హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

PM Modi Birthday: నరేంద్ర మోదీ హయాంలో బీజేపీలో జరిగిన కీలక మార్పులివే..

PM Modi Birthday: నరేంద్ర మోదీ హయాంలో బీజేపీలో జరిగిన కీలక మార్పులివే..

ప్రధాని నరేంద్ర మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ

PM Modi Birthday: ప్రపంచంలోనే శక్తిమంతమైన నాయకుడిగా భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గుర్తింపు తెచ్చుకున్నారు. భారతదేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న నేతకు జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ రోజు ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఆయన హయాంలో బీజేపీలో జరిగిన కీలక మార్పులేంటో తెలుసుకుందాం.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad | Vijayawada

ప్రపంచంలోనే శక్తిమంతమైన నాయకుడిగా భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Indian Prime Minister Narendra Modi) గుర్తింపు తెచ్చుకున్నారు. భారతదేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న నేతకు జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ రోజు ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఆయన హయాంలో బీజేపీ (BJP)లో జరిగిన కీలక మార్పులు ఏంటో తెలుసుకుందాం.

* 1987లో BJPలో చేరిన మోదీ

నరేంద్ర మోదీ బీజేపీలో (Bharatiya Janata Party- BJP) అధికారికంగా 1987లో చేరారు. అంతకు ముందు 35 సంవత్సరాల పాటు మోదీ ఆర్ఎస్ఎస్(RSS)లో క్రియాశీలకంగా పని చేశారు. 2013లో ప్రధాన మంత్రి అభ్యర్థిగా ప్రకటించే కంటే ముందే నరేంద్ర మోదీ బీజేపీకి సరికొత్త ఆర్కిటెక్ట్‌గా ఉంటారని పలుమార్లు మీడియాలో కథనాలు వచ్చాయి. 2014 నుంచి 2022 వరకు నరేంద్ర మోదీ బీజేపీలో సమూల మార్పులు చేసి సరికొత్త బీజేపీగా మార్చారు.

ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా నరేంద్ర మోదీ, అమిత్ షాల కృషితో బీజేపీ ఏర్పడింది. పార్టీ నిర్మాణంలో గుణాత్మక మార్పులు జరగగా పార్టీకి మద్దతుదారులు అనూహ్యంగా పెరిగారు. 2014 ఎన్నికల ముందు పార్టీని హిందీ మాట్లాడే ఉత్తరాది రాష్ట్రాల గ్రామీణ ప్రాంతాలన్నిటికీ బీజేపీని విస్తరించారు. ఫలితంగా 543 లోక్ సభ స్థానాలలో 225 సీట్లను బీజేపీ గెలుచుకో గలిగింది. 127 గ్రామీణ లోక్ సభ నియోజకవర్గాలలో బీజేపీ ఓట్ షేర్ 40 శాతానికి పెరిగింది.

* ఈశాన్య రాష్ట్రాల్లోనూ బలోపేతం

హిందీయేతర రాష్ట్రాల్లోనూ బీజేపీ విస్తరణకు నరేంద్ర మోదీ హయాంలో అడుగులు పడటమే కాదు..ఆయా రాష్ట్రాల్లో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు కూడా. ఇతర రాజకీయ పార్టీలతో పొత్తులతో పాటు విలీనాల దిశగా బీజేపీ తీసుకున్న నిర్ణయాల ద్వారా బీజేపీ ఉత్తర భారతదేశం నుంచి మిగతా ప్రాంతాలకు విస్తరించింది. ఈశాన్య రాష్ట్రాల్లో ఈ పార్టీకి ఫుల్ సపోర్ట్ లభిస్తోంది. అస్సాం, త్రిపుర , నాగలాండ్, మేఘాలయ వంటి రాష్ట్రాల్లో బీజేపీ రికార్డు సృష్టించింది. రాజకీయంగా బలమైన పార్టీగా బీజేపీ అవతరించడంలో నరేంద్ర మోదీ కీలక పాత్ర పోషించారు.

* అన్ని వర్గాలకు ప్రాధాన్యం

బీజేపీ ఉన్నత కులాల పార్టీగానే ఏళ్ల తరబడి కొనసాగుతుందన్న ఆలోచనలో మార్పులు ఆచరణలో తీసుకొచ్చారు. లోక్ సభలో బీజేపీ తరఫున 113 మంది ఓబీసీలు, 43 మంది ఎస్టీలు, 53 మంది ఎస్సీలు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారని ప్రధాని మోదీ 2020లో తెలిపారు. తద్వారా మిగతా అన్ని కులాల వారికి బీజేపీ ప్రాధాన్యతనిస్తుందన్న సంకేతాన్ని మోదీ విజయవంతంగా పంపారు.

ఇది కూడా చదవండి : ప్రధాని మోదీ హయాంలో చోటుచేసుకున్న కీలక ఘటనలపై ఓ లుక్కేయండి..

బీజేపీకి ఉన్న 303 మంది లోక్ సభ సభ్యులలో 69 శాతం అంటే 209 మంది ఉన్నత శ్రేణికి చెందిన వారు కాదని బీజేపీ చెప్పకనే చెప్పింది. దేశవ్యాప్తంగా ఉన్న కులాలలో 69 శాతం మందికి బీజేపీ ద్వారా రాజకీయ అధికారం అందిందని పార్టీ విస్తృతంగా ప్రచారం చేసింది.

* నిరుపేదలకు అండ

నరేంద్ర మోదీ ప్రభుత్వం 2014లోనే ప్రజలకే కేంద్రంగా స్కీమ్స్ కొనసాగేలా ప్లాన్ చేసింది. అలా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (Direct Benefit Transfers -DBT) నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి సంక్షేమ పథకాల కింద నగదు జమ అయే విధంగా చర్యలు తీసుకుంది. లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ సబ్సిడీ(LPG), గ్రామీణ ప్రాంతాల్లో గృహాలు, టాయ్‌లెట్ల నిర్మాణాలకు నగదును కేంద్రం నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో వేస్తోంది. అలా బీజేపీ నిరుపేదలకు అండగా నిలిచే పార్టీగా పేరు సంపాదించుకుంది.

* మహిళలకు అవకాశాలు

బీజేపీకి మహిళల్లో ఓటు షేర్ కూడా గణనీయంగా పెరిగింది. దేశంలోని రాష్ట్రాలలో ఉన్న మహిళలందరూ కాంగ్రెస్ కంటే ఎక్కువగా బీజేపీ ఓట్లు వేసినట్లు తేలింది. బీజేపీ తరఫున 2019 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన మహిళా అభ్యర్థుల సంఖ్య మిగతా పార్టీల కంటే ఎక్కువగా ఉంది. నరేంద్ర మోదీ తన కేబినెట్‌లో మహిళలకు మంత్రులుగా మిగతా ప్రధానమంత్రుల కంటే ఎక్కువగా అవకాశం ఇచ్చారు.

Published by:Sridhar Reddy
First published:

Tags: Bjp, Narendra Modi Birthday, National News, PM Narendra Modi

ఉత్తమ కథలు