హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Communal Harmony : వెల్లివిరిసిన మత సామరస్యం..హిందూ దేవాలయ పున:నిర్మాణానికి విరాళమిచ్చిన ముస్లింలు, వాలంటీర్లుగా సేవలు

Communal Harmony : వెల్లివిరిసిన మత సామరస్యం..హిందూ దేవాలయ పున:నిర్మాణానికి విరాళమిచ్చిన ముస్లింలు, వాలంటీర్లుగా సేవలు

Imgae Credit : TOI

Imgae Credit : TOI

మత సామరస్యం వెల్లివిరిసింది. మతం మనుషుల మధ్య అడ్డుగోడగా ఉండబోదని గుజరాత్‌లోని ఓ గ్రామ ప్రజలు నిరూపించారు. గుజరాత్ రాష్ట్రంలోని పటాన్ జిల్లా డెత్లి గ్రామంలో హిందూ ఆలయ నిర్మాణానికి విరాళాలు ముస్లింలు అందించారు.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

మత సామరస్యం వెల్లివిరిసింది. మతం మనుషుల మధ్య అడ్డుగోడగా ఉండబోదని గుజరాత్‌లోని ఓ గ్రామ ప్రజలు నిరూపించారు. గుజరాత్ రాష్ట్రంలోని పటాన్ జిల్లా డెత్లి గ్రామంలో హిందూ ఆలయ నిర్మాణానికి విరాళాలు ముస్లింలు అందించారు. అంతేకాకుండా ఆలయంలో హిందూ భక్తులకు టీ, కాఫీలు అందిస్తూ వాలంటీర్లుగా సేవలు అందిస్తున్నారు. ఆలయ నిర్వాహకులు ఏర్పాటు చేసిన యాగంలో పాల్గొనే భక్తులకు ముస్లిం సోదరులు ఉచితంగా పానీయాలు అందజేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.

రూ.11 లక్షల విరాళం

డెత్లి గ్రామంలోని చాముండ మాతా ఆలయాన్ని ఇటీవల పున:నిర్మించారు. ఇందుకు రూ.1 కోటి వరకు ఖర్చు అయ్యాయి. కాగా, ఈ ఆలయ నిర్మాణానికి ముస్లింలు కూడా సహకరించి విరాళాలు అందించడం విశేషం. రూ.11 లక్షల 11 వేల 111ని ఈ గ్రామ ముస్లిం కమ్యూనిటీ వారు అందించారు. ఈ గ్రామ జనాభా 6 వేలు. ఇందులో 30 శాతం మంది ముస్లింలు. గతేడాది ఆలయ నిర్వహణ కమిటీ చాముండ మత ఆలయ పున:నిర్మాణానికి పూనుకుంది. అప్పటి నుంచి నిధులు సేకరిస్తుండగా, ముస్లిం కమ్యూనిటీ వారు కూడా విరాళాలు అందించారు. తాము మతాలకు అతీతంగా సామరస్యంగా జీవిస్తామని, తమ గ్రామంలో ఇప్పటి వరకు మత అల్లర్లు, హింస చెలరేగలేదని ఆగాఖాన్ మొమిన్ కమ్యూనిటీకి చెందిన నాయకుడు అక్బర్ మొమిన్ తెలిపారు.

TCS: టీసీఎస్ కీలక ప్రకటన..70 శాతం మంది ఉద్యోగులకు వంద శాతం వేరియబుల్ పే!

హిందూ భక్తులకు వాలంటీర్లుగా సేవలు

అక్టోబర్ 12 నుంచి ఆలయంలో మూడు రోజుల పాటు యజ్ఞం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక ముస్లింలు ఆ ప్రాంగణంలో ఉచితంగా టీ, కాఫీలు భక్తులకు అందజేస్తున్నారు. హిందూ భక్తులకు ఉచితంగా టీ, కాఫీలు అందజేయడం కోసం టీ, కాఫీ కౌంటర్‌ను ఆలయ ప్రాంగణంలో ముస్లిం కమ్యూనిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినట్లు అక్మర్ మొమిన్ చెప్పుకొచ్చారు. ప్రతి రోజూ భక్తులకు 50 వేల కప్పుల టీని ముస్లింలు అందజేస్తున్నారు.

యాగంలో ముస్లింలు అంతర్భాగం

డెత్లీ గ్రామ సర్పంచ్ విక్రమ్ సింగ్ దర్బార్ మాట్లాడుతూ..‘ఆలయంలోని భక్తులకు ముస్లింలు ఆహార పదార్థాలు, టీ అందజేస్తున్నారు. మూడు రోజుల పాటు నిర్వహించే యజ్ఞం కోసం ఏర్పాట్లు నెల రోజుల నుంచి జరుగుతున్నాయి. ఈ యాగంలో ముస్లింలు కూడా అంతర్భాగం’ అని చెప్పారు . ఇతర మతాల మాదిరిగానే ముస్లింలు ఉదారంగా వ్యవహరించారని సర్పంచ్ వివరించారు. సున్నీ ముస్లిం ట్రస్టీ ఇబ్రహీం షేక్ మాట్లాడుతూ.. హిందూవుల మాదిరిగా టోపీలు ధరించి ఆలయంలోని భక్తులందరికీ తాము పానీయాలు అందిస్తున్నామని అన్నారు. ముస్లింలు సైతం ఆలయంలోని వంటగదిలోకి వెళ్లి అక్కడ పనులను చక్కబెట్టడం తో పాటు అక్కడి నుంచి ఆహార పదార్థాలను తీసుకొచ్చి భక్తులకు పంపిణీ చేస్తుండటం విశేషం. మతం అనేది మనుషుల మధ్య అడ్డుగా ఉండకూడదని, మనుషులుగా అందరూ ఒకటేనని, దేవుడు ఒక్కడేనని ఆరాధానా పద్ధతులు వేరని మాటల్లో మాత్రమే చెప్పకుండా ఆచరణలోనూ నిరూపించారు గుజరాత్ రాష్ట్రానికి చెందిన డెత్లీ గ్రామ ముస్లింలు.

First published:

Tags: Gujarat

ఉత్తమ కథలు