రాజ్యసభను కుదిపేసిన అసోం ఎన్సార్సీ రగడ

రెండుసార్లు వాయిదా తర్వత సమావేశమైన సభలోనూ విపక్ష సభ్యులు ఆందోళన కొనసాగించడంతో రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు సభను బుధవారానికి వాయిదావేశారు.

news18-telugu
Updated: July 31, 2018, 1:33 PM IST
రాజ్యసభను కుదిపేసిన అసోం ఎన్సార్సీ రగడ
రాజ్యసభలో అమిత్ షా ప్రకటనను అడ్డుకున్న విపక్ష సభ్యులు
  • Share this:
అసోం జాతీయ పౌర రిజిస్టర్ వివాదం రాజ్యసభను కుదిపేసింది. సోమవారం విడుదలైన ఎన్ఆర్సీ ముసాయిదా జాబితాలో 40 లక్షల మందికి చోటు దక్కకపోవడంపై ప్రతిపక్షాలు నిరసన తెలిపాయి. ఎన్ఆర్సీ కారణంగా అసలైన భారత పౌరులను దేశం నుంచి బయటకు వెళ్లాల్సిన పరిస్థితి రాకూడదని రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్ అన్నారు. అలాగే ఎన్నార్సీ అంశాన్ని రాజకీయం చేసి, ఓటు బ్యాంకు కోసం వాడుకోవాలని బీజేపీ చూస్తోందని ఆరోపించారు. ఇది హిందూ-ముస్లీం అంశం కాదని, దీన్ని మానవీయ కోణంలోనే చూడాలని సూచించారు.

ఈ అంశంపై అమిత్ షా ప్రకటన చేస్తుండగా విపక్ష సభ్యులు పోడియం వద్దకు చేరుకుని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆయన ప్రసంగాన్ని అడ్డుకున్నారు. 1985లో రాజీవ్ గాంధీ అసోంలో తలపెట్టిన పనినే ఇప్పుడు తాము చేతల్లో చూపుతున్నామని అమిత్ షా చెప్పుకొచ్చారు.అమిత్ షా ప్రసంగానికి విపక్ష సభ్యులు అడ్డుతగలడం పట్ల రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు అసహనం వ్యక్తంచేశారు. ప్రజాస్వామ్యం ఇదేనా? అంటూ ప్రశ్నించారు. దీంతో తొలుత మధ్యాహ్నం 12 గంటల వరకు, ఆ తర్వాత రెండోసారి మధ్యాహ్నం 1.10 గంటల వరకు సభను వాయిదావేశారు. ఆ తర్వాత సమావేశమైన సభలోనూ విపక్ష సభ్యులు ఆందోళన కొనసాగించడందో సభను బుధవారానికి వాయిదావేశారు.
ఇదీ చదవండి..
Published by: Janardhan V
First published: July 31, 2018, 1:32 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading