news18-telugu
Updated: September 17, 2020, 10:30 AM IST
ప్రధాని నరేంద్ర మోదీ
PM Modi 70th BirthDay: ప్రధాని నరేంద్ర మోదీ 70వ పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్రమంత్రులు, ఎంపీలు, ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు ప్రధానికి సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్ చెబుతున్నారు. అద్భుతమైన పాలనతో భారత ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పారని కొనియాడారు. రష్యా అధ్యక్షుడు పుతిన్, నేపాల్ ప్రధాని కేపీ ఓలీ కూడా నరేంద్ర మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ప్రధాని పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు, బీజేపీ కార్యకర్తలు దేశవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
Published by:
Shiva Kumar Addula
First published:
September 17, 2020, 10:30 AM IST