నరేంద్ర మోదీ రెండోసారి ప్రధానిగా తొలి సంతకం దీనిపైనే..

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండోసారి ప్రమాణస్వీకారం చేసిన తర్వాత జాతీయ రక్షణ నిధికి సంబంధించి కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు.

news18-telugu
Updated: May 31, 2019, 6:25 PM IST
నరేంద్ర మోదీ రెండోసారి ప్రధానిగా తొలి సంతకం దీనిపైనే..
ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం అనంతరం సతకం చేస్తున్న మోదీ
  • Share this:
భారతదేశ ప్రధానిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత నరేంద్ర మోదీ కీలక నిర్నయం తీసుకున్నారు.  దేశంలో జాతీయ రక్షణ నిధికి సంబంధించి కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధానమంత్రి స్కాలర్‌షిప్ స్కీమ్‌లో మార్పులు చేశారు. ఈ పథకం కింద దేశ సేవలో ప్రాణాలు కోల్పోయిన అమర జవాన్ల పిల్లలకు స్కాలర్ షిప్ అందిస్తారు. ఈ స్కాలర్ ‌షిప్‌ను బాలురకు నెలకు రూ.2000 నుంచి రూ.2500కు పెంచారు. బాలికలకు రూ.2250 నుంచి రూ.3000కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే, ఈ పథకం కిందకు మరికొన్నింటిని కూడా చేర్చారు. ఇప్పటి వరకు కేంద్ర బలగాలు, పారామిలటరీ బలగాలు,రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, వారి పిల్లలను కూడా ఈ స్కాలర్‌షిప్ పరిధిలో ఉన్నారు. తాజాగా రాష్ట్ర పోలీసు విభాగాలను కూడా ఈ స్కీమ్ పరిధిలోకి తీసుకొచ్చారు. ఉగ్రవాదుల దాడులు, నక్సల్ దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారి పిల్లలకు ఈ స్కీమ్ కింద సాయం అందుతుంది. ఏడాదికి 500 మందిని ఈ పథకం పరిధిలోకి తీసుకోవచ్చు. దీనిపై కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంటుంది.

జాతీయ రక్షణ నిధి అనేదాన్ని 1962లో ప్రారంభించారు. ప్రజలు, వివిధ వర్గాల నుంచి నిధులు సేకరిస్తారు. ఆ నిధులను స్కాలర్‌షిప్‌ గా అందిస్తారు. కేంద్ర బలగాలు, పారామిలటరీ బలగాలు,రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, వారి పిల్లలకు ఈ స్కీమ్ అందుతుంది. ప్రధానమంత్రి చైర్ పర్సన్‌గా, రక్షణ, ఆర్థిక, హోంశాఖ మంత్రులు సభ్యులుగా ఓ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఈ ఫండ్‌ బాధ్యతలు చూస్తుంది.
First published: May 31, 2019, 6:17 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading