హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Strange Case: భార్యపై భర్త కంప్లైంట్... పోలీసులకు దిమ్మ తిరిగిందిగా... అదేం కంప్లైంట్..

Strange Case: భార్యపై భర్త కంప్లైంట్... పోలీసులకు దిమ్మ తిరిగిందిగా... అదేం కంప్లైంట్..

(ప్రతీకాత్మక చిత్రం -Image credit pixabay)

(ప్రతీకాత్మక చిత్రం -Image credit pixabay)

భార్యలు చేతులో ఇబ్బందులు పడుతున్న భర్తలు క్రమక్రమంగా బయటకు వస్తున్నారు.. భార్య హింస పెడుతుందంటూ, తనని పట్టించుకోవడం లేదంటూ పోలీసులను ఆశ్రయిస్తున్న భర్తల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.

  • Local18
  • Last Updated :
  • Hyderabad, India

భర్తలపై భార్యలు కంప్లైంట్‌లు ఇవ్వడం మోస్ట్ కామన్‌.. అయితే కొద్దీ కాలంగా ట్రెండ్‌ కాస్త మారుతూ వస్తోంది. భార్యలు చేతులో ఇబ్బందులు పడుతున్న భర్తలు క్రమక్రమంగా బయటకు వస్తున్నారు.. భార్య హింస పెడుతుందంటూ, తనని పట్టించుకోవడం లేదంటూ పోలీసులను ఆశ్రయిస్తున్న భర్తల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. అంతే కాదు భర్తలు కూడా గృహ హింస బాధితులుగా మారిపోతున్న రోజులివి.. తాజాగా అలాంటి ఘటనే ఒకటి ఐటీ హబ్‌ బెంగళూరులో జరిగింది. తన భార్యపై పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు ఓ భర్త.. ఆ కంప్లైంట్ చూసి పోలీసులుకు దిమ్మ దిరిగిపోయింది.. ఇదేం కంప్లైంట్ రా బాబు అంటూ కాసేపు సైలెంట్‌గా ఉండిపోయారు.. తర్వాత భర్త చెప్పిన విషయాలను చూసి షాక్‌ అయ్యారు.. ఇంతకీ ఏంటా కంప్లైంట్..?

నిద్రమహాదేవి:

బెంగళూరు బసవగూడకు చెందిన కమ్రాన్‌ ఖాన్‌కు కొన్నాళ్ల క్రితం ఆయేషాతో వివాహమైంది. అయితే పెళ్లైనప్పటి నుంచి తన భార్య ఎక్కువ సమయం నిద్రపోతూనే ఉంటుందని కమ్రాన్ పోలీస్‌ స్టేషన్‌ గడప తొక్కాడు.. రాత్రి నిద్రపోతే మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిద్రపోతుందని వాపోయాడు. ఒకవేళ నిద్రలేపాలని చూస్తే తిరిగి తిడుతూందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఒకవేళ మధ్యాహ్నం పడుకుంటే రాత్రి 9గంటల 30నిమిషాల వరకు నిద్రపోతూనే ఉంటుందని పోలీసులకు చెప్పి బాధ పడ్డాడు కమ్రాన్‌. ఇలా ఎక్కువ సేపు నిద్రపోయే వాళ్లు పెళ్లి చేసుకోవడం దేనికంటూ ప్రశ్నించాడు.

దాడులు కూడా చేస్తుందట:

తన భార్య ఏ పనీ చేయదని.. తన తల్లి వంట చేసి శుభ్రం చేయాలని కమ్రాన్‌ ఆరోపించాడు. పని చేయమంటే చిరాకు పడటం.. తిట్టడం లాంటివి చేస్తుందని వాపోయాడు. వయసు మీద పడ్డ తన తల్లిని కూడా సరిగా చూసుకోవడం లేదని.. తన తల్లే తనకు వండిపెడుతుందని ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే ఇప్పటి వరకు వీటన్నింటిని భరించామని.. ఈ మధ్య తమ కుటుంబ సభ్యులపై దాడికి చేయడం ప్రారంభించిందన్నాడు. తన భార్యను భరించడం తనకు, తన కుటుంబ సభ్యులకు భారంగా మారిందని.. అందుకే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు కమ్రాన్ ఖాన్ తెలిపాడు. భార్యతో పాటు మామ ఆరిఫుల్లా, అత్త హీనా కౌసర్‌లపై బసవనగుడి పోలీస్‌స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. ఇక గతేడాది కర్ణాటకలోని మైసూర్‌లో భార్యపై భర్త ఫిర్యాదు చేశాడు. ఇంట్లోని బంగారం కాజేసి, పైగా వేధింపులకు గురిచేస్తోందని భార్యపై భర్త పోలీసులను ఆశ్రయించాడు. అనేకసార్ తనపై హత్యాయత్నం కంప్లైంట్ చేయడం అప్పట్లో వైరల్‌ న్యూస్‌గా ట్రేండ్ అయ్యింది.

First published:

Tags: Bengaluru, Husband, Sleep, Wife

ఉత్తమ కథలు