హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Narendra Modi Birthday: 72 ఏళ్ల వయస్సులోనూ సూపర్ ఫిట్ గా ప్రధాని మోదీ.. నరేంద్రుడి హెల్త్ సీక్రెట్స్ ఇవే..

Narendra Modi Birthday: 72 ఏళ్ల వయస్సులోనూ సూపర్ ఫిట్ గా ప్రధాని మోదీ.. నరేంద్రుడి హెల్త్ సీక్రెట్స్ ఇవే..

Narendra Modi Birthday

Narendra Modi Birthday

Narendra Modi Birthday: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సెప్టెంబర్‌ 17న తన 72వ పడిలోకి అడుగుపెట్టనున్నారు. ఇప్పటికీ మోదీ రోజంతా బిజీగా, చురుగ్గా పని చేస్తారు. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకునే మోదీ ఆహారపు అలవాట్లు ఎలా ఉంటాయో తెలుసుకుందాం.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) సెప్టెంబర్‌ 17న తన 72వ పుట్టినరోజు(Birthday) జరుపుకొంటున్నారు. ఇప్పటికీ మోదీ రోజంతా బిజీగా, చురుగ్గా పని చేస్తుండడం చూసి చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటారు. మోదీ రోజుకు దాదాపు 14 గంటలు పని చేస్తారు. ఆయన ఇప్పటికీ ఫిట్‌ (Fit)గా ఉండటానికి కారణం ఆయన పాటించే జీవనశైలి. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆయన నియమాలు తప్పకుండా ఉండేందుకు ప్రయత్నిస్తారు. ప్రతి రోజూ ఆయన తెల్లవారు జామునే నిద్రలేస్తారు. తప్పకుండా యోగా, సూర్యనమస్కారాలు, ధ్యానం చేస్తారు. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకునే మోదీ ఆహారపు అలవాట్లు ఎలా ఉంటాయో తెలుసుకుందాం.

* ఇష్టమైన ఆహారం కిచిడీ

మోదీ ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండటానికి చాలా కఠినమైన ఆహార నియమాలను పాటిస్తారు. రిచ్ లేదా స్పైసీ ఫుడ్‌కు ఆయన దూరంగా ఉంటారు. ఎక్కువగా సాధారణ గుజరాతీ ఆహారాన్ని ఇష్టపడతారు. అన్నింటికంటే ఖిచ్డీ(Khichdi) అమితంగా ఇష్టపడుతారు. అదే విధంగా ఆయన తన ఆహారం, ఆకలిని సమతుల్యం చేసుకోవడానికి ప్రతిరోజూ ఒక కప్పు పెరుగు(Curd) తింటారు.

ఓ సందర్భంలో మోదీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..నేను హిమాచల్ ప్రదేశ్‌లో లభ్యమయ్యే పుట్టగొడుగులను కూడా తింటాను. ఆ పుట్టగొడుగుల్లో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఆ పుట్టగొడుగు శాస్త్రీయ నామం మాక్రులా ఎక్సులెంటా అని చెప్పారు. పరాటాలు కూడా ఎక్కువగా తీసుకుంటానని తెలిపారు.

* అమెరికా పర్యటనలోనూ ఉపవాసం

70 ఏళ్లు పైబడినప్పటికీ, మోదీ తన జీవితంలో ఉపవాసం చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు. శరీరాన్ని శుద్ధి చేయడానికి ఉపవాసం చాలా మంచి టెక్నిక్ అని నమ్ముతారు. 35 ఏళ్లుగా నవరాత్రుల కోసం ఉపవాసం ఉంటున్నట్లు 2012లో మోదీ చెప్పారు. 2014లో ఆయన అమెరికా పర్యటనలో ఉండగా కూడా సంప్రదాయాన్ని పక్కనపెట్టలేదు. ఆ సమయంలోనూ కేవలం నిమ్మరసం మాత్రమే తాగారు.

ఇది కూడా చదవండి : హిందీ మాట్లాడాలంటే వణుకు పుడుతుంది.. కేంద్ర మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు

* శారీరక, మానసిక ఆరోగ్యానికి యోగా(Yoga)

యోగాను ఎక్కువగా ప్రోత్సహించే వారిలో, ఆచరించే వారిలో మోదీ ఒకరు. ఆయన ప్రతిరోజూ తప్పకుండా యోగా చేస్తారు. యోగా చేయడం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం లభిస్తుందని నమ్ముతారు. తన దినచర్యలో, ఉదయం ధ్యానం, నడక, యోగా తప్పకుండా ఉండేలా చూసుకుంటారు. వాటితోనే ఆయన తన రోజును ప్రారంభిస్తారు. వీటితోపాటు తప్పకుండా సూర్య నమస్కారాలు చేస్తారు.

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంలో యోగా సాధన ప్రాముఖ్యతను మోదీ హైలైట్ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలు యోగాను అనుసరించాలని సూచించారు. శారీరక, మానసిక ఆరోగ్యానికి యోగా ఎంతో మేలు చేస్తుందని వివరించారు. 2014 డిసెంబర్ 11న ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ(UNGA) జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించింది. మోదీ పిలుపు అనంతరం ఈ నిర్ణయం వెలువడింది.

First published:

Tags: Health secrets, Narendra Modi Birthday, National News, PM Narendra Modi

ఉత్తమ కథలు