ఉగ్రవాదానికి ఆర్థిక సాయం నిలిపేయాలి...మాల్దీవుల్లో పాకిస్తాన్‌కు మోదీ వార్నింగ్

పక్కదేశాలను బలహీనపరచాలన్న ఉద్దేశం తమకు ఉండదని స్పష్టంచేశారు మోదీ. 'పొరుగే ముందు' విధానానికి భారత్ ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు.

news18-telugu
Updated: June 8, 2019, 8:38 PM IST
ఉగ్రవాదానికి ఆర్థిక సాయం నిలిపేయాలి...మాల్దీవుల్లో పాకిస్తాన్‌కు మోదీ వార్నింగ్
ప్రధాని మోదీ
  • Share this:
మాల్దీవుల పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ పాక్ ప్రేరేపిత ఉగ్రవాదంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దేశాలు ప్రోత్సహించే టెర్రరిజంతో ప్రపంచానికి ముప్పు పొంచి ఉందని ఆయన అన్నారు. ఉగ్రవాదానికి ఆర్థికంగా చేయూతనివ్వడం మానుకోవాలని పాకిస్తాన్‌పై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. మాల్దీవులు పార్లమెంట్ 'పీపుల్స్ మజ్లిస్‌'లో ప్రసంగించిన మోదీ...ఇరుగుపొరుగు దేశాలు పరస్పరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. పక్కదేశాలను బలహీనపరచాలన్న ఉద్దేశం తమకు ఉండదని స్పష్టంచేశారు మోదీ. 'పొరుగే ముందు' విధానానికి భారత్ ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు.

మాల్దీవులు అతి ప్రాచీనమైన అమూల్యమైన ఆభరణం. మాల్దీవులు అభివృద్ధి చూస్తే గర్వంగా ఉంది. మీరు భారత్‌కు ఎంతో స్ఫూర్తినిచ్చారు. దేశ భద్రత, విపత్తులు, అభివృద్ధి అంశాల్లో మాల్దీవులతో భుజం భుజం కలిపి ముందుకు నడుస్తాం. వాతావరణ మార్పులను అధిగమించాలంటే పునరుత్పాదక శక్తికి మళ్లాల్సిన అవసరం ఉంది. అంతర్జాతీయ సౌర కూటమిలో మాల్దీవులు భాగస్వామిగా మంచి పరిణామం. ఇండో-ఫసిపిక్ ప్రాంతం మనకు జీవనరేఖ. వాణిజ్య సంబంధాలను మెరుగుపరుచుకుటే మనదేశాలన్నీ మరింత వృద్ధి సాధిస్తాయి.
నరేంద్ర మోదీ


ఉగ్రవాదం ప్రపంచ దేశాలకు ముప్పుగా మారింది. దేశాలు ప్రోత్సహించే ఉగ్రవాదాన్ని అంతమొందించాలి. పొరుగువారిని బలహీనపరచాలని భారత్ ఎప్పుడూ అనుకోదు. ఒకరికొకరం బలోపేతం చేసుకోవాలి. ఇరుగుపొరుగుకు భారత్ సహకారం ఎల్లప్పుడూ ఉంటుంది. 'ఇరుగుపొరుగే ముందు' విధానానికి భారత్ ప్రాధాన్యత ఇస్తుంది.  ఉగ్రవాదులు ఉగ్రవాదులే. వారిని మంచి, చెడుగా విభజిస్తూ చూడడం దురదృష్టకరం.
నరేంద్ర మోదీ


అంతకముందు ప్రధాని మోదీని మాల్దీవులు ప్రభుత్వం ఘనంగా సన్మానించింది. విదేశీయులకు మాల్దీవులు అందించే అత్యున్నత పురస్కారం..''The Most Honourable Order of the Distinguished Rule of Nishan Izzuddeen''తో మోదీని సత్కరించారు అధ్యక్షుడు సోలి. ఇక ప్రధాని మోదీ ఆ దేశాధ్యక్షుడు ఇబ్రహీం మహమ్మద్ సోలికి బ్యాట్ బహూకరించారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ, ధోనీతో పాటు ఇతర సభ్యుల సంతకాలతో కూడిన బ్యాట్‌ను ఆయనకు గిఫ్ట్‌గా ఇచ్చారు. మాల్దీవుల్లో క్రికెట్‌ను ప్రమోట్ చేయడంతో పాటు క్రీడాభివృద్ధికి భారత్ చేయూతనందిస్తుందని హామీ ఇచ్చారు మోదీ.
First published: June 8, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading