బాలీవుడ్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం.. ముగ్గురు హీరోయిన్లకు నోటీసులు

Bollywood Drugs Case: సుశాంత్ రాజ్‌పుత్ మృతి కేసు దర్యాప్తులో భాగంగా డ్రగ్స్ కేసును ఎన్సీబీ లోతుగా విచారిస్తోంది.

news18-telugu
Updated: September 23, 2020, 6:20 PM IST
బాలీవుడ్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం.. ముగ్గురు హీరోయిన్లకు నోటీసులు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
బాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఎన్సీబీ(నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో) దూకుడు పెంచింది. రియా చక్రవర్తితో పాటు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాజీ మేనేజర్ జయా సాహాను విచారించిన ఎన్సీబీ... వారిచ్చిన సమాచారం ఆధారంగా ఈ కేసులో దీపిక పదుకొణె, సారా అలీ ఖాన్, శ్రద్ధా కపూర్, రకుల్ ప్రీత్ సింగ్‌లకు సమన్లు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి మూడు రోజుల్లో తమ ముందుకు హాజరుకావాలని ఎన్సీబీ ఆదేశించింది. సుశాంత్ రాజ్‌పుత్ మృతి కేసు దర్యాప్తులో భాగంగా డ్రగ్స్ కేసును ఎన్సీబీ లోతుగా విచారిస్తోంది. ఈ కేసులో నిన్న దీపిక పదుకొణె కరిష్మా ప్రకాశ్‌ను ప్రశ్నించిన ఎన్సీబీ.. రియా ఫోన్ చాటింగ్ ఆధారంగా వీరికి సమన్లు జారీ చేసినట్టు తెలుస్తోంది.

దీపికతో పాటు శ్రద్ధా కపూర్, సారా అలీ ఖాన్‌లకు సైతం ఎన్సీబీ సమన్లు జారీ చేసినట్టు తెలుస్తోంది. ఇక ఈ కేసులో ఇప్పటివరకు ఎన్సీబీ 12 మందిని అరెస్ట్ చేసింది. వీరిలో రియా చక్రవర్తితో పాటు ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి కూడా ఉన్నారు. ఈ కేసు విచారణ సందర్భంగా రియా చక్రవర్తి పలువురు పేర్లను ప్రస్తావించినట్టు తెలుస్తోంది. తాను సారా అలీ ఖాన్, శ్రద్ధా, రకుల్‌తో కలిసి సుశాంత్‌కు చెందిన లోనావాలా ఫామ్ హౌస్‌లో పార్టీ చేసుకున్నట్టు చెప్పినట్టు కథనాలు వచ్చాయి.
Published by: Kishore Akkaladevi
First published: September 23, 2020, 6:14 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading