హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Narendra Modi: మోదీ వ్యక్తి కాదు.. ఓ శక్తి ! ప్రజల మనస్సులు మార్చే శాస్త్రం ఆయన సొంతం: సీనియర్‌ జర్నలిస్ట్‌ అజయ్‌ సింగ్‌

Narendra Modi: మోదీ వ్యక్తి కాదు.. ఓ శక్తి ! ప్రజల మనస్సులు మార్చే శాస్త్రం ఆయన సొంతం: సీనియర్‌ జర్నలిస్ట్‌ అజయ్‌ సింగ్‌

భారత ప్రధాని నరేంద్ర మోదీ

భారత ప్రధాని నరేంద్ర మోదీ

జర్నలిజంలో 35 ఏళ్ల అనుభవం ఉన్న అజయ్ సింగ్ అనే వ్యక్తి ‘ది ఆర్కిటెక్ట్ ఆఫ్ ది న్యూ బీజేపీ: హౌ నరేంద్ర మోదీ ట్రాన్స్‌ఫార్మ్ ది పార్టీ’ అనే పుస్తకాన్ని రచించారు. ప్రస్తుతం ఆయన భారత రాష్ట్రపతికి ప్రెస్ సెక్రటరీగా ఉన్నారు. ఈ పుస్తకం గురించి, మోదీ విలక్షణమైన వ్యక్తిత్వం గురించి ఆయన వివరించారు.

ఇంకా చదవండి ...

‘సంఘ శక్తి కలియుగే’ అనే నినాదం రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(RSS) కార్యకలాపాలు నిర్వహించే ప్రతి భవనంపై కనిపిస్తుంది. నినాదం సూచించినట్లుగా.. RSS ఫౌండింగ్‌ ప్రిన్సిపుల్‌ అనేది కలెక్టివిటీ ఆఫ్‌ సొసైటీ, రాష్ట్ర, దేశాన్ని ఒక భౌతిక సంస్థగా నిర్మించడంపై ఆధారపడి ఉంటుంది. దేశవ్యాప్తంగా RSS వాలంటీర్లు నిర్వహించే మార్నింగ్ డ్రిల్స్‌, ఇతర శిక్షణ కార్యక్రమాలు వారిలో క్రమశిక్షణ, ఆర్గనైజింగ్ స్కిల్స్‌ను పెంపొందిస్తాయి. వారు ఆటలు ఆడతారు, బృందగానం చేస్తారు, మాతృభూమిని రక్షించడానికి సామూహిక ప్రతిజ్ఞ చేస్తారు, ప్రతిజ్ఞను వారు మా భారతి లేదా మదర్‌ ఇండియా అని సంబోధిస్తారు. RSS ప్రభావ రాజకీయాలు, దేశంలో మార్పుల గురించి చాలా పుస్తకాలు అందుబాటులోకి వచ్చాయి.

అయితే జర్నలిజంలో 35 ఏళ్ల అనుభవం ఉన్న అజయ్ సింగ్ అనే వ్యక్తి ‘ది ఆర్కిటెక్ట్ ఆఫ్ ది న్యూ బీజేపీ: హౌ నరేంద్ర మోదీ ట్రాన్స్‌ఫార్మ్ ది పార్టీ’ అనే పుస్తకాన్ని రచించారు. ప్రస్తుతం ఆయన భారత రాష్ట్రపతికి ప్రెస్ సెక్రటరీగా ఉన్నారు. ఈ పుస్తకం గురించి, మోదీ విలక్షణమైన వ్యక్తిత్వం గురించి ఆయన ప్రస్తావించిన విషయాలు ఇవే..

* యూపీ భద్రతా ఏజన్సీలను కదిలించిన మోదీ

RSS, దాని అనుబంధ సంస్థల పరిమాణం, ప్రభావం పెరిగాయి. భారత రాజకీయాల గమనాన్ని ప్రభావితం చేసిన ఆర్‌ఎస్‌ఎస్‌ ఆర్గానిక్‌ గ్రోత్‌, డైనమిక్స్‌ గురించి చాలా పుస్తకాలు వచ్చాయి. ఈ పుస్తకం ఒక వ్యక్తి నరేంద్ర దామోదరదాస్ మోదీ సంస్థాగత నైపుణ్యాలపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఉత్తరప్రదేశ్‌లో అప్పటి భాజపా అధ్యక్షుడు మురళీ మనోహర్ జోషి ఏక్తా యాత్ర(1990-91)కి రాష్ట్రవ్యాప్తంగా ఎస్కార్ట్ చేస్తున్న ఒక పోలీసు సూపరింటెండెంట్ విస్మయం, అవిశ్వాసం కలగలిసిన స్వరంలో చెప్పినప్పుడు నేను మొదటిసారి మోదీ గురించి విన్నాను. ఈ యాత్రను అసాధారణ రీతిలో నిర్వహిస్తున్న నరేంద్రమోదీ అనే వ్యక్తి ఉన్నారని, ఉత్తరప్రదేశ్‌ను అప్పుడు భాజపా పాలిస్తోందని, కళ్యాణ్‌సింగ్ ముఖ్యమంత్రిగా ఉన్నారని, జోషి అంతర్గత భద్రతా వలయంలోకి చొచ్చుకుపోవటం పోలీసు ఎస్కార్ట్ బృందానికి సాధ్యం కాలేదని, భాజపా వాలంటీర్లు డేర్‌డెవిల్స్‌, జోషి ప్రయాణిస్తున్న వాహనం దగ్గరకు కూడా ఎవరూ రాలేనంతగా మారుతీ వ్యాన్‌లను నడుపుతున్నారని పోలీసు సూపరింటెండెంట్ చెప్పారు.

ఇదీ చదవండి: ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు షాకింగ్ న్యూస్.. కొన్ని రోజులు అలా తప్పదంట..!


మోదీ ఏక్తా యాత్రను నిర్వహించిన తీరు ఉత్తరప్రదేశ్‌లోని భద్రతా ఏజన్సీలను కదిలించింది. అతని మైక్రో మేనేజ్‌మెంట్, హ్యాండ్-ఆన్ విధానం వాలంటీర్ల సైన్యాన్ని ఉత్తేజపరిచాయి. వారు క్లాక్‌వర్క్ కచ్చితత్వంతో పని చేశారు. జోషిని ప్రయాణిస్తున్న వాహనంతో పాటు వ్యాన్‌లను నడుపుతున్న వారు ప్రయాణిస్తూనే ఆడియో టేపుల్లో రికార్డ్ చేసిన సూచనలను విని, ఇతరులకు అందజేసేవారు. అందరూ ఒకే విధంగా నడుచుకునేలా శిక్షణ పొందారు. పార్టీ కార్యాలయాలు, మీడియా సంస్థలతో సన్నిహితంగా ఉండటానికి వాలంటీర్లు ఫ్యాక్స్ మెషీన్‌లను (ఇంటర్నెట్‌కు ముందు రోజులు) తీసుకెళ్లారు.

* మొదటి సారి ఢిల్లీలో కలిశాను

1991లో యూపీ పోలీసు అధికారుల నుంచి నేను విన్న విషయాలు మోదీని అత్యంత వ్యవస్థీకృత, సమర్థవంతమైన నాయకుడనే అభిప్రాయాన్ని ఇచ్చాయి. నేను అతనిని కలవకపోయినప్పటికీ, సోర్సెస్‌ ద్వారా అతని లక్షణాల గురించి నాకు తెలుసు. నేను 1995లో లక్నోలోని టెలిగ్రాఫ్ ప్రత్యేక కరస్పాండెంట్‌ జాబ్‌ విడిచిపెట్టి, దేశ రాజధానిలో పయనీర్‌లో చేరినప్పుడు ఢిల్లీకి వెళ్లాను. భాజపా బీట్‌ను కవర్ చేసే రిపోర్టర్‌గా అక్కడ నా మొదటి అసైన్‌మెంట్‌లో, పార్లమెంటు అనెక్స్‌లో జరిగిన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో నేను మోదీని చూశాను. ఒక మధ్యాహ్నం సెషన్‌లో, అతను మెయిన్ హాల్ వైపు నడుస్తూ ఉండటం నేను గమనించాను. అతనికి విలక్షణమైన రిపోర్టర్ స్టైల్‌లో నన్ను నేను పరిచయం చేసుకున్నాను. ముఖ్యమంత్రి కేశూభాయ్ పటేల్‌పై శంకర్‌సింగ్ వాఘేలా తిరుగుబాటు చేసిన తర్వాత, పార్టీలో వర్గపోరును అరికట్టేందుకు మోదీని తన సొంత రాష్ట్రమైన గుజరాత్ నుంచి అక్షరాలా బహిష్కరించి ఢిల్లీలో నియమించిన సమయం అది. ఆ పరిణామం తర్వాత మోదీ నిరుత్సాహానికి గురయ్యారు. కానీ అతను ఈ మార్పును తన పంథాలో తీసుకున్నారు. రాబోయే పనిపై దృష్టి సారించారు.

* భాజపాను ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా నిలిపారు

హర్యానా, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్‌లలో పార్టీ పునాదిని నిర్మించే బరువైన పనిని ఆయనకు అప్పగించారు. భాషా ప్రాతిపదికన రాష్ట్ర విభజన తరువాత పంజాబ్ నుంచి వేరైనప్పటికీ- ఈ సమస్యను అధిగమించడం అసాధ్యంగా కనిపించింది. స్వల్పకాలిక లక్ష్యాలు, దీర్ఘకాలిక లక్ష్యాలతో కూడిన మిశ్రమ వ్యూహాన్ని సిద్ధం చేయాలని రాష్ట్ర నాయకత్వాన్ని మోదీ ఆదేశించారు. అతను మొదటి దశలో బన్సీ లాల్‌తో పొత్తును విజయవంతంగా కుదుర్చుకున్నారు. ఆ పార్టీ అధినేత నేతృత్వంలోని అధికార సంకీర్ణంలో భాగస్వామి కావడానికి వీలు కల్పించారు. అయితే ఈ ప్రయోగం ఎక్కువ కాలం నిలవలేదు, త్వరలోనే బీజేపీ బన్సీ లాల్‌తో విభేదించింది. ఆ తర్వాత చౌతాలాతో పొత్తుకు ప్రయత్నించింది, అది కూడా ఫలించలేదు.

సంకీర్ణ రాజకీయాల ప్రయోగం సైడ్‌ స్టోరీ. నిజంగా ముఖ్యమైనది ఏమిటంటే రాష్ట్రంలో మోదీ నిర్మించిన పునాది. భాజాపాను ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఆయన ఎలా అంచనా వేశారు. జిల్లాల వారీగా, కార్యకర్తలను సమీకరించారు. రాష్ట్ర రాజకీయాలను నడిపించే ఏకైక అంశం కులం అనే భావనను నిర్వీర్యం చేశారు. కార్గిల్ యుద్ధ అమరవీరుడి వితంతువు సుధా యాదవ్‌ను లోక్‌సభ ఎన్నికలలో పోటీకి దింపడం వంటి ఆలోచనలతో ఆయన ముందుకు వచ్చారు. పార్టీలోని వర్గాలు ఈ చర్యను వ్యతిరేకించినప్పటికీ ఆయన వెనకడుగు వేయలేదు.

* శిక్షణతో కార్యకర్తల్లో క్రమశిక్షణ

అదేవిధంగా, విభిన్న సామాజిక నేపథ్యాల యువకులను కలుపుకొని పార్టీ పనిలో వారికి శిక్షణ ఇవ్వాలని పార్టీ రాష్ట్ర యూనిట్ నాయకులను ఆయన కోరారు. అతను మౌలిక సదుపాయాలను నిర్మించాలని పట్టుబట్టారు. పార్టీకి సొంత కార్యాలయాలు ఉండాలని కోరుకున్నారు. కంప్యూటరీకరణ కోసం ముందుకు వచ్చారు. కొత్తవారికి శిక్షణా సమావేశాలు నిర్వహించారు. వారిలో ఎక్కువ మంది ఆర్‌ఎస్‌ఎస్ శాఖల నుంచి సంస్కృతి, విలువను పొందిన వారు కాదు. కానీ వారిని వరుస శిక్షణా సెషన్‌లకు హాజరయ్యేలా చేసి, వారిలో క్రమశిక్షణ మరియు విలువలు పెంపొందించారు. మోదీ దృష్టిలో, శిక్షణ అనేది ప్రజల మనస్సులను మలచడంలో సహాయపడే ఒక శాస్త్రం. ఇది సంస్థను నిర్మించడంలో కీలకమైన అంశం.

Published by:Mahesh
First published:

Tags: Bjp, Modi, Narendra modi, RSS

ఉత్తమ కథలు