Home /News /national /

NATIONAL FAMILY HEALTH SURVEY SHOWS THAT WOMEN NOT FAR BEHIND MEN IN NUMBER OF MULITIPLE PARTENERS GH SRD

Multiple Partners: లైంగిక భాగస్వాముల సంఖ్యలో పురుషుల కంటే ముందున్న స్త్రీలు.. సర్వేలో షాకింగ్ విషయాలు..

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

Multiple Partners: జీవితంలో ఎక్కువ మందితో లైంగిక సంబంధాలు ఉన్న వ్యక్తులకు సంబంధించి 2019-21లో నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే (NFHS) వివరాలు సేకరించింది. భారతదేశంలోని పట్టణ ప్రాంతాల మహిళలు లైంగిక సంబంధాల వ్యవహారాల్లో పురుషుల కంటే వెనుకబడి లేరని ఈ వివరాలు సూచిస్తున్నాయి.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India
సాధారణంగా మన సమాజంలో పురుషులకే జీవితంలో ఒకరి కంటే ఎక్కువ మందితో లైంగిక సంబంధాలు (Illegal Relations) ఉంటాయని చాలామంది భావిస్తుంటారు. స్త్రీలు పవిత్రంగా ఉంటారని నమ్ముతారు. అయితే ఈ భావన సరికాదని చెబుతోంది తాజా సర్వే. లైంగిక భాగస్వాముల విషయంలో వాస్తవాలు వేరేలా ఉన్నాయని సర్వే వివరాలు చెబుతున్నాయి. దీనికి సంబంధించిన కథనాన్ని టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా ప్రచురించింది. జీవితంలో ఎక్కువ మందితో లైంగిక సంబంధాలు ఉన్న వ్యక్తులకు సంబంధించి 2019-21లో నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే (NFHS) వివరాలు సేకరించింది. భారతదేశంలోని పట్టణ ప్రాంతాల మహిళలు లైంగిక సంబంధాల వ్యవహారాల్లో పురుషుల కంటే వెనుకబడి లేరని ఈ వివరాలు సూచిస్తున్నాయి.

పట్టణ ప్రాంతాల్లో స్త్రీలకు జీవితకాలంలో సగటున 1.5 మంది లైంగిక భాగస్వాములతో సంబంధాలు ఉంటున్నట్లు సర్వేలో తేలింది. ఇదే సమయంలో పురుషులకు జీవితకాలంలో సగటున 1.7 మందితో సంబంధం ఉంటోంది. వాస్తవానికి అనేక రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో స్త్రీలు తమ జీవితకాలంలో పురుషుల కంటే ఎక్కువ లైంగిక భాగస్వాములను కలిగి ఉన్నారు.

వీటిలో ఉత్తర, మధ్య భారతదేశంలోని రాజస్థాన్, హర్యానా, జమ్మూ కశ్మీర్‌, మధ్యప్రదేశ్‌, తూర్పున అస్సాం, దక్షిణాన తమిళనాడు, కేరళ ఉన్నాయి. పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామీణ మహిళలు వారి జీవితకాలంలో సగటున 1.8 మందితో లైంగిక సంబంధాలు ఏర్పరచుకుంటున్నారు. గ్రామీణ పురుషులకు సంబంధించిన వివరాలు కూడా 1.8గానే సూచిస్తున్నాయి.

* 3.6 శాతం పురుషులకు లైంగిక సంబంధాలు
సర్వే నిర్వహించిన 12 నెలల ముందు కాలంలో జీవిత భాగస్వామి లేదా కలిసి నివసిస్తున్న వారితో కాకుండా ఇతరులతో 3.6 శాతం మంది పురుషులకు లైంగిక సంబంధాలు ఉన్నాయి. అదే విధంగా ఈ శాతం స్త్రీలలో 0.5గా ఉంది. కండోమ్‌ ఉపయోగించకపోవడం వల్ల హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌ బారిన పడే అవకాశం ఉంది. సురక్షిత లైంగిక సంబంధాలు, శృంగార సమయంలో కండోమ్‌ వినియోగం ప్రాబల్యాన్ని అంచనా వేసే ప్రయత్నంలో భాగంగా ఈ వివరాలను నేషనల్ ఫ్యామిలీ హెల్త్‌ సర్వే సేకరించింది.

సర్వేలో భాగంగా దాదాపు 1.1 లక్షల మంది మహిళలు, 1 లక్ష మంది పురుషులను ప్రశ్నించారు. చాలా మంది పూర్తిగా స్పష్టతతోనే లైంగిక సంబంధాలను ఏర్పరుచుకుంటున్నారనేది ఊహించడానికి కష్టంగా ఉంటుంది. చాలా మంది, ముఖ్యంగా మహిళలు, అక్రమ సంబంధాల గురించి మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారని వాస్తవాలు చెబుతున్నాయి.

ఇది కూడా చదవండి : బీ అలర్ట్.. ప్రభుత్వ సబ్సిడీలు, ప్రయోజనాలను పొందాలంటే అది తప్పనిసరి.. ఇప్పటి నుంచే..

సర్వేకు ముందు 12 నెలల్లో ఎంత శాతం మంది మహిళలు ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది భాగస్వాములతో లైంగిక సంబంధం కలిగి ఉన్నారు అనే విషయాన్ని కూడా సర్వే కవర్ చేసింది. పట్టణ ప్రాంత మహిళల కంటే గ్రామీణ మహిళలు ఎక్కువ మందికి అక్రమ లైంగిక సంబంధాలు ఉన్నాయి.

వివాహిత మహిళలు, ఎన్నడూ వివాహం చేసుకోని వారు, వితంతువులు లేదా విడిపోయిన వారి కంటే కొంచెం ఎక్కువ మంది గ్రామీణ మహిళలకు ముందు 12 నెలల్లో ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది భాగస్వాములతో లైంగిక సంబంధాలు ఉన్నాయి. మొత్తానికి సర్వే డేటా.. పురుషులు సురక్షితంకాని సెక్స్‌లో ఎక్కువగా పాల్గొంటున్నారని స్పష్టమవుతోంది. హై-రిస్క్ సెక్స్ సమయంలో కండోమ్‌ల వినియోగించే పురుషుల సంఖ్య మహిళల కంటే కొంచెం ఎక్కువగా ఉంది.

హిందూ పురుషులు జీవితకాలంలో అత్యధిక లైంగిక భాగస్వాములను కలిగి ఉన్నారు(2.2), క్రైస్తవులు, సిక్కులు (1.7), జైనులు అత్యల్పంగా(1.1) ఉన్నారు. ముందు 12 నెలల్లో ఒకటి కంటే ఎక్కువ మంది భాగస్వాములతో లైంగిక సంబంధం కలిగి ఉన్నట్లు నివేదించిన పురుషులలో అత్యధికంగా ఉన్న కమ్యూనిటీలు బౌద్ధులు/నియో-బౌద్ధులు, సిక్కులు కాగా, జైనులు, ముస్లింలు అత్యల్ప నిష్పత్తిలో ఉన్నారు. ఆ 12 నెలల్లో సెక్స్‌లో పాల్గొన్న వ్యక్తులలో, ప్రస్తుతం వివాహం చేసుకున్న లేదా గతంలో వివాహం చేసుకున్న వారి కంటే వివాహం చేసుకోని స్త్రీలు, పురుషులు ఎక్కువగా అక్రమ సంబంధాల్లో భాగమయ్యారని వివరాల ఆధారంగా చెప్పవచ్చు.
Published by:Sridhar Reddy
First published:

Tags: Illegal affairs, Illicit affair, Women

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు