సీఎం జగన్ ఇప్పటికైనా మారాలి.. ఎంపీ రఘురామ విమర్శలు

మాతృభాష గురించి మాట్లాడేవారి పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో ఎందుకు చదువుతున్నారని, సీఎం జగన్ ఎదురు ప్రశ్నలు వేయడం మానుకోవాలని సూచించారు.

news18-telugu
Updated: July 30, 2020, 12:48 PM IST
సీఎం జగన్ ఇప్పటికైనా మారాలి.. ఎంపీ రఘురామ విమర్శలు
రఘురామకృష్ణంరాజు, వైఎస్ జగన్ (ఫైల్ ఫోటో)
  • Share this:
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు మరోసారి సీఎం జగన్‌ను టార్గెట్ చేశారు. వైసీీప ప్రభుత్వ విధానాలను బాహాటంగానే తప్పుబట్టుడుతన్న ఆయన తాజాగా మాతృభాషలో విద్యా బోధన అంశంపై స్పందించారు. మన భాషను, సంస్కృతిని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఏంతైనా ఉందని రఘురామ కృష్ణంరాజు అభిప్రాయపడ్డారు. మాతృభాష గురించి మాట్లాడేవారి పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో ఎందుకు చదువుతున్నారని, సీఎం జగన్ ఎదురు ప్రశ్నలు వేయడం మానుకోవాలని సూచించారు.

మాతృభాషలో విద్యా బోధన ఎంతో అవసరం. మాతృభాషలోనే ప్రాథమిక విద్యాబోధన ఉండాలని ఎవరైనా సూచిస్తే, మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారని సీఎం జగన్‌ ఎదురు ప్రశ్నలు వేయడం సరి కాదు. ఎల్లాప్రగడ, సీవీ రామన్‌ మాతృభాషలోనే చదువుకున్నారు. ప్రపంచమంతా ఒక దారి, నాదో దారి అని సీఎం అనుకోవద్దు. చిన్న రాష్ట్రాలు కూడా మాతృభాషకు ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఇప్పటికైనా ఆంగ్ల మాధ్యమం ప్రతిపాదనను ఉపసంహరించుకుని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయాలి.
రఘురామ కృష్ణంరాజు, నర్సాపురం ఎంపీ


కాగా, నూతన జాతీయ విద్యా విధానానికి బుధవారం కేంద్ర కేబినెట్ ఆమోద్ర వేసిన విషయం తెలిసిందే. విద్యా హక్కు చట్టం కింద 3 నుంచి 18 ఏళ్ల వరకు విద్యను తప్పనిసరి చేశారు. 5వ తరగతి వరకు మాత‌ృభాషలోనే విద్యా బోధన చేయనున్నారు. గతంలో ఉన్న 10+2 స్థానంలో 5+3+3+4ను అమలు చేయనున్నారు. మొదటి ఐదేళ్లను ఫౌండేషన్ కోర్సు(3 ఏళ్ల వయసు నుంచి 8 ఏళ్ల వరకు), ఆ తరువాత మూడేళ్లను ప్రీ ప్రైమరీ స్కూల్ (8 ఏళ్ల వయసు నుంచి 11 వరకు), ఆ తర్వాత మూడేళ్లను ప్రిపరేటరీ స్టేజ్ (11 ఏళ్ల నుంచి 14 వరకు), ఆ తర్వాతి నాలుగేళ్లను సెకండరీ స్టేజ్‌ (14 ఏళ్ల వయసు నుంచి 18 వరకు)గా పరిగణిస్తారు. డిప్లొమా కోర్సు రెండేళ్లు, వృత్తి విద్య కోర్సు వ్యవధి ఏడాదిగా నిర్ణయించారు. అలానే డిగ్రీ కోర్సు కాల వ్యవధి మూడు లేదా నాలుగేళ్లుగా మార్పు చేయనున్నారు. కేంద్రం నిర్ణయాన్ని చంద్రబాబు సహా పలువురు నేతలు స్వాగతించారు.
Published by: Shiva Kumar Addula
First published: July 30, 2020, 12:46 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading