Home /News /national /

NAME THE BULLET TRAIN AND DESIGN MASCOT GET A CHANCE TO WIN RS 50000 BA

చరిత్రలో నిలిచిపోయే బంపర్ ఆఫర్.. బుల్లెట్ ట్రైన్‌కి నామకరణం చేస్తే బంపర్ ప్రైజ్...

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఈ పోటీలో పాల్గొనాలనుకునే వారు... mygov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి లాగిన్ అవ్వాలి. మీ సూచనలు, సలహాలు అందించాలి.

    మీలో మంచి టాలెంట్ ఉందా? మీ బుర్రలో కొత్త కొత్త ఐడియాలు పుట్టుకొస్తాయా? అయితే,ఈ కాంటెస్ట్ మీకోసమే. దేశంలోని మొట్టమొదటి బుల్లెట్ ట్రైన్‌కి మస్కట్ డిజైన్ చేయండి. అలాగే, దానికి పేరు పెట్టండి. ఒకవేళ మీరు ప్రతిపాదించినవి సెలక్ట్ అయితే, మీకు క్యాష్ ప్రైజ్ దక్కుతుంది. రూ.50,000 నగదు బహుమతి ఇస్తారు. జాతీయ హైస్పీడ్ రైలు ప్రాజెక్ట్ లిమిటెడ్ ఈ అవకాశాన్ని కల్పించింది. గతంలో2010 కామన్వెల్త్ క్రీడలకు, ఎయిర్ ఇండియా మహారాజా కోసం ఇలాంటి పోటీ నిర్వహించారు. ఇప్పుడు మరోసారి అలాంటి అవకాశం కల్పించారు.

    Bullet train, Bullet Train name, Name the bullet train, Mascot for Bullet train, Mumbai Ahmadabad Bullet Train, Bullet Train Name, Bullet Train Mascot, బుల్లెట్ ట్రైన్, బుల్లెట్ ట్రైన్‌కి పేరు పెట్టండి, బుల్లెట్ ట్రైన్‌కి మస్కట్ తయారు, ముంబై అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్
    ప్రతీకాత్మక చిత్రం


    మీరు డిజైన్ చేసే మస్కట్ NHRCLలక్ష్యాన్ని స్పష్టంగా తెలియజేసేదిగా ఉండాలి. ఆ సంస్ధ గౌరవాన్ని పెంచేలా ఉండాలి. బుల్లెట్ ట్రైన్‌కి మీరు పెట్టిన పేరుని వినగానే.. జనం మనసుల్లో ఒక ముద్రపడిపోవాలి. ఆ పేరు వినగానే బుల్లెట్ ట్రైన్ మనసులో మెదలాలి. 2022 నాటికి ముంబై - అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ ట్రైన్ నడపాలని కేంద్ర రైల్వేశాఖ టార్గెట్‌గా పెట్టుకుంది.

    Bullet train, Bullet Train name, Name the bullet train, Mascot for Bullet train, Mumbai Ahmadabad Bullet Train, Bullet Train Name, Bullet Train Mascot, బుల్లెట్ ట్రైన్, బుల్లెట్ ట్రైన్‌కి పేరు పెట్టండి, బుల్లెట్ ట్రైన్‌కి మస్కట్ తయారు, ముంబై అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్
    ప్రతీకాత్మక చిత్రం


    ఈ పోటీలో పాల్గొనాలనుకునే వారు... mygov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి లాగిన్ అవ్వాలి. మీ సూచనలు, సలహాలు అందించాలి. మీరు ప్రతిపాదించిన అంశాలను ఓ కమిటీ పరిశీలిస్తుంది. ఒకవేళ మీరు సూచించిన మస్కట్, పేరు సెలక్ట్ అయితే, రూ.50,000 నగదు బహుమతి ఇస్తారు. క్యాష్ ప్రైజ్‌తో పాటు ఓ సర్టిఫికెట్ కూడా ఇస్తారు. విన్నర్‌తో పాటు ఐదు కన్సొలేషన్ ప్రైజ్‌లు కూడా ఉన్నాయి.
    First published:

    Tags: Bullet Train, Indian Railways

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు