రోడ్డు ప్రమాద బాధితులకు అండగా నసీరుద్దీన్ షా.. మీ వంతు ఎప్పుడు?

Road Safety | భారతదేశంలో ప్రతి గంటలో 18మంది రోడ్డు ప్రమాద ఘటనల్లో బాధితులవుతున్నారు. మరింత సహానుభూతి ప్రదర్శించడం ద్వారా గోల్డెన్ అవర్‌లోనే ప్రాణాన్ని కాపాడాలని నసీరుద్దీన్ షా ప్రజలను కోరుతున్నారు.

news18-telugu
Updated: June 14, 2019, 3:19 PM IST
రోడ్డు ప్రమాద బాధితులకు అండగా నసీరుద్దీన్ షా.. మీ వంతు ఎప్పుడు?
నసీరుద్దీన్ షా(File)
news18-telugu
Updated: June 14, 2019, 3:19 PM IST
ప్రపంచం వేగంగా మార్పు చెందుతోంది. అన్ని జీవన రంగాల్లోనూ పెద్ద అడుగులు పడుతున్నాయి. అయితే, మనుషులు అదే వేగంతో తమ విలువల్ని, మానవత్వాన్ని కోల్పోతున్నారు. మనం ఒక రోడ్డు ప్రమాదాన్ని చూసినప్పుడు, ప్రమాదంలో గాయపడినవారు లేక బాధితుల పట్ల మన ప్రతిస్పందనలు మన మొద్దుబారినతనానికి సజీవ సాక్ష్యాలుగా ఉంటున్నాయి. దగ్గరుండి చూస్తున్నవారిలో చాలామంది ప్రమాదం పట్ల ఆందోళన చెందడానికి బదులుగా ఆసక్తి ప్రదర్శిస్తూ సోమరి చూపులు చూస్తున్నారు. ఇంకా ఘోరమైంది ఏటంటే, ఈ దారుణమైన ప్రమాద ఘటనను మొత్తం వీడియో తీసి దాన్ని సోషల్ మీడియాలో అప్‌లోడ్‌ చేసేందుకు తక్షణం తమ స్మార్ట్‌ ఫోన్లు తీసుకుంటున్నారు.

రోడ్డు ప్రమాదం జరిగిన తొలి 60 నిమిషాల్లోపే ప్రాణాన్ని కాపాడటానికి అనుసరించాల్సిన ఉత్తమ మార్గాల గురించి ప్రజలను చైతన్యపర్చడం ద్వారా ఈ పరిస్థితిని మార్చవచ్చు. అద్భుత నటుడు, దర్శకుడు అయిన నసీరుద్దీన్ షా ఈ ప్రయత్నానికి మద్దతు పలికారు. భారతదేశంలో ప్రతి గంటలో 18మంది రోడ్డు ప్రమాద ఘటనల్లో బాధితులవుతున్నారు. మరింత సహానుభూతి ప్రదర్శించడం ద్వారా గోల్డెన్ అవర్‌లోనే ప్రాణాన్ని కాపాడాలని నసీరుద్దీన్ షా ప్రజలను కోరుతున్నారు.గోల్డెన్ అవర్


గోల్డెన్ అవర్ అంటే, ప్రమాదం జరిగిన తొలిగంటలోనే సరైన వైద్య సహాయం చేసినట్లయితే బాధితుడి ప్రాణం కాపాడవచ్చు.

అత్యంత సంక్లిష్టమైన తొలి నిమిషాల్లో రోడ్డు ప్రమాదం పట్ల మొదటి స్పందించినవారు చేసిన సహాయంతో ప్రాణాన్ని కాపాడటమే కాదు, తగిలిన గాయాల తీవ్రతను తగ్గించవచ్చు.

ప్రమాద బాధితుడికి సాయపడేందుకు ప్రజలు ఎందుకు భయపడుతుంటారు?
Loading...
• అంబులెన్స్ వచ్చేంతవరకు బాధితుడిని సేఫ్‌గా ఉంచడానికి ఏ విధానాన్ని అవలింబించాలో వారికి తెలీదు. బాధితుడిని కదిలించాలా? లేక అతడి శరీరానికి మరింత నష్టం జరగకుండా అతడిని ఎత్తుకోవాలా? అత్యవసర పరిస్థితిలో నిపుణులు కాని, దగ్గరుండి చూస్తున్న వారిని హెచ్చరించాలా? వంటి విషయాలు తెలియవు

• పోలీస్ కేసులో ఇరుక్కుంటామనీ, ఆపై అంతు లేకుండా ఆసుపత్రి, పోలీసు స్టేషన్ చుట్టూ తిరగాల్సి ఉంటుందన్న భయం

• పోలీసుల వేధింపులు, వ్యక్తిగత సమయాన్ని, ఇతర పనులను పణంగా పెట్టి అనవసర సమయాన్ని వెచ్చించవలసి రావడం. దీనికి భిన్నంగా, ఢిల్లీలో ప్రభుత్వం ప్రమాద బాధితుడికి సహాయం చేసే ఎవరికైనా రూ. 2000లు నగదుతోపాటు సన్మానిస్తామని ప్రతిపాదించింది.

• పోలీసు విచారణను ఎదుర్కోవడం, రిపోర్టులను, ప్రత్యక్ష సాక్షుల ప్రకటనలను ఫైల్ చేయడం

• ప్రమాద కేసును అనుసరించి అనివార్యంగా వచ్చే చట్టపరమైన అడ్డంకుల బారిన పడటం.

రోడ్డు ప్రమాదం జరిగిన తొలి అరవై నిమిషాల్లో ప్రాణాన్ని కాపాడటం ఎలా

• అంబులెన్స్‌ని పిలిచేందుకు 108కి డయల్ చేయండి

• ప్రమాదం నగర పరిధుల్లో జరిగివుంటే పోలీసులకు తెలుపడానికి 100కి డయల్ చేయండి

• 1033కి డయల్ చేయండి. జాతీయ రహదారులపై ప్రమాదాలు లేక ఇతర అత్యవసర పరిస్థితుల్లో భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్ఎఐ) ప్రజలకోసం 24/7 విశిష్టమైన టోల్-ఫ్రీ హెల్ప్‌లైన్ “1033”ని కల్పించింది. ఈ నంబర్‌కు కాల్ చేయండి మరియు సహాయం కోసం వేచి ఉండండి. మరిన్ని వివరాల కోసం ఇక్కడ చూడండి.

• బాధితుడి మొబైల్ ఫోన్‌లోని కాంటాక్ట్ జాబితాను వెతికి అతడి కుటుంబానికి కాల్ చేసి సమాచారం ఇవ్వండి. ఎమర్జెన్సీ సందర్భంలో (ఐసీఈ) కాంటాక్ట్ నంబర్లు ఫోన్ హోమ్ స్క్రీన్‌పై కనిపిస్తుంటాయి, ఫోన్ లాక్ చేసి ఉన్నప్పటికీ.

• బాధితుడి చుట్టూ గుమికూడిన జనాల్ని సమాధానపర్చండి. బాధితుడికి తగిన గాలి, ఆక్సిజన్ ఫ్రీగా అందేలా జనాల్ని పక్కకు జరిగేలా చేయండి

• ప్రమాద స్థలం చుట్టూ వాహనాలు నిలిచిపోయి రోడ్డుపై మరింత ట్రాఫిక్ జామ్ కావడాన్ని నిరోధించేందుకు కొంతమందికి పని చెప్పండి.

• అంబులెన్స్ త్వరగా చేరుకునేలా రోడ్డు కుడి వైపును ట్రాఫిక్‌ ఫ్రీగా ఉండేలా చేయండి. వెళుతున్న వాహనాలన్నింటినీ వేగం తగ్గించకుండానే ఎడమ వైపు డ్రైవ్ చేసేలా డైరెక్ట్ చేయండి.

• బాధితుడు హెల్మెట్ ధరించి ఉన్నట్లయితే, తలను కదపకుండానే హెల్మెట్‌ని తొలగించడానికి స్ట్రాప్స్‌ని కాస్త వదులుగా చేయండి.

• బాధితుల మెడ, ఛాతీ, నడుము వద్ద ఉన్న దుస్తులను వదులుగా చేయండి. మీకు తెలిసి ఉంటే ప్రథమ చికిత్స మాత్రమే చేయడానికి ప్రయత్నించండి. తెలీనట్లయితే, పారామెడిక్స్ లేక ఇతర నిపుణులు సహాయం కోసం వచ్చేంతవరకు వేచి ఉండటమే ఉత్తమం

• బాధితుడికి రక్త గాయం ఉన్నట్లయితే, ఆ గాయంలో ఏదైనా వస్తువు అతుక్కుపోయిందేమో తనిఖీ చేయండి. దాన్ని తొలగించవద్దు, ఎందుకంటే అది రక్తనాళాలు, నరాలను మరింతగా దెబ్బతీస్తుంది. మరింతగా రక్తం కారడానికి దారితీస్తుంది.

• రక్తమోడుతున్న గాయంపైన పరిశుభ్రమైన బట్టను చుట్టడం ద్వారా రక్తం కారడాన్ని ఆపడానికి ప్రయత్నించండి

• అవయవాలు రక్తమోడుతున్నట్లయితే, రక్తం కారడం ఆపడానికి అవయవాలను పైకెత్తండి

• బాధితుడి నోటి నుంచి రక్తం వస్తున్నట్లయితే లేక వాంతి చేసుకుంటున్నట్లయితే, అతడిని పొరబారకుండా పక్కకు తిప్పండి.

• గాయానికి రెండువైపులా లైట్ ప్రెషర్‌ ఉంచండి. గాయాన్ని క్లోజ్ చేయడానికి గాయం ఇరువైపులా ఉన్న చర్మాన్ని పుష్ చేయడం ద్వారా గాయాన్ని మూసివేయడానికి ప్రయత్నించండి. ఇది బ్లీడింగ్‌ను తగ్గిస్తుంది .రక్తం కారడం ద్వారా బాధితుడు చనిపోకుండా నిలువరించవచ్చు.

• వ్యక్తికి తీవ్రగాయమై, సహాయం ఇంకా రానప్పుడు లేక ఆలస్యమవుతున్నప్పుడు, అతడిని దగ్గరిలోని ఆసుపత్రికి తీసుకువెళ్లండి. ఆవిధంగా అతడికి గోల్డెన్ అవర్‌లోనే చికిత్స జరిగి సరైన వాతావరణంలో ఆరోగ్యం కుదుటపడవచ్చు.(బాధ్యతాయుతమైన పౌరుడిగా, మంచి వ్యక్తిగా ఉండకుండా మిమ్మల్ని అడ్డుకునే భయానికి, ఉదాసీనతకు అసలు తావు ఇవ్వద్దు. రాష్ట్రపతి కోవింద్ 2016లో గుడ్ సమారిటన్ బిల్లుకు ఆమోదం తెలిపారు. సుప్రీంకోర్టు కూడా గుడ్ సమారిటన్ చట్టాన్ని ఆమోదించింది. చట్టపరమైన అడ్డంకులు, వేధింపుల నుంచి రోడ్డు ప్రమాద బాధితులకు సహాయం చేయడంలో ఈ చట్టం పౌరులకు తోడ్పడుతుంది.)
First published: June 14, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...