ISIS Wanted to Kill Nupur Sharma : ఆత్మాహుతి దాడి కోసం భారత్ వచ్చేందుకు ప్రయత్నిస్తోన్న 28 ఏళ్ల ఐసిస్(ISIS)ఉగ్రవాది అజమౌ(AZAMOV)ని అదుపులోకి తీసుకున్నట్లు రష్యాకు చెందిన ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ (FSB)ఓ ప్రకటన జారీ చేసిన విషయం తెలిసిందే. రష్యా నుంచి భారత్(India) వెళ్లడం కోసం అవసరమైన డాక్యుమెంట్లను పూర్తి చేసి ఇండియాలో "హై ప్రొఫైల్" వ్యక్తులపై ఆత్మాహుతి దాడులకు పాల్పడాలని అతడికి ఐసిస్ నుంచి సూచనలు ఉన్నాయని ఎఫ్ఎస్‌బీ తెలిపింది. అతడిని ఓ ఉగ్రవాద నాయకుడు రిక్రూట్ చేసుకొని.. టర్కీ(Turkiye)లో సూసైడ్ బాంబర్‌గా శిక్షణ ఇచ్చారని వెల్లడించింది.
ఇటీవల మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి బీజేపీ నుంచి సస్పెండ్ కు గురైన నుపుర్ శర్మ(Nupur Sharma)ను ఆత్మాహుతి దాడి ద్వారా హతమార్చాలని ఐసిస్ ఉగ్రవాది అజమౌకి టార్గెట్ ఇవ్వబడినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు CNN-న్యూస్18 కి తెలిపాయి. ప్రవక్తను అవమానించినందుకు ప్రతీకారం తీర్చుకోవాలనే ఉద్దేశంతో దాడికి ప్లాన్ చేశానని నిఘా వర్గాలు తెలిపాయి. ప్లాన్‌లో భాగంగా అజమౌని భారత వీసా కోసం రష్యా పంపించారని.. న్యూఢిల్లీకి వచ్చినప్పుడు అతనికి స్థానిక సహాయం అందుతుందని హామీ ఇచ్చారని వర్గాలు తెలిపాయి. రష్యా అధికారుల విచారణలో, అజమౌ... ఆన్‌లైన్‌లో తీవ్రవాదానికి ఆకర్షితుడయ్యాడని గురయ్యాడని, అతను వారి నాయకులను ఎవరినీ కలవలేదని చెప్పాడు. రెండో విడత ఆపరేషన్‌లో భాగంగా తనను రష్యాకు పంపినట్లు అజమౌ తెలిపాడు.
Russia: రష్యాలో పెను సంచలనం.. ఉక్రెయిన్ యుద్ధానికి కారణమైన పుతిన్ సన్నిహితుడి కుమార్తె దారుణ హత్య!
జులైలోనే భారత్ కు సమాచారం
ప్రస్తుతం రష్యా అదుపులో ఉన్న అజమౌ గురించి జూలై 27నే ఓ విదేశీ ఉగ్రవాద వ్యతిరేక సంస్థ భారత్‌కు సమాచారం అందించిందని... కిర్గిస్తాన్, ఉజ్బెకిస్తాన్ లకు చెందిన ఇద్దరు ఆత్మాహుతి బాంబర్లు భారతదేశంలో ఉగ్రవాద దాడికి సిద్ధంగా ఉన్నారని, ఆ ఇద్దరిలో ఒకరు టర్కీలో ఉన్నాడని భారత్ కు సమాచారం వచ్చిందని నిఘా వర్గాలు తెలిపాయి. ఆ ఉగ్రవాదులు రష్యా మీదగా భారత్ కు వస్తారని,వారి వీసా దరఖాస్తు ఆగస్టులో మాస్కోలోని రష్యన్ రాయబార కార్యాలయానికి లేదా ఇతర కాన్సులేట్‌కు వెళ్తుందని భారతదేశానికి సమాచారం వచ్చినట్లు తెలిపాయి. ఈ వివరాలను భారత్ రష్యాతో కూడా పంచుకుందని.. ఇదే అజమౌని రష్యన్ ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ (FSB) నిర్బంధించడానికి దారితీసినట్లు నిఘా వర్గాలు తెలిపాయి.
మరోవైపు,భారత ఏజెన్సీలకు ఇన్‌పుట్‌లు రావడంతో, IS నెట్‌వర్క్ ను విచ్ఛిన్నం చేయడానికి యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ATS) దేశవ్యాప్తంగా సమావేశాలు నిర్వహించింది. ఆ తర్వాత ఏజెన్సీ ఐఎస్‌పై నిరంతర అణిచివేతను ప్రారంభించింది. రెండు రోజుల్లో కనీసం 35 చోట్ల దాడులు చేసి అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: India, ISIS, Russia, Terror attack, Terrorists