హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

మీ సేవలకు సలాం.. వారణాసి ఎన్జీవోలపై ప్రధాని మోదీ ప్రశసంలు

మీ సేవలకు సలాం.. వారణాసి ఎన్జీవోలపై ప్రధాని మోదీ ప్రశసంలు

ప్రధాని మోదీ

ప్రధాని మోదీ

యూపీలో ఇప్పటి వరకు 31,156 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 20,331 మంది వ్యాధి నుంచి కోలుకొని ఆస్పత్రుల నుండి డిశ్చార్జి కాగా.. మరో 845 మంది మరణించారు.

  కరోనా వంటి సంక్షోభ సమయంలోనూ ఎన్జీవోలు తమ సేవలను కొనసాగించడం చిన్న విషయం కాదని ప్రధాని మోదీ అన్నారు. కరోనా పేరు వింటనే భయపడే పరిస్థితుల్లోనూ ప్రాణాలు లెక్కచేయకుండా సేవ చేశారని అన్నారు.  మీ సేవలకు సలాం అంటూ వారిపై ప్రశంసలు కురిపించారు. ప్రధాని మోదీ తన నియోజకవర్గమైన వారణాసి ఎన్టీవో సంస్థల ప్రతినిధులతో ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.


  బ్రెజిల్ జనాభా కూడా యూపీ జనాభాతో సమానంగా ఉంటుంది. కానీ అక్కడ 65వేల మంది మరణించారు. కానీ యూపీలో 800 మంది మాత్రమే చనిపోయారు.  అంటే యూపీలో ఎంతో మంది ప్రాణాలను కాపాడగలిగామని దీని అర్ధం.  100 ఏళ్ల క్రితం కూడా ఇలాంటి మహమ్మారే దేశాన్ని కబళించింది. అప్పుడు ఇంత జనాభా లేదు.  ఐనా ఇతర దేశాలతో పాటు భారత్‌లో ఎంతో మంది మరణించారు. అందుకే ప్రస్తుత కరోనా సమయంలో చాలా దేశాలు భారత్ పట్ల ఆందోళనగా ఉన్నాయి. కానీ అందరం కలిసికట్టుగా కరోనాను ఎదుర్కోగలిగాం.

  ప్రధాని మోదీ


  కాగా, బుధవారం యూపీలో 1,188 కొత్త కేసులు నమోదయ్యాయి. ఆ రాష్ట్రంలో ఇప్పటి వరకు 31,156 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 20,331 మంది వ్యాధి నుంచి కోలుకొని ఆస్పత్రుల నుండి డిశ్చార్జి కాగా.. మరో 845 మంది మరణించారు. ప్రస్తుతం యూపీలో 9,980 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Narendra modi, Pm modi, Up news, Uttar pradesh, Varanasi

  ఉత్తమ కథలు