భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) రేపు తన 72వ పుట్టినరోజు (Birthday)ను జరుపుకోనున్నారు. మోదీ సెప్టెంబర్ 17, 1950న గుజరాత్‌లోని మెహసానా జిల్లాలోని వాద్నగర్లో జన్మించారు. ప్రధానమంత్రి అయిన సమయం నుంచి ఆయన తన పుట్టినరోజు సందర్భంగా దేశంలో సరికొత్త ప్రాజెక్టులను ప్రారంభిస్తున్నారు. ఈసారి మోదీ తన జన్మదినాన మధ్యప్రదేశ్‌కి వెళ్లనున్నారు. నమీబియా నుంచి తీసుకువచ్చిన ఎనిమిది చిరుతలను మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లోకి విడుదల చేయనున్నారు. మనదేశంలో ఆఖరి చీతా 1948లో చనిపోయింది. తర్వాత ఈ చీతాలు 1950 కాలంలో దేశంలో పూర్తిగా కనుమరుగైన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. మళ్లీ ఇప్పుడు మోదీ వీటిని దేశంలోకి తీసుకొస్తున్నారు. అయితే మోదీ బర్త్‌డే సందర్భంగా ఆయన ఇప్పటివరకు ఎంత ఆస్తి సంపాదించారనేది హాట్‌టాపిక్‌గా మారింది. మరి ఆయనకున్న స్థిర, చర ఆస్తులు ఎంతో ఇప్పుడు తెలుసుకుందాం.
* మోదీ సంపద ఎంత?
ప్రపంచంలోనే టాప్ పవర్ఫుల్ లీడర్స్‌లో ఒకరైన మోదీ ఆస్తి ఎంతో తెలిస్తే ఎవరైనా, సరే.. అవాక్కవ్వాల్సిందే. మోదీకి ప్రస్తుతం స్థిరాస్తులంటూ (Immovable Property) ఏవీ లేవు. కొంతకాలం క్రితం సొంత రాష్ట్రమైన గుజరాత్‌లోని రెసిడెన్షియల్ ప్లాట్‌లో ఉన్న ఒక్కగానొక్క తన ల్యాండ్ వాటాను విరాళంగా అందించారు. దాంతో ఇప్పుడు మోదీకి ఎలాంటి స్థిరాస్తి లేకుండా పోయింది.
అతనికి చరాస్తులు (Movable Assets) మాత్రం రూ.2.23 కోట్లకు పైగా ఉన్నాయి. వీటిలో ఎక్కువగా బ్యాంకు డిపాజిట్లు ఉన్నాయి. గత నెలలో ప్రధానమంత్రి కార్యాలయం (PMO) నుంచి వచ్చిన ప్రకటన ప్రకారం, 2021-22లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చరాస్తులు రూ.26 లక్షలు పెరిగాయి. అంటే మార్చి 2021 చివరి నాటికి రూ.1,97,68,885గా ఉన్న అతని సంపద మార్చి 31, 2022 నాటికి రూ.2,23,82,504కి పెరిగింది.
మోదీ తనకు ప్రస్తుతం ఎలాంటి స్థిరాస్తి లేదని చెబుతూ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ సెక్షన్లో ‘NIL’ అని పేర్కొన్నారు. మోదీ స్థిరాస్తి సర్వే నం.401/A అనేది మూడు ఇతర జాయింట్ ఓనర్లతో కలిసి ఉండేది. వీరందరికీ ఆ ప్రాపర్టీలో 25% సమాన వాటా ఉంది. అయితే ఇప్పుడు ఆ ప్రాపర్టీలో తన వాటాను మోదీ డొనేట్ చేశారు. ఈ స్థిరాస్తికి మార్కెట్ వాల్యూ రూ.1.10 కోట్లుగా ఉంది. 2002లో ఈ రెసిడెన్షియల్ ప్రాపర్టీని కొన్నట్లు మోదీ గత ఏడాది ప్రకటించారు.
ఇది కూడా చదవండి : 74 ఏళ్ల తర్వాత ఇండియాలోకి చీతాలు.. ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజు కానుక
* 1.48 లక్షల బంగారం
ఓ రీసెంట్ మూవబుల్ ప్రాపర్టీస్ విశ్లేషణ ప్రకారం, మోదీకి హ్యాండ్-ఇన్-క్యాష్ రూ.36,900 నుంచి రూ.35,250కి తగ్గింది. మోదీ నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్లో రూ.8.9 లక్షలు పెట్టుబడి పెట్టారు. లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలో రూ.1,50,957 ప్రీమియం డిపాజిట్ చేశారు. ఎల్ అండ్ టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాండ్ల రూపంలోనూ ఆయనకు ఇన్వెస్ట్మెంట్లు ఉన్నాయి. వీటిని 2012లో రూ.20,000కు మోదీ కొనుగోలు చేశారని సమాచారం. మోదీ తనకు రూ.1.48 లక్షల విలువైన నాలుగు బంగారు ఉంగరాలు ఉన్నాయని గతంలో డిక్లేర్ చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Narendra Modi Birthday, National News, PM Narendra Modi