నేడు గుజరాత్‌కు మోదీ... 30న ప్రమాణస్వీకారం...

Narendra Modi : మరోసారి బీజేపీ పార్లమెంటరీ పార్టీ నేతగా ఎన్నికైన నరేంద్రమోదీ... మరోసారి ప్రమాణ స్వీకారం చేసేలోపు పూర్తి చేయాలనుకున్న కార్యక్రమాలు పూర్తి చేస్తున్నారు.

Krishna Kumar N | news18-telugu
Updated: May 26, 2019, 7:28 AM IST
నేడు గుజరాత్‌కు మోదీ... 30న ప్రమాణస్వీకారం...
నరేంద్ర మోదీ
  • Share this:
లోక్‌సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన నరేంద్ర మోదీ... ఇవాళ గుజరాత్‌కు వెళ్లబోతున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారిగా ఆయన గుజరాత్ వెళ్తున్నారు. అదే విషయం చెబుతూ ట్వీట్ చేశారు. ఆదివారం సాయంత్రం గుజరాత్ వెళ్తున్నాననీ, అమ్మ హీరాబెన్ ఆశీర్వాదం తీసుకుంటానని మోదీ వివరించారు. అలాగే సోమవారం ఉదయం వారణాసి నియోజకవర్గంలో మోదీ పర్యటించబోతున్నారు. గంగామాత ఆశీర్వాదం తీసుకుంటారు. అలాగే తనను గెలిపించిన వారణాసి ప్రజలకు కృతజ్ఞతలు చెప్పబోతున్నారు. వారణాసి నుంచీ మోదీ 4.8 లక్షల భారీ మెజారిటీతో మోదీ రెండోసారి విజయం సాధించారు.

ఈ నెల 30న మోదీ రెండోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేస్తారని తెలిసింది. ఇందుకు సంబంధించి భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, జపాన్‌ ప్రధాని షింజో అబే, అబుదాబీ యువరాజు, ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజిమన్‌ నెతన్యాహు వంటి వారిని ఆహ్వానించాలనుకుంటున్నట్లు తెలిసింది. ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సభ్యదేశాలైన అమెరికా, చైనా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాల అధినేతలను కూడా ఆహ్వానించాలన్న ఆలోచన బీజేపీ వర్గాల నుంచీ కనిపిస్తోంది.





ఆదివారం సాయంత్రం 5 గంటలకు అహ్మదాబాద్‌ విమానాశ్రయంలో స్వాగతం అందుకోనున్న ప్రధాని నేరుగా ఖానాపూర్‌లోని బీజేపీ కార్యాలయానికి వెళ్తారు. రాత్రి తల్లి ఆశీర్వాదం తీసుకొని గాంధీనగర్‌లోని రాజ్‌భవన్‌లో బస చేస్తారు. మరోవైపు మోదీ నిన్న ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ నేతగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శనివారం సాయంత్రం పార్లమెంట్ సెంట్రల్ హాలులో జరిగిన ఎన్డీయే సమావేశంలో మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా, పార్టీ సీనియర్ నేతలు, కొత్తగా ఎన్నికైన బీజేపీ, ఎన్డీయే ఎంపీలు హాజరయ్యారు. ఈ సమావేశంలో మోదీని బీజేపీ, ఎన్డీయే నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
Loading...
 

ఇవి కూడా చదవండి :

చంద్రబాబుకు బస్తీ మే సవాల్... నేడు విజయవాడలో రాంగోపాల్ వర్మ ప్రెస్‌మీట్...

నేడు మోదీతో జగన్ భేటీ... ఏపీకి ప్రత్యేక హోదా అడుగుతారా?

చంద్రబాబుకి మరో షాక్... EVMలు 100 శాతం కరెక్ట్ అన్న ఈసీ

Pics : క్యూట్ లుక్స్‌తో మెస్మరైజ్ చేస్తున్న హిప్పీ బ్యూటీ దిగంగన

First published: May 26, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...
Listen to the latest songs, only on JioSaavn.com