ముస్లిం మహిళకూ... హిందు వరుడికీ పెళ్లి జరిగితే... ఆమె... హిందుత్వం (convert) స్వీకరించేవరకూ... ఆ పెళ్లి లెక్కలోకి రాదు అని స్పష్టమైన తీర్పు ఇచ్చింది పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు. ఈ తీర్పు రావడానికి వెనక ఓ కేసు ఉంది. జనవరి 15న ఓ హిందు ఆలయంలో... 25 ఏళ్ల హిందు యువకుడు, 18 ఏళ్ల ముస్లిం యువతి పెళ్లి చేసుకున్నారు. ఐతే... ఆమె హిందుత్వ మతాన్ని ఇంకా స్వీకరించలేదు. అందువల్ల అది పెళ్లి కిందకు రాదు అని హైకోర్టు బెంచ్ స్పష్టం చేసింది. ఇక్కడే కోర్టు మరో అంశమూ చెప్పింది. ఇద్దరూ పెద్దవాళ్లే (18 ఏళ్లు దాటినవాళ్లు) కాబట్టి... వాళ్లిద్దరి మధ్యా ఉన్నది అవగాహనా సంబంధం (consensual relationship) అనుకోవచ్చని చెప్పింది. ఈ పెళ్లిని రెండు కటుంబాల పెద్దలూ ఒప్పుకోలేదు. తమకు రక్షణ కల్పించాలంటూ వాళ్లు హైకోర్టుకు వెళ్తే... కోర్టేమో ఇలాంటి తీర్పు ఇచ్చింది.
ముందుగా ఆ జంట... సినిమాల్లో లాగా పరుగులేమీ పెట్టకుండా... సైలెంట్‌గా వెళ్లి... అంబాలా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌ని కలిసి... తమకు సెక్యూరిటీ కల్పించాలని కోరారు. ఆయన పట్టించుకోలేదు. దాంతో... హైకోర్టుకు వెళ్లారు.
ఈ కేసులో సంచలన తీర్పు ఇచ్చిన హైకోర్టు... అంబాల సూపరింటెండెంట్‌కి షాక్ కూడా ఇచ్చింది. అర్జెంటుగా ఆ జంటకు తగిన సెక్యూరిటీ కల్పించమని ఆదేశించింది. దాంతో సారుకి వృత్తి ధర్మం తెలిసొచ్చింది.
ఇదే పంజాబ్ హర్యానా హైకోర్టు... గత నెలలో ఇలాంటిదే ఓ సంచలన తీర్పు ఇచ్చింది. అందులో ఓ ముస్లిం మైనర్ బాలిక పెళ్లి చెల్లుతుంది అని చెప్పింది. అదేంటి... మైనర్ పెళ్లి ఎలా చెల్లుతుంది అంటే... ముస్లిం లా ప్రకారం... అమ్మాయి మెచ్యూర్ (attaining puberty) అయితే పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పింది. దాంతో... వ్యతిరేకులు సైలెంట్ అయ్యారు.
ఇది కూడా చదవండి: UFO: గుజరాత్‌లో కనిపించిన ఎగిరే పళ్లెం... వైరల్ ఫొటోలు చూడండి
ఇప్పుడు తాజా తీర్పును దేశ ప్రజలు అంగీకరిస్తారా... లేక... సుప్రీంకోర్టు మెట్లెక్కుతారా అన్నది త్వరలో తేలనుంది. ప్రస్తుతానికి ఇదో చర్చనీయాంశ తీర్పుగా మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: High Court, National News