• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • NARENDRA MODI MOST PREFERRED FOR PRIME MINISTER POST WAY AHEAD OF RAHUL GANDHI SAYS STATE OF THE NATION 2021 SURVEY NK

Best PM: మోదీ? రాహుల్?.. ప్రధానిగా ఎవరుండాలి.. ఇప్పుడు దేశం ఎవర్ని కోరుకుంటోంది?

Best PM: మోదీ? రాహుల్?.. ప్రధానిగా ఎవరుండాలి.. ఇప్పుడు దేశం ఎవర్ని కోరుకుంటోంది?

మోదీ? రాహుల్?.. ప్రధానిగా ఎవరుండాలి (File Images)

Best PM: పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. సందర్భాలను బట్టీ మారిపోతూ ఉంటాయి. మరి ఇప్పుడు దేశ ప్రజలు ప్రధానిగా రాహుల్‌ని కోరుకుంటున్నారా లేక మోదీనే కోరుకుంటున్నారా?

  • Share this:
    కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ సంస్కరణ చట్టాలను వ్యతిరేకిస్తూ... రైతులు ఆందోళనలు చేస్తుండటం... వాటిని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బలంగా సమర్థించడంతో... ప్రస్తుతం దేశ ప్రజలు బెస్ట్ ప్రధానిగా ఎవర్ని ఎంచుకుంటున్నారు అనే అంశం మరోసారి తెరపైకి వచ్చింది. దేశవ్యాప్తంగా 59.22 శాతం మంది నరేంద్ర మోదీనే ప్రధానమంత్రిగా కోరుకుంటున్నారని తేలింది. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రేటింగ్ 25.62 శాతమే ఉంది అని IANS C-ఓటర్ నిర్వహించిన స్టేట్ ఆఫ్ ది నేషన్ 2021 సర్వే (State of the Nation 2021 survey) చెబుతోంది. రాహుల్ గాంధీయా, నరేంద్ర మోదీయా... వీళ్లిద్దరిలో ప్రధానమంత్రిగా మీరు ఎవర్ని కోరుకుంటారు అని అడిగితే... నరేంద్ర మోదీకే ప్రజలు పట్టం కడుతున్నారు.

    ఒడిషా, హిమాచల్ ప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో 80 శాతం మంది ప్రజలు ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీయే ఉండాలి అంటున్నారు. ఆశ్చర్యకరంగా ఈశాన్య రాష్ట్రాల్లో 75.68 శాతం మంది మోదీనే ప్రధానిగా ఉండాలని కోరుకుంటున్నారు. అక్కడ బీజేపీ ఈమధ్య కాలంలో బలపడుతోంది. ఈ సర్వే కూడా ఈ విషయాన్నే స్పష్టం చేస్తోంది.

    ఒడిశాలో 7.36 శాతం మంది, హిమాచల్ ప్రదేశ్‌లో 10.20 శాతం మంది, ఈశాన్య రాష్ట్రాల్లో 10.96 శాతం మంది మాత్రమే రాహుల్ గాంధీని ప్రధానిగా ఆమోదించేందుకు సిద్ధపడుతున్నారు.

    ఐతే... రాహుల్ సంతోష పడే వార్త కేరళ నుంచి వచ్చింది. ఆ రాష్ట్రంలో 54.28 శాతం మంది రాహుల్‌ని ప్రధానిగా కోరుకుంటున్నారు. కేరళ నుంచే రాహుల్... లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నెక్ట్స్ తమిళనాడులో 48.26 శాతం మంది రాహుల్‌ని పీఎంగా చూడాలనుకుంటున్నారు.

    బెంగాల్‌లో 62.19 శాతం మంది తమ సపోర్ట్ ప్రధాని నరేంద్ర మోదీకే అనేశారు. 28.38 శాతం మంది మాత్రమే రాహుల్ వైపు చూస్తున్నారు. ఇక ఆర్టికల్ 370ని రద్దు చేసినా జమ్మూకాశ్మీర్ ప్రజలు నరేంద్ర మోదీ వైపే ఉన్నారు. అక్కడ 46.74 శాతం మంది ఆయనకే సపోర్ట్ చేస్తుంటే... 34.15 శాతం మంది రాహుల్ వైపు చూస్తున్నారని తేలింది.

    ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర, జార్ఖండ్, బీహార్‌లో దాదాపు 65 శాతం మంది ప్రధానిగా నరేంద్ర మోదీయే ఉండాలంటున్నారు.

    తెలంగాణలో 60.32 శాతం మంది మోదీయే ప్రధానిగా ఉండాలని కోరుకుంటున్నారు.

    ఢిల్లీలో 61.75 శాతం మంది మోదీవైపు ఉండగా... 22.98 ఆ పదవికి రాహులే కరెక్ట్ అంటున్నారు.

    ఉత్తరప్రదేశ్‌లో 56.21 శాతం మంది మోదీవైపు, 29.48 శాతం మంది రాహుల్ వైపు ఉన్నారు.

    రైతులు ఆందోళన చేస్తున్న... పంజాబ్‌లో మోదీ, రాహుల్ ఇద్దరికీ సమానంగా 29.5 శాతం చొప్పున సపోర్ట్ రావడం చిత్రమే.

    కేరళ, తమిళనాడు తప్పితే... ఇక ఏ రాష్ట్రమూ, కేంద్ర పాలిత ప్రాంతంలో ప్రజలు ప్రధానిగా రాహుల్ గాంధీకి సపోర్ట్ చేయలేదు.

    15 రాష్ట్రాల్లో రాహుల్‌కు అనుకూలంగా 25 శాతం రేటింగ్ ఉంది. నాలుగు రాష్ట్రాల్లో 20 శాతం కంటే తక్కువ ఉంది.

    ఇది కూడా చదవండి:పచ్చ, కెంపు, రూబీ, రత్నం, వజ్రం... ఏ నెలలో పుట్టిన వారు ఏ రాయి తొడగాలి... తెలుసుకుందాం.

    దేశవ్యాప్తంగా 30,000 మందిపై ఈ సర్వే జరిపారు. మొత్తం 543 లోక్ సభ నియోజకవర్గాలనూ కవర్ చేశారు.
    Published by:Krishna Kumar N
    First published:

    అగ్ర కథనాలు