బాలికల రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం ‘నేషనల్ గర్ల్స్ డెవలప్మెంట్ మిషన్‘ పేరుతో ఓ కార్యక్రమం తెచ్చింది. బాలికల సంపూర్ణ ఎదుగుదల కోసం రకరకాల సదుపాయాలు కల్పిస్తోంది. వాటిలో భాగమే జాతీయ బాలికా దినోత్సవం. 2008 నుంచీ దీన్ని ఏటా నిర్వహిస్తోంది. సమాజంలో బాలికల సంరక్షణ, వాళ్ల హక్కులు, ఆరోగ్యం, విద్య, సామాజిక ఎదుగుదల అంశాలపై ఈ రోజున అవగాహన కల్పిస్తోంది. కేంద్రంలో నరేంద్రమోదీ ప్రధాని అయ్యాక... "బేటీ బచావో బేటీ పడావో" స్కీం తెచ్చారు. తద్వారా బాలికల చదువు, పెంపకంపై మరిన్ని జాగ్రత్తలు తీసుకునేలా చేస్తున్నారు.
మన దేశంలో ప్రతి వెయ్యి మంది అబ్బాయిలకు 940 మంది అమ్మాయిలున్నారు. అంటే అమ్మాయిల సంఖ్యను మరింత పెంచాలన్నమాట. ఈ దిశగా జరుగుతున్న ప్రయత్నాలు కొంతవరకే ఫలితం ఇస్తున్నాయి.

ప్రతీకాత్మక చిత్రం
ఇప్పటికి మన ఊళ్లలో పాప పుడుతోందని తెలిస్తే, అబార్షన్ చేయించేస్తున్నారు. ఈ ఆలోచనా ధోరణి మారాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోరుతున్నాయి. అమ్మాయిల రక్షణ కోసం ఆయా రాష్ట్రాలు కొన్ని పథకాలు తెచ్చాయి.
ధన్ లక్ష్మీ పథకం - కేంద్రం
బంగారు తల్లి - ఆంధ్ర ప్రదేశ్
భాగ్యలక్ష్మి పథకం - కర్నాటక
లాడ్లీ లక్ష్మీ యోజన - మధ్యప్రదేశ్
లాడ్లీ పథకం - ఢిల్లీ, హర్యానా
రాజ్యలక్ష్మీ పథకం - రాజస్థాన్
బాలికా సమృద్ధి యోజన - గుజరాత్
భేటీ హై అన్మోల్ స్కీం - హిమాచల్ ప్రదేశ్
రక్షక్ యోజన - పంజాబ్
ముఖ్యమంత్రి కన్యా సురక్ష యోజన - బీహార్
ముఖ్యమంత్రి కన్యా వివాహ్ పథకం - బీహార్
కున్వర్ బైను మమేరు పథకం - గుజరాత్
ఇందిరా మహాత్మా గాంధీ బాలికా సురక్షా యోజన - హిమాచల్ ప్రదేశ్
ముఖ్యమంత్రి కన్యాదాన యోజన – మధ్య ప్రదేశ్

ప్రతీకాత్మక చిత్రం
ఇన్ని పథకాలున్నా బాలికల సంఖ్య తక్కువగా ఉందంటే... తప్పు మనలోనూ ఉన్నట్లే. బాలిక అంటే భారం అనే ఆలోచన మారాలి. ప్రెగ్నెన్సీ స్కానింగ్లపై కఠిన చర్యలు తీసుకోవాలి. వరకట్నపు వేధింపులకు చెక్ పెట్టాలి. ఆడపిల్లలకు చక్కగా చదువు చెప్పించాలి. ఇలా ఎన్నో ఉన్నాయి. తల్లిదండ్రులంతా ఈ విషయంలో సానుకూలంగా ఆలోచిస్తే, ఆడపిల్లలకు అదే అసలైన రక్ష.
అన్ని రంగాల్లో వాళ్లేగా : ఒకప్పుడు మహిళల్ని వంటింటికే పరిమితం చేసేవాళ్లు. ఇవాళ అన్ని రంగాల్లో వాళ్లు దూసుకెళ్తున్నారు. విద్యా, ఉద్యోగాల్లో గట్టిపోటీ ఇస్తూ ర్యాంకుల పంట పండిస్తున్నారు. అవకాశం ఇస్తే, అద్భుతాలు చేసి చూపిస్తున్నారు. బాలికల దశ నుంచే వారికి సరైన తోడ్పాటు అందించాలి. అమ్మాయి భారం అనే సంకుచిత ధోరణి నుంచీ... అమ్మాయే బెటర్ అనే ఆలోచనకు రావాలి.
Video: ఫేస్బుక్లో అసభ్యకర కామెంట్ చేసిన టీనేజర్‌ను పడక గదికి పిలిచి... వీడియో వైరల్...