National Girl Child Day: శ్రిస్తీ గోస్వామి… రూర్కీలోని BSM పీజీ కాలేజీలో బీఎస్సీ అగ్రికల్చర్ సెవెన్త్ సెమిస్టర్ స్టూడెంట్. హరిద్వార్‌కి చెందిన ఈ 19 ఏళ్ల యువతి… ఒక రోజు సీఎం కావాలనే కలను నేరవేర్చుకుంటోంది. ఇవాళ జాతీయ బాలికా దినోత్సవం కావడంతో… ఆమె ఇవాళ ఉత్తరాఖండ్ రాష్ట్రానికి ఒక రోజు సీఎంగా బాధ్యతలు చేపడుతోంది. శ్రిస్తీ గోస్వామి తండ్రి ఓ వ్యాపారి. తల్లి గృహిణి. హరిద్వార్ జిల్లాలోని దౌలతాపూర్ గ్రామంలో ఈ ఫ్యామిలీ ఉంటోంది. ఈ అవకాశం అనుకోకుండా వచ్చినదేమీ కాదు. సీఎం పీఠం ఎక్కే అర్హత తనకు ఉంది అని ఆమె ఆల్రెడీ నిరూపించుకుంది. శ్రిస్తీ గోస్వామి… ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న చాలా పథకాలకు పనిచేసింది. అంతేకాదు… అంతర్జాతీయ బాలికా దినోత్సవం కార్యక్రమాల్లో కూడా పాల్గొంది. ఇంతకుముందు 2018 మేలో… ఉత్తరాఖండ్ బాల్ విధాన సభకు ఒకరోజు ముఖ్యమంత్రిగా చేసింది.
ఇవాళ శ్రిస్తీ ఏం చేస్తుంది?
ఒక రోజు సీఎం కదా ఏం చేయదులే అనుకోవద్దు. ఈమె అసాధారణ యువతి. రాష్ట్ర వేసవి రాజధాని అయిన గైర్ సైన్ నుంచి పాలనా బాధ్యతలు చేపట్టి… బీజేపీ పాలిత ప్రభుత్వం ఏయే పథకాలు అమలుచేస్తోందో, అవి ఎలా ఉన్నాయో రివ్యూ చేయబోతోంది. ఆల్రెడీ అటల్ ఆయుష్మాన్ స్కీమ్, స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్, టూరిజం శాఖ తెచ్చిన హోమ్‌స్టే స్కీమ్ ఇతర అభివృద్ధి కార్యక్రమాల్లో శ్రిస్తీ పనిచేస్తోంది.
శ్రీస్తీ బాధ్యతలు చేపట్టగానే… వివిధ శాఖల అధికారులు… తమ ప్లాన్స్‌ను ఐదేసి నిమిషాల పాటూ వివరిస్తారు. ఇందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ కార్యక్రమం మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల మధ్య రాష్ట్ర అసెంబ్లీ భవనంలో జరుగుతుంది. చాలా శాఖల మంత్రులు, అధికారులూ ఆల్రెడీ శ్రిస్తీకి తెలుసు. కాబ్టటి ఇవేవీ ఆమెకు కొత్తగా అనిపించకపోవచ్చు. అటు మంత్రులు, అధికారులకు కూడా శ్రిస్తీ పనితీరు తెలుసు. అందువల్ల రెండువైపులా చక్కటి సహకారం ఉంటుందని చెబుతున్నారు.
చాలా సినిమాల్లో ఇలా వన్ డే సీఎం అయ్యే కథలున్నాయి. ఒకే ఒక్కడు సినిమాలో అర్జున్ ఇలాగే 24 గంటలు సీఎంగా ఉన్న కథ దేశం మొత్తానికీ నచ్చింది. అదే సినిమా బాలీవుడ్లో 2001లో నాయక్ పేరుతో వచ్చింది. అందులో అనీల్ కపూర్… ఒకరోజు సీఎంగా ఉండి… ప్రజలకు జరుగుతున్న అన్యాయాల్ని నిలదీస్తాడు.
ఇది కూడా చదవండి: Weekly Horoscope: వారఫలాలు... జనవరి 24 నుంచి జనవరి 30 వరకు రాశి ఫలాలు
ఇప్పుడు శ్రిస్తీ ఇలాంటివి ఏవీ చేయదుగానీ... జస్ట్ ఫార్మాల్టీగా జాతీయ బాలికా దినోత్సవం నాడు సీఎం కుర్చీలో కూర్చొని... ఒకరోజు సీఎంగా చరిత్ర సృష్టించబోతోంది.
Published by:Krishna Kumar N
First published:January 24, 2021, 07:45 IST