HOME »NEWS »NATIONAL »nathuram godse library shut two days after its opening in madhya pradesh ak gh

Nathuram Godse: ప్రారంభించిన రెండు రోజుల్లోనే మూతపడ్డ గాడ్సే లైబ్రరీ.. ఎందుకంటే..

Nathuram Godse: ప్రారంభించిన రెండు రోజుల్లోనే మూతపడ్డ గాడ్సే లైబ్రరీ.. ఎందుకంటే..
నాథూరామ్ గాడ్సే (ఫైల్ ఫోటో)

Nathuram Godse: ఈ లైబ్రరీలోని సాహిత్యం, పోస్టర్లు, బ్యానర్లు ఇతర మెటీరియల్ అంతా సీజ్ చేసిన అధికారులు అంతకుముందు హిందూ మహాసభ (Hindu Mahasabha) సభ్యులతో చర్చలు జరిపారు.

  • Share this:
మహాత్మాగాంధీని హత్యచేసిన నాథూరామ్ గాడ్సే పేరుతో ప్రారంభమైన లైబ్రరీ ప్రారంభమైన రెండంటే రెండే రోజుల్లో మూసేశారు. మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ (Gwalior) నగరంలో అఖిల భారతీయ హిందూ మహాసభ ప్రారంభించిన ఈ లైబ్రరీ ద్వారా శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతున్నాయన్న కారణంతో జిల్లా అధికారులు దీన్ని మూసేశారు. గాడ్సే జ్ఞానశాల ప్రారంభం అయిన వెంటనే సోషల్ మీడియాలో (Social media) దీనిపై విచ్ఛలవిడిగా మెసేజిలు రావటంతో పాటు కంప్లైంట్లు కూడా వెల్లువెత్తాయి. దీంతో గ్వాలియరం నగరంలో 144 సెక్షన్ Section 144 విధించారు.

ఈ లైబ్రరీలోని సాహిత్యం, పోస్టర్లు, బ్యానర్లు ఇతర మెటీరియల్ అంతా సీజ్ చేసిన అధికారులు అంతకుముందు హిందూ మహాసభ (Hindu Mahasabha) సభ్యులతో చర్చలు జరిపారు. గాడ్సే జీవితం, ఆయన ఆశయాలు వంటి విషయాలపై సమగ్ర సమచారాన్ని ఇక్కడ అందుబాటులో ఉంచారు. ఇక గాడ్సే జీవితంపై లెక్చర్లు ఇవ్వటం, దేశ విభజన విషయంలో మహాత్మా గాంధీ వైఫల్యాలను ఎండగట్టేలా ఇక్కడ ప్రసంగాలు పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. గాడ్సే సందేశాన్ని ప్రజలకు తెలియజేయటం తమ ముఖ్య ఉద్దేశమంటూ హిందూ మహాసభ ఉపాధ్యక్షుడు జైవీర్ భరద్వాజ్ వివరిస్తూనే, ఎలాంటి శాంతి భద్రతల సమస్యలు సృష్టించటం తమ లక్ష్యం కాదు కనుక దీన్ని మూసివేసేందుకు అంగీకరించినట్టు తెలిపారు.



హిందూ మహాసభపై ఎఫ్ఐఆర్ దాఖలు చేయకపోవటాన్ని కాంగ్రెస్ తప్పుబడుతోంది. తమ భావజాలాన్ని వ్యతిరేకించే వారందరినీ జాతి వ్యతిరేకులుగా బీజేపీ ముద్ర వేస్తోందంటూ కాంగ్రెస్ ధ్వజమెత్తింది. గాడ్సే లైబ్రరీని ఏర్పాటు చేయటం ద్వారా.. భారత జాతిపిత మహాత్మా గాంధీని (Gandhi) అవమానించినట్టైందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. 2017లో కూడా గాడ్సే విగ్రహాన్ని హిందూ మహాసభ ఏర్పాటు చేసి ఆతరువాత దాన్ని తొలగించింది.

మహాసభ ఆఫీసులోనే..
"విశ్వ హిందీ దివస్" సందర్భంగా గ్వాలియర్‌లో గాడ్సే గుర్తుగా.. గాడ్సే లైబ్రరీని అఖిల్ భారతీయ హిందూ మహాసభ ప్రారంభించింది. గాడ్సే జీవితం భావజాలానికి అంకితమైన గ్వాలియర్‌లో ఈ గాడ్సే లైబ్రరీని ప్రారంభించింది. దౌలత్ గంజ్‌లో‌ని మహాసభ కార్యాలయంలో గాడ్సే లైబ్రరీని ఆర్భాటంగా ప్రారంభించింది. మహాత్మా గాంధీ హత్యకు గాడ్సేను ప్రేరేపించిన అంశాలు, వ్యాసాలు, ఆయన ప్రసంగాలకు సంబంధించి సాహిత్యమంతా లైబ్రరీ పుస్తకాల్లో ఉంది. నిజమైన జాతీయవాది గాడ్సే అంటూ హిందూమహాసభ ఎప్పటినుంచో ఘోషిస్తోంది. యువతలో జాతీయతను ప్రేరేపించడం లైబ్రరీ ఉద్దేశ్యంగా హిందూ మహాసభ పేర్కొంది.
Published by:Kishore Akkaladevi
First published:January 13, 2021, 10:53 IST