Exam on Cow Urine: గోవు ఉత్పత్తులతో వ్యాధులకు చెక్... ప్రజల్లో అవగాహనకు కేంద్రం ఎగ్జామ్

గోమూత్రం, పాలు, పేడతో వ్యాధులకు చెక్... ప్రజల్లో అవగాహనకు కేంద్రం దేశవ్యాప్త ఎగ్జామ్ (ప్రతీకాత్మక చిత్రం)

Exam on Cow Urine: కేంద్ర ప్రభుత్వం గోవు ఉత్పత్తుల వాడకాన్ని పెంచే దిశగా చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా దేశ ప్రజలందరికీ ఆన్‌లైన్ ఎగ్జామ్ జరగబోతోంది.

 • Share this:
  సొరియాసిస్, చర్మ వ్యాధులు, ఎక్జెమా (eczema), ఆర్థరైటిస్ (arthritis), శరీరంలో వేడి, మంట (inflammation), కుష్టువ్యాధి (leprosy) వంటి వ్యాధులు... పంచగవ్య ఉత్పత్తుల (Panchgavya products)తో నయం అవుతాయని కౌ (cow) కమిషన్ ఆఫ్ ఇండియా చెబుతోంది. పంచగవ్య ఉత్పత్తులను ఆవు పాలు, గోమూత్రం, పేడతో తయారుచేస్తారు. ఈ కౌ కమిషన్‌ను రాష్ట్రీయ కామధేను ఆయోగ్ (RKA) అని పిలుస్తారు. ఇది కేంద్ర పశు సంవర్థక, మత్స్య మంత్రిత్వ శాఖలో భాగంగా ఉంది. దీన్ని కేంద్ర ప్రభుత్వం 2019లో ఏర్పాటు చేసింది. దీని ప్రధాన లక్ష్యం ఆవుల్ని కాపాడటం, వాటి ఉత్పత్తులకు సరైన ప్రయోజనం కలిగిస్తూ... ఆవుల అభివృద్ధి కోసం రకరకాల కార్యక్రమాలు నిర్వహించడం.

  RKA తాజాగా దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 25న ఓ ఆన్‌లైన్ ఎగ్జామ్‌ను స్కూళ్లు, కాలేజీ విద్యార్థులతోపాటూ... ప్రజలందరికీ నిర్వహించబోతోంది. దీని పేరు "కౌ సైన్స్ ప్రమోషన్" ఎగ్జామ్. ఇది రకరకాల వ్యాధులు, వాటి నివారణకు ఆవుల నుంచి వచ్చే పాలు, మూత్రం, పేడ వంటి ఉత్పత్తులు ఎలా ఉపయోగపడతాయి అన్న అంశంపై ఉంటుంది. ఈ పరీక్షకు ప్రిపేర్ అవ్వడానికి సంబంధించి మెటీరియల్ కోసం RKA... 54 పేజీల డాక్యుమెంట్‌ని రూపొందించింది. ఇందులో... ఫెల్మ్ (phlegm), పొట్టలో రోగాలు, కంటి అనారోగ్యాలు, మూత్రనాళ వ్యాధులు, లంబార్, శ్వాస సంబంధిత సమస్యలు, వేడి, మంట, లివర్ వ్యాధుల వంటి వాటికి గోమూత్రం, పేడ... మందులా పనిచేస్తాయో వివరించింది. పంచగవ్య ఉత్పత్తులు వాడితే ఎలా ఆరోగ్యంగా ఉంటారో ఈ డాక్యుమెంట్‌లో తెలిపింది.
  "పంచగవ్యను ప్రతి ఒక్కరూ రోజూ తీసుకోవాలి. తద్వారా గుండె, శరీరం ఆరోగ్యంగా ఉంటాయి. ప్రమాదకర రోగాలైన సొరియాసిస్, చర్మ సమస్యలు, ఎక్జెమా, గాయాలు చాలా త్వరగా తగ్గిపోతాయి." అని డాక్యుమెంట్‌లో ఉంది. రోజూ ఎవరైతే పంచగవ్యను 50 ఎంఎల్ లేదా 60ఎంఎల్‌ను నీటిలో లేదా పండ్ల జ్యూస్‌లో లేదా కొబ్బరి నీటిలో కలుపుకొని తాగుతారో వారికి ఈ వ్యాధులు రావనీ, ఆల్రెడీ ఉంటే దూరమవుతాయని డాక్యుమెంట్‌లో ఉంది.


  ఆవు పాల వల్ల బ్రెయిన్ పవర్, ఇమ్యూనిటీ పెరుగుతుందని రిపోర్టులో ఉంది. ఆవు పాలలో ఉండే సెరెబ్రోసైడ్స్... బ్రెయిన్ పవర్ పెంచుతుందనీ, అలాగే ఆవు పాలలోని స్ట్రాంటియం... బాడీ ఇమ్యూనిటీని పెంచుతుదని తన రిపోర్టులో RKA తెలిపింది.

  ఇది కూడా చదవండి: Vastu Shastra: ఇంట్లో ఈ 5 మొక్కలు పెంచండి... అష్టైశ్వర్యాలూ మీతోనే...

  ఈ ఎగ్జామ్‌లో పాల్గొనాలా వద్దా అనేది దేశ ప్రజల ఇష్టం. పాల్గొనాలి అనుకునేవారు పాల్గొనవచ్చు. దీన్ని జాగ్రత్తగా జరిపేలా అన్ని రాష్ట్రాల సీఎంలు, విద్యాశాఖ మంత్రులకు రిక్వెస్టులు పంపినట్లు RKA చైర్మన్ వల్లభాయ్ కత్రియ తెలిపారు. త్వరలోనే ఎగ్జామ్ వివరాలు తెలుపుతామన్నారు.
  Published by:Krishna Kumar N
  First published: