హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Kashmiri pandit wedding : భారత్ అంటే ఇదేరా..తండ్రిని కోల్పోయిన కశ్మీరీ పండిట్ వివాహానికి ముస్లింలే పెళ్లి పెద్దలు

Kashmiri pandit wedding : భారత్ అంటే ఇదేరా..తండ్రిని కోల్పోయిన కశ్మీరీ పండిట్ వివాహానికి ముస్లింలే పెళ్లి పెద్దలు

కశ్మీరీ పండిట్ మహిళ పెళ్లి పెద్దలుగా ముస్లింలు

కశ్మీరీ పండిట్ మహిళ పెళ్లి పెద్దలుగా ముస్లింలు

Muslims host Kashmiri Pandit Bride wedding : నిత్యం ఉగ్రవాదుల దాడులు,తుపాకుల మోతతో గంభీర వాతావరణంతో నెతకొనే కశ్మీర్ వ్యాలీ(Kashmir Vally)లో మళ్లీ వసంతం తీసుకొచ్చేందుకు జరుగుతున్న ప్రయత్నాలు మంచి ఫలితాలనిస్తున్నాయి.

Muslims host Kashmiri Pandit Bride wedding : నిత్యం ఉగ్రవాదుల దాడులు,తుపాకుల మోతతో గంభీర వాతావరణంతో నెతకొనే కశ్మీర్ వ్యాలీ(Kashmir Vally)లో మళ్లీ వసంతం తీసుకొచ్చేందుకు జరుగుతున్న ప్రయత్నాలు మంచి ఫలితాలనిస్తున్నాయి. తాజాగా జరిగిన ఓ పెళ్లి(Marriage) వ్యాలీలోని కశ్మీరీ పండిట్లు(Kashmiri pandits)-ముస్లింల(Muslims) మధ్య సోదరభావం వ్యాప్తి చెందుతుందనడానికి నివర్శనంగా నిలిచింది.

మూడు దశాబ్దాల క్రితం కశ్మీర్ లోయలో అల్లర్లు జరిగి చాలా మంది కాశ్మీరీ పండిట్లు దారుణ హత్యలకు గురయ్యారు. దీంతో ఆ సమయంలో వ్యాలీలో నివసించే కశ్మీరీ పండిట్లు అందరూ రాత్రికి రాత్రి మూటాముల్లె సర్దుకుని వ్యాలీ నుంచి అనాథలుగా జమ్మూతో సహా దేశంలోని ఇతర నగరాలకు వలస వచ్చి స్థిరపడ్డారు. సొంతదేశంలోనే వలసలు వెళ్లి కనీస సౌకర్యాలు దక్కక కశ్మీరీ పండిట్లు అనేక ఇబ్బందులు ఎదర్కొన్నాడు. ఇప్పటికి కొందరు కశ్మీరీ పండిట్లు నాటి వ్యాలీలో పరిస్థితుల కారణంగా దుర్భర జీవితం గడుపుతున్నారు. అయితే ఏదైతే అదవనీ అని..పుట్టిపెరిగిన ఊరు వదిలెళ్లలేక కొన్ని కశ్మీరీ కుటంబాలు వ్యాలీలోనే ఉండిపోవడం.వ్యాలీ వదిలి పోవాలంటూ తరచూ వారిపై ఉగ్రవాదులు జరుగుతున్న విషయం తెలిసిందే. అయినప్పటికీ వారి బెదిరింపులకు,దాడులకు భయపడకుండా అనేక పండిట్ కుటుంబాలు ఇప్పటికీ కశ్మీర్‌లోని వివిధ ప్రాంతాలలో నివసిస్తున్నాయి. పండిట్లు, ముస్లింలు పక్కపక్కనే నివసిస్తూ మతసామరస్యాన్ని చాటుతున్నారు.

Couple Reunited : విడాకులు తీసుకున్న 52 ఏళ్ల తర్వాత మళ్లీ ఒక్కటైన జంట

అయితే శ్రీనగర్ కు 18 కిలోమీటర్ల దూరంలోని గందర్బాల్ లో నివిసించే మోహన్ లాల్ పండిట్ కొద్ది కాలం క్రితం మరణించారు. తాజాగా మోహన్ లాల్ కి కూతురు వివాహం జరిగింది. మీనా కుమారి పెళ్లికి స్థానిక ముస్లింలు అందరూ హాజరయ్యారు. పెళ్లి పెద్దలుగా మారి మత సామరస్యాన్ని చాటారు. సంప్రదాయ పద్ధతిలో పెళ్లిలో జరగాల్సిన అన్ని పనులను దగ్గరుండి చూసుకున్నారు. తండ్రి లేని మీనా కుమారి ఎప్పుడూ అనాథ కాదని,ఆమెకు తామంతా ఉన్నామని స్థానిక ముస్లిం ఒకరు తెలిపారు.

MARRI


Amarnath Yatra : అంతా రెడీ..ఎల్లుండి నుంచే అమర్ నాథ్ యాత్ర ప్రారంభం

స్థానిక కశ్మీరీ పండిట్ ఒకరు మీడియాతో మాట్లాడుతూ...గందర్బాల్ ప్పటికీ మత సామరస్యాన్ని మరియు ఐక్యతను కొనసాగిస్తుందని చెప్పారు. ఇక్కడ, హిందువులు- ముస్లింలు కలిసిమెలిసి జీవిస్తుంటారని, సంతోషాన్ని, బాధలను కలిసి పంచుకుంటారని చెప్పారు. కశ్మీర్‌లో వివాహాలు లేదా ఇతర వేడుకలు జరిగినప్పుడల్లా స్థానిక ముస్లింలు- పండిట్లు ఒకే టేబుల్‌పై భోజనం చేస్తారని,వేడుకల్లో కలిసి పాల్గొంటారని ఆయన తెలిపారు.

First published:

Tags: Kashmir, Marriage, Muslim brothers

ఉత్తమ కథలు