నేడు ఐరాస భద్రతా మండలిలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం... ఉగ్రవాదం, కరోనాపైనే ఫోకస్

PM Modi Speech: భారత్ ఎదగకుండా చెయ్యాలని చాలా దేశాలు కుట్రలు పన్నుతున్నాయి. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నాయి. ఈ అంశంపై ప్రధాన మంత్రి మోదీ... ఐక్యరాజ్యసమితిలో బలంగా వాణి వినిపించబోతున్నారు.

news18-telugu
Updated: September 26, 2020, 8:42 AM IST
నేడు ఐరాస భద్రతా మండలిలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం... ఉగ్రవాదం, కరోనాపైనే ఫోకస్
నేడు ఐరాస భద్రతా మండలిలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం... ఉగ్రవాదం, కరోనాపైనే ఫోకస్
  • Share this:
PM Modi Speech at UNGA: ఓవైపు పాకిస్థాన్ కుట్రలు, మరోవైపు భారత భూభాగాన్ని లాక్కోవాలని చైనా చేస్తున్న కుతంత్రాలు, భారత్‌కి వ్యతిరేకంగా పావులు కదుపుతున్న నేపాల్, శ్రీలంక లాంటి దేశాలు. ఇలాంటి పరిస్థితుల్లో... భారత వాణిని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో వినిపించబోతున్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. ఐతే... ఈ సదస్సులో ప్రపంచ దేశాలకు భారత్... ఫార్మసీ కేంద్రంగా మారిన అంశాన్ని మోదీ ప్రస్తావించబోతున్నట్లు తెలుస్తోంది. కరోనా కాలంలో... ప్రపంచ దేశాలకు భారత్ నుంచే పెద్ద మొత్తంలో మందులు సప్లై అవుతున్నాయి. వ్యాక్సిన్ల ఉత్పత్తిలో కూడా భారతే నంబర్‌వన్‌గా కొనసాగుతోంది. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ మోదీ... కరోనాకి వ్యతిరేక పోరాటంలో భారత్ అందిస్తున్న సేవా దృక్పథాన్ని వివరించనున్నారు. కరోనాపై పోరాటంలో భాగంగా భారత్ 150కి పైగా దేశాలకు మందులు, ఇతర సామగ్రిని ఉచితంగా ఇస్తోంది.

భారత టైమ్ ప్రకారం... సాయంత్రం 6.30కి ప్రధాని మోదీ ప్రసంగం ఉండనున్నట్లు తెలిసింది. తన ప్రసంగంలో మోదీ... ఉగ్రవాదంపై పోరులో... ప్రపంచ దేశాలు పారదర్శకతతో వ్యవహరించాలని కోరబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రసంగం కోసం... ప్రధాని మోదీ... న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి కార్యాలయానికి వెళ్లరు. ఆన్‌లైన్‌లో వర్చువల్ ప్రసంగం ఉంటుంది. కరోనా కారణంగా... ఈ సదస్సు... వర్చువల్ రూపంలో ఆన్‌లైన్‌లో జరగబోతోంది. చాలా దేశాల నేతలు... ముందుగానే రికార్డ్ చేసిన ప్రసంగాన్ని సదస్సులో వినిపించబోతున్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సంబంధించిన వీడియో ప్రసంగాన్ని... అంటే... ఆయన ఆల్రెడీ రికార్డ్ చేసేసిన ప్రసంగాన్ని... ఇవాళ న్యూయార్క్‌లోని ఐరాసలో ఉదయం 9 గంటలకు (ఇండియాలో సాయంత్రం 6.30కి) వినిపించబోతున్నట్లు తెలిసింది. మోదీ ప్రసంగం తర్వాత మిగతా నేతల ప్రసంగాలు ఉండనున్నాయి. అవి కూడా ముందుగా రికార్డ్ చేసినవే.

ఐక్యరాజ్యసమితి 75వ సాధారణ సదస్సులో ప్రధాని మోదీ... ఉగ్రవాదంపై ఎక్కువ ఫోకస్ పెట్టనున్నారు. ఉగ్రవాద సంస్థల పేర్లు, ఉగ్రవాదుల పేర్లను టెర్రర్ లిస్టులో చేర్చే అంశంలో పారదర్శకత ఉండాలని మోదీ కోరనున్నట్లు తలిసింది. ఐక్యరాజ్యసమితికి భారీగా సైన్యాన్ని ఇస్తున్న దేశాల్లో భారత్ ఒకటి. ఉగ్రవాదంతోపాటు, సంపూర్ణ అభివృద్ధి, వాతావరణ పరిరక్షణ వంటి అంశాల్లో భారత్ తన చొరవను కొనసాగిస్తుందని మోదీ చెప్పనున్నట్లు తెలిసింది.

దక్షిణ ఆసియాలో ఐరాసకు భారత్ అత్యంత కీలక దేశం. పైగా ప్రపంచ జనాభాలో 16 శాతం ఇండియాలో ఉన్నారు కాబట్టి మోదీ చెప్పే మాటలు మిగతా దేశాలకు మంచి సూచనలుగా, దిశానిర్దేశాలుగా మారనున్నాయి. భారత్‌పై ఆధారపడే పాకిస్థాన్, నేపాల్, శ్రీలంక లాంటి దేశాలపై పెత్తనం చెలాయిస్తూ చైనా... భారత్‌కి వ్యతిరేకంగా ఆ దేశాలను రెచ్చగొడుతోంది. ఇలాంటి సమయంలో ఓవైపు కరోనాతో పోరాడుతూ... మరోవైపు చైనాను సరిహద్దుల్లో ఎదుర్కొంటూ... ఇంకోవైపు అంతర్జాతీయ అంశాల్లో భారత్ అత్యంత జాగ్రత్తగా ముందడుగులు వేస్తోంది. భారత్‌పై నమ్మకంతోనే ఈ మధ్య మనకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (FDI)లు పెరుగుతున్నాయి. ఐక్యరాజ్యసమితి సభ్య దేశాల్లో తమను కూడా చేర్చాలని భారత్ కోరుతున్న తరుణంలో... మోడీ ప్రసంగం అందరిదృష్టినీ ఆకర్షించబోతోంది.
Published by: Krishna Kumar N
First published: September 26, 2020, 8:42 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading