హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

OMG: నా భార్య.. మహిళ కాదు పురుషుడు..6 ఏళ్ల కాపురం తర్వాత కోర్టు మెట్లెక్కిన భర్త..

OMG: నా భార్య.. మహిళ కాదు పురుషుడు..6 ఏళ్ల కాపురం తర్వాత కోర్టు మెట్లెక్కిన భర్త..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

భార్యపై అనుమానం తీరని భర్త.. ఆమెకు వైద్య పరీక్షలు చేయించాడు. ఈ పరీక్షల్లో మహిళకు సంబంధించి సంచలన నిజాలు తేటతెల్లమయ్యాయి. తాను పెళ్లి చేసుకున్న మహిళ.. మహిళ కాదు 'పురుషుడు' అని తేలడంతో భర్త ఖంగుతిన్నాడు.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  పెళ్లి అనేది జీవితంలో ముఖ్యమైన ఘట్టం. తనకు వచ్చే భర్త బాగా చూసుకోవాలని భార్య, తను చేసుకునే భార్య అందంగా ఉండాలని భర్త కలలు కంటుంటారు. జీవితంలోకి వచ్చే అమ్మాయి గురించి అన్ని విషయాలు తెలుసుకొని వివాహం చేసుకుంటారు. కానీ ఓ యువకునికి పెళ్లి తర్వాత వింత అనుభవం ఎదురైంది. 6 ఏళ్లు కాపురం చేశాక అసలు నిజం తెలుసుకున్న అతనికి దిమ్మతిరిగింది. మరి 6 ఏళ్ల తర్వాత ఏం జరిగింది? బయటపడ్డ ఆ నిజం ఏంటి? తెలియాలంటే ఈ స్టోరీపై ఓ లుక్కేయండి.

  మధ్యప్రదేశ్(Madhya Pradesh)లోని గ్వాలియర్‌కు చెందిన ఓ వ్యక్తి 2016లో మురైనకు చెందిన ఓ యువతితో వివాహం జరిగింది. ఆపై వాళ్లిద్దరు శారీరకంగా కలవలేదు. భర్త ఎంత ప్రయత్నించిన భార్య ఒప్పుకునేది కాదు. ఇద్దరు కలిసి ఆరేళ్ళు కలిసి కాపురం చేశాక తన భార్య పురుషుడని భర్త ఆరోపించాడు. ఈ క్రమంలో ఆ మహిళతో పాటు ఆమె తండ్రిపై చీటింగ్ కేసు (Cheating Case) నమోదు చేయాలని పోలీసులను ఆశ్రయించాడు. కానీ ఫలితం లేదు. దీనితో సదరు వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేశాడు. అయితే అతని పిటిషన్ ను కోర్టు కూడా కొట్టివేసింది. ఇక ఆ మహిళ తనకు హార్మోన్ల సమస్య ఉందని, అందువల్లే మందులు వాడుతున్నానని చెప్పుకొచ్చింది.

  అయినా అనుమానం తీరని భర్త.. తన భార్యకు వైద్య పరీక్షలు చేయించాడు. ఈ పరీక్షల్లో మహిళకు సంబంధించి సంచలన నిజాలు తేటతెల్లమయ్యాయి. తాను పెళ్లి చేసుకున్న మహిళ.. మహిళ కాదు 'పురుషుడు' అని తేలడంతో భర్త ఖంగుతిన్నాడు. ఇన్నిరోజులుగా కలిసి ఉన్న భార్య మహిళ కాదు పురుషుడు అని తెలుసుకున్న ఆ వ్యక్తి బాధ వర్ణనాతీతంగా మారింది. ఇక ఈ విషయంపై భర్త కుటుంబ న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. దీనిపై విచారణ జరిపిన కోర్టు వైద్య పరీక్షలను పరిశీలించింది. ఆ మహిళ పురుషుడు కాదని తెలుస్తూ వారి వివాహాన్ని రద్దు చేసింది. హార్మోన్ల ప్రభావంతోనే పురుషుడిగా మారానని, కానీ తన భర్తను మోసం చేయాలని కాదని ఆమె తెలిపింది. అయితే ఈ సమస్యకు చికిత్స తీసుకుంటున్నానని, పూర్తి అమ్మాయిలా మారడానికి ప్రయత్నిస్తున్నాని ఆమె చెప్పుకొచ్చింది.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Crime news, Madhya pradesh

  ఉత్తమ కథలు