హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Civilian Killings : ఇండియన్ ఆర్మీ జవాన్లపై హత్య కేసు.. నాగాలాండ్ పోలీసుల సంచలనం.. అక్కడా ఎన్టీఏ ప్రభుత్వం..

Civilian Killings : ఇండియన్ ఆర్మీ జవాన్లపై హత్య కేసు.. నాగాలాండ్ పోలీసుల సంచలనం.. అక్కడా ఎన్టీఏ ప్రభుత్వం..

ఆర్మీ కాల్పుల్లో చనిపోయిన పౌరులకు సామూహిక అంత్యకక్రియలు (గతేడాది డిసెంబర్ నాటి ఫొటో)

ఆర్మీ కాల్పుల్లో చనిపోయిన పౌరులకు సామూహిక అంత్యకక్రియలు (గతేడాది డిసెంబర్ నాటి ఫొటో)

ఏఎఫ్‌ఎస్‌పీఏ పరిధిని తగ్గిస్తూ మోదీ సర్కార్ నిర్ణయం తీసుకున్న కొద్ది రోజులకే ఈశాన్య రాష్ట్రమైన నాగాలాండ్ లో సంచలన పరిణామం చోటుచేసుకుంది. సాధారణ పౌరులను కాల్చిచంపిన ఘటనలో ఇండియన్ ఆర్మీ జవాన్లపై హత్య కేసు నమోదైంది..

సొంత పౌరులనే కాల్చి చంపినా దాన్ని నేరంగా పరిగణించే వీలు లేని సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం(ఏఎఫ్‌ఎస్‌పీఏ) పరిధిని తగ్గిస్తూ కేంద్రంలోని మోదీ సర్కార్ నిర్ణయం తీసుకున్న కొద్ది రోజులకే ఈశాన్య రాష్ట్రమైన నాగాలాండ్ (Nagaland) లో సంచలన పరిణామం చోటుచేసుకుంది.

సాధారణ పౌరులను కాల్చిచంపిన ఘటన (Nagaland civilian killings)లో నాగాలాండ్ పోలీసులు.. ఇండియన్ ఆర్మీ జవాన్లపై ఏకంగా హత్య ఆరోపణలు మోపారు. తీవ్రస్థాయి ఘర్షణలకు దారితీసిన ఈ ఉదంతంపై జరిగిన విచారణ, ఆర్మీ జవాన్లపై హత్యారోపణ తదితర అంశాలను నాగాలాండ్ డీజీపీ లోంగ్ కుమార్ శనివారం మీడియాకు వెల్లడించారు.

AFSPA: మాట నిటెట్టుకున్న మోదీ సర్కార్.. సాయుధ దళాల ప్రత్యేక చట్టం పరిధి కుదింపు: Amit Shah


అసలేం జరిగిందంటే : గతేడాది డిసెంబర్ 4న నాగాలాండ్‌లోని మోన్ జిల్లా పరిధిలోని ఓటింగ్ గ్రామంలో ఆర్మీ విభాగమైన అస్సాం రైఫిల్స్‌ కు చెందిన ప్రత్యేక భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో 14 మంది అమాయక పౌరులు చనిపోయారు. ఓ బొగ్గు గనిల పనిచేస్తున్న కార్మికులు డ్యూటీ దిగి వ్యాన్‌లో పాటలు పాడుకుంటూ ఇళ్లకు తిరిగి వెళ్తుండగా, అక్కడ గస్తీ తిరుగుతున్న ఆర్మీ జవాన్లు వారిని నాగా ఉగ్రవాద సంస్త ఎన్‌ఎస్‌సిఎన్‌(కె)కు చెందిన తీవ్రవాదులుగా భావించి కాల్పులు జరిపడంతో ఈ మరణాలు సంభవించాయి. ఈ ఘటనపై స్థానికంగా తిరుగుబాటు చలరేగింది. ప్రజల దాడిలో ఒక ఆర్మీ జవాన్ చనిపోగా, పదుల సంఖ్యలో ప్రభుత్వ వాహనాలు ఆహుతయ్యాయి. పౌరుల కాల్చివేతను పొరపాటున జరిగిన ఘటనగా ఆర్మీ ప్రకటన చేయగా, మృతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా నివాళి అర్పించాయి. కాగా,

Farmers : పెద్ద రైతులకు షాక్.. చిన్న రైతుల నుంచే ధాన్యం కొనుగోలు : కేంద్రానికి CACP సంచలన ప్రతిపాదన


ఆర్మీ జవాన్లపై హత్య కేసు: గతేడాది జరిగిన పౌరహత్యలపై నాగాలాండ్ ప్రభుత్వం ఐదుగురు ఉన్నతాధికారుల ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)తో విచారణ చేయించింది. సిట్ తాజాగా కోర్టుకు సమర్పించిన చార్జిషీటులో మొత్తం 30 మంది ఆర్మీ సిబ్బందిపై హత్యానేరం మోపింది. ఒక ఆర్మీ మేజర్ సహా 29 మంది జవాన్ల పేర్లను చార్జిషీటులో పోందుపర్చారు. ఆకస్మిక దాడిలో పాల్గొన్న ఆర్మీ సిబ్బంది.. స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్స్ (SOP) పాటించలేదని, కనీసం హెచ్చరించకుండా నేరుగా కాల్పులకు పాల్పడ్డారని సిట్ ఆరోపించింది. నాగాలాండ్ లో ప్రస్తుతం బీజేపీ అధికారాన్ని పంచుకుంటోన్న ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలో ఉండటంతో ఆ రాష్ట్ర పోలీసులు ఆర్మీపై హత్యా నేరం మోపడం రాజకీయంగానూ చర్చనీయాంశమైంది.

Petrol Diesel : పెరిగిన ఇంధన డిమాండ్.. ముడి చమురు ధరల షాక్.. పెట్రో బాదుడు తప్పదు!


నాగాలాండ్ సంచలన చర్య: మోన్ జిల్లాలో సాధారణ పౌరులపై ఆర్మీ జవాన్ల కాల్పుల ఘటనపై అత్యున్నత స్థాయిలో విచారణ జరుపుతున్నామని, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆర్మీ గతంలో ప్రకటించినా సదరు విచారణ ముందుకు సాగలేదు. ఈలోపే నాగాలాండ్ పోలీసులు ఆర్మీపై చార్జిషీటు దాఖలు చేయడం గమనార్హం. అస్సాం, మ‌ణిపూర్‌, నాగాలాండ్ రాష్ట్రాల్లో సాయుధ బ‌ల‌గాల చ‌ట్టం ప‌రిధిలోకి వ‌చ్చే ప్రాంతాల‌ను కుదిస్తున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా మార్చి 31న ప్రకటించారు. నిజానికి మోన్ కాల్పుల ఉదంతం షా ప్రకటన కంటే ముందే జరిగినప్పటికీ, చట్టం పరిధి కుదింపు అంశం మళ్లీ చర్చలో నిలిచింది. దశాబ్దాల తర్వాత ఆర్మీపై హత్య కేసులు నమోదు చేసిన రాష్ట్రంగా నాగాలాండ్ నిలిచింది.

Published by:Madhu Kota
First published:

Tags: Indian Army, Murder case, Nagaland

ఉత్తమ కథలు