్యాయవాదులు ధ్రువీకరించారు.

  నేషనల్‌ హెరాల్డ్‌ పత్రిక కాంగ్రెస్‌ పార్టీకి బకాయి ఉన్న రూ.90.25కోట్లను వసూలు చేసుకొనే హక్కును పొందేందుకు యంగ్‌ ఇండియన్‌ ద్వారా ప్రైవేటు లిమిటెడ్ నేరపూరితమైన కుట్ర పన్నారని సుబ్రహ్మణ్య స్వామి ఆరోపించారు. కేవలం రూ 50 లక్షలు చెల్లించడం ద్వారా కాంగ్రెస్‌ నేతలు మోసపూరితంగా వ్యవహరించడంతో పాటు నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని ట్రయల్ కోర్టులో ప్రైవేట్‌ క్రిమినల్‌ కంప్లైట్ దాఖలు చేశారు. ఇందులో సోనియా, రాహుల్‌ సహా ఏడుగురిని పేర్లను చేర్చారు.

  అయితే తమపై సుబ్రహ్మణ్య స్వామి చేసిన ఆరోపణలను కాంగ్రెస్ నేతలు ఖండించారు. నేషనల్‌ హెరాల్డ్‌ కేసు ముందుకు సాగకుండా బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి అడ్డుకుంటున్నారని సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీతో పాటుగా కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు.
  Published by:Sumanth Kanukula
  First published: