Home /News /national /

MY DAUGHTER FAILED IN PUC BECAUSE OF CONGRESS ALLEGES KARNATAKA BJP LEADER UMESH JADHAV BA

‘నా కూతురు పరీక్ష ఫెయిల్ కావడానికి కాంగ్రెస్సే కారణం’

ఉమేష్ జాదవ్ (File)

ఉమేష్ జాదవ్ (File)

కాంగ్రెస్ పార్టీ తరఫున రెండు సార్లు గెలిచిన ఉమేష్ జాదవ్.. లోక్‌సభ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు. కలబుర్గి లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్ లోక్‌సభాపక్ష నేత మల్లికార్జున ఖర్గే మీద ఆయన పోటీ చేశారు.

    రాజకీయ నాయకులు తాము ఓడిపోవడానికి ఫలానా కారణం, తమ నేత ఓడిపోవడానికి ఫలానా కారణం అని చెబుతూ ఉంటారు. అయితే, కర్ణాటకలో ఓ నేత విచిత్రంగా తన కుమార్తె పరీక్షల్లో ఫెయిల్ కావడానికి కాంగ్రెస్ పార్టీ కారణమని ఆరోపించారు. బీజేపీ నేత ఉమేశ్ జాదవ్ చిన్న కుమార్తె ఇటీవల పీయూసీ పరీక్షలు రాసింది. అయితే, ఆ పరీక్షల్లో ఫెయిలైంది. అయితే, తన కుమార్తె పరీక్షల్లో విఫలం కావడానికి కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణలు కారణమని ఉమేష్ జాదవ్ ఆరోపించారు. కర్ణాటకలోని చించోలీలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ప్రతీ పరీక్షలోనూ నా కూతురు బాగా చదివి మంచి మార్కులతో పాస్ అయింది. అయితే, కాంగ్రెస్ నేతలు నా మీద, నా కుటుంబం మీద పదే పదే ఆరోపణలు చేయడంతో కుటుంబం మొత్తం మానసికంగా కుంగిపోయింది. అందువల్ల తాను పరీక్ష సరిగా రాయలేకపోయానని నా కూతురు చెప్పింది. పరీక్ష కూడా ఫెయిల్ అయింది.’ అని ఉమేష్ జాదవ్ అన్నారు.

    కాంగ్రెస్ పార్టీ తరఫున రెండు సార్లు గెలిచిన ఉమేష్ జాదవ్.. లోక్‌సభ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు. కలబుర్గి లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్ లోక్‌సభాపక్ష నేత మల్లికార్జున ఖర్గే మీద ఆయన పోటీ చేశారు. ఈ క్రమంలో ఉమేష్ జాదవ్ రూ.50 కోట్ల నుంచి రూ.60 కోట్లు తీసుకుని బీజేపీలో చేరారంటూ కాంగ్రెస్ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. ఈ ప్రచారం వల్ల తన కుటుంబం మొత్తం మానసిక వేదనకు గురైందని, తన కుమార్తె పరీక్ష కూడా పోయిందని ఉమేష్ జాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు.
    First published:

    Tags: Karnataka Lok Sabha Elections 2019, Karnataka Politics, Lok Sabha Election 2019

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు