news18-telugu
Updated: March 3, 2020, 3:15 PM IST
ప్రధాని నరేంద్ర మోదీ, నాగబాబు (File/Photos)
సోషల్ మీడియాను వదిలేస్తానని ట్వీట్ చేసి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంచలనం రేపిన సంగతి తెలిసిందే కదా. ఐతే.. ఈ ఆదివారం మహిళా దినోత్సవం సందర్భంగా ఆ రోజు తన సోషల్ మీడియా అకౌంట్లను మహిళలకు అప్పగిస్తున్నట్టు ప్రకటించారు. అయితే అలాంటి మహిళల స్టోరీస్ #SheInspireUsతో ట్యాగ్ చేయండి’ అని ట్వీట్ చేశారు.మన దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఖాతాల్లో కోట్లాది మంది ఫాలోవర్స్ ఉన్న సంగతి తెలిసిందే కదా. ప్రధాని సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని తీసుకున్న నిర్ణయంపై జనసేన నేత నటుడు నాగబాబు స్పందించారు. ప్రధాన మంత్రి తీసుకున్న నిర్ణయం సరైనదేనని నేను భావిస్తున్నాను. ఇప్పటి నుంచి నేనూ ప్రధాని మోదీని ఫాలో కావాలని అనుకుంటున్నాను అని ప్రకటించాడు. నాగబాబు చేసిన ట్వీట్స్ పై నెటిజన్స్ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. అయితే మరికొందరు మాత్రం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోషల్ మీడియాను వీడే నిర్ణయంపై మనసు మార్చుకున్నారని ఇంకొందరు రిప్లై ఇస్తున్నారు.
Published by:
Kiran Kumar Thanjavur
First published:
March 3, 2020, 3:15 PM IST