హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Money to Farmers: కేంద్రం గుడ్‌న్యూస్... రైతుల ఖాతాల్లో రూ.2000... ఎలా పొందాలంటే...

Money to Farmers: కేంద్రం గుడ్‌న్యూస్... రైతుల ఖాతాల్లో రూ.2000... ఎలా పొందాలంటే...

ఫ్రతీకాత్మాకచిత్రం

ఫ్రతీకాత్మాకచిత్రం

Money to Farmers: దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో కేంద్రం తెచ్చిన వ్యవసాయ బిల్లులపై నిరసనలు వ్యక్తమవుతున్న వేళ... కేంద్రం రైతులకు శుభవార్త చెప్పింది. అదేంటో తెలుసుకుందాం.

  Centre Money to Farmers: దేశంలో కరోనా ఇంకా పోలేదు. కొత్త కేసులు తగ్గుతున్నా... ప్రజల ఆర్థిక పరిస్థితి ఏమాత్రం మెరుగవ్వలేదు. రైతుల పరిస్థితి ఎప్పట్లాగే అష్టకష్టాలతో ఉంది. పంటలు చేతికొచ్చే సమయానికి... పురుగులు పట్టడమో, వర్షాలు అతిగా కురవడమో... అసలు దిగుబడే సరిగా రాకపోవడమో... ఇలా ఎన్నో సమస్యలు. ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. తాను ఎంతో ప్రతిష్టాత్మంకగా అమలు చేస్తున్న స్కీమ్ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద... రైతుల బ్యాంక్ అకౌంట్లలోకి మరోసారి నేరుగా డబ్బులు వచ్చి చేరబోతున్నట్లు బ్యాంకుల అధికారులు తెలిపారు. ఈ పీఎం కిసాన్ స్కీమ్ కింద ఏడాదికి రూ.6,000 ను కేంద్రం మూడు విడతలుగా ఇస్తోంది. అంటే మూడు పంటలకు... మూడుసార్లు ఆర్థిక సాయం చేస్తున్నట్లుగా లెక్కలేసింది.

  రూ.2000 ఎలా పొందాలి?:

  ఈ సంవత్సరం ఇప్పటికే రెండు విడతల్లో రూ.4000 దాకా ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం... మిగతా రూ.2000ను ఇప్పుడు ఇవ్వబోతోంది. పీఎం కిసాన్ స్కీమ్ ఆరంభం నుంచి చూస్తే ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లోకి రూ.12,000 జమచేసింది. ఇక ఇప్పుడు మరో విడత డబ్బులు రైతుల అకౌంట్లలోకి రానున్నాయని అధికారులు తెలిపారు. "ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే రెండు విడతల్లో డబ్బులు రైతులకు చేరాయి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మూడో విడత డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేయబోతోంది. అందువల్ల డిసెంబర్ నెలలో రైతులకు మళ్లీ రూ.2,000 రానున్నాయి. ఈ డబ్బును పొందేందుకు రైతులు ప్రత్యేకంగా ఏమీ చెయ్యాల్సిన పనిలేదు. డిసెంబర్‌లో మనీ వారి వారి అకౌంట్లలో డిపాజిట్ అవ్వగానే, విత్ డ్రా చేసుకొని... నెక్ట్స్ పంట కోసం విత్తనాలు, పురుగుమందులూ కొనుక్కోవచ్చు" అని అధికారులు తెలిపారు.

  వెంటనే పీఎం కిసాన్ స్కీమ్‌లో చేరండి:

  కరోనాకి ముందు వేర్వేరు పనులు చేస్తూ జీవించిన చాలా మంది... కరోనా తర్వాత వ్యవసాయం బాట పట్టారు. అలాంటి చాలా మంది ఈ స్కీమ్‌లో ఇంకా చేరలేదు. వాళ్లు ఇప్పుడు వెంటనే చేరితే... డిసెంబర్‌లో వచ్చే డబ్బును వారు కూడా పొందగలరని అధికారులు తెలిపారు. ఇప్పటికే పీఎం కిసాన్ స్కీమ్‌లో చేరిన రైతులకు ఆటోమేటిక్‌గా వారి అకౌంట్లలోకి మనీ వస్తాయి. మనీ రాగానే... వారి మొబైల్స్‌కి మెసేజ్ కూడా వస్తుంది. ఇప్పటివరకు ఈ స్కీమ్‌లో చేరని వారు... ఈ ప్రయోజనం పొందాలంటే... వెంటనే చేరాల్సి ఉంటుంది. ఇందుకోసం ఆన్‌లైన్‌లో పీఎం కిసాన్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి సులభంగానే స్కీమ్‌లో తమ పేరు, వివరాల్ని రిజిస్టర్ చేసుకోవచ్చునన్నారు. ఇందుకోసం https:// pmkisan.gov. in లింక్ ఉంది. ఈ లింక్ క్లిక్ చేసి... రిజిస్టర్ అవ్వొచ్చు. రిజిస్టర్ అయిన వారు... ఈ వివరాల్ని ఎవరికీ చెప్పాల్సిన పనిలేదు. ఆధార్ నెంబర్, పొలం పాస్‌బుక్, బ్యాంక్ అకౌంట్ వివరాలు తమ దగ్గరే ఉంచుకోవచ్చు.

  Published by:Krishna Kumar N
  First published:

  Tags: PM Kisan Scheme

  ఉత్తమ కథలు