అవినీతి రహిత పాలన, సమగ్ర అభివృద్ధి... పార్లమెంట్‌లో రామ్‌నాధ్ కోవింద్ ప్రసంగం

పార్లమెంట్ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న రామ్‌నాధ్ కోవింద్

President Ramnath kovind speech in parliament | బడ్జెట్ సమావేశాల ప్రారంభానికి ముందు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి... అవినీతి రహిత పాలన అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపేలా తమ ప్రభుత్వం కార్యక్రమాలు రూపొందిస్తోందని వెల్లడించారు.

  • Share this:
    నవభారత నిర్మాణానికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అన్నారు. బడ్జెట్ సమావేశాల ప్రారంభానికి ముందు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి... అవినీతి రహిత పాలన అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఆయుష్మాన్ భారత్ పథకంతో దేశంలోని 50 కోట్ల మందికి మెరుగైన ఆరోగ్య సేవలు అందించామని అన్నారు. హృద్రోగులకు అందించే స్టంట్‌ల ధరలు తగ్గించామని తెలిపారు. మరుగుదొడ్ల నిర్మాణం ద్వారా మహిళల గౌరవం పెంచామని వెల్లడించారు. మరుగుదొడ్ల నిర్మాణం ద్వారా మూడు కోట్ల కుటుంబాల ఆరోగ్యం మెరుగైందని అన్నారు.

    తక్కువ ప్రీమియంతో పంటల బీమా పథకాన్ని తీసుకొచ్చామని వ్యాఖ్యానించారు. 18 వేలకు పైగా గ్రామాల్లో విద్యుదీకరణ చేపట్టామని వెల్లడించారు. దేశంలోని ప్రతి ఒక్క ఇంటికి విద్యుత్ అందుబాటులోకి వచ్చిందని అన్నారు. నిరుపేదలకు సైతం వంటగ్యాస్‌ను అందుబాటులోకి తీసుకొచ్చామని అన్నారు. ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపేలా తమ ప్రభుత్వం కార్యక్రమాలు రూపొందిస్తోందని తెలిపారు. ముద్రా యోజన ద్వారా ఎంతో మంది ఔత్సాహికులు పారిశ్రామిక వేత్తలుగా మారారని అన్నారు. 40 వేల గ్రామాల్లో వైఫై సౌకర్యం కల్పించామని రాష్ట్రపతి తెలిపారు.
    First published: