హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

హిందూ యువతితో అడ్డంగా దొరికిపోయిన ముస్లింయువకుడు.. కాలేజీ విద్యార్థులు ఏంచేశారంటే..

హిందూ యువతితో అడ్డంగా దొరికిపోయిన ముస్లింయువకుడు.. కాలేజీ విద్యార్థులు ఏంచేశారంటే..

యువకుడిని చావబాదిన విద్యార్థులు

యువకుడిని చావబాదిన విద్యార్థులు

Karnataka: హిందూ విద్యార్థినిని, అదే కాలేజీకి చెందిన ముస్లిం యువకుడు ట్రాప్ చేశారు. ఆమెకు మాయమాటలు చెప్పి, ఏకాంతంగా కలుసుకుందామని చెప్పి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు.

  • News18 Telugu
  • Last Updated :
  • Karnataka, India

కొందరు అమ్మాయిలను స్నేహం పేరుతో మోసం చేస్తుంటారు. మాయ మాటలు చెప్పి, పరిచయం చేసుకుంటారు. ఆ తర్వాత.. ప్రేమిస్తున్నామంటూ, చెబుతారు. వీరి మాటలు నమ్మిన అమ్మాయిలు.. అడ్డమైన తిరుగుళ్లు తిరుగుతుంటారు. తీరా అబ్బాయిలు.. తమ కోరికలను తీర్చుకుని, అమ్మాయిలను ముఖం చాటేస్తుంటారు. ఇలాంటి ఘటనలు తరచుగా వార్తలలో నిలుస్తున్నాయి. అయితే.. కొన్ని చోట్ల ప్రేమికులు ఎక్కువగా నిర్మానుష్య ప్రదేశాలకు వెళ్తుంటారు. అయితే.. అక్కడ వీరిని గమనించిన ఇతరులు దాడులకు పాల్పడుతుంటారు. ఈ కోవకు చెందిన ఘటన వార్తలలో నిలిచింది.పూర్తి వివరాలు.. కర్ణాటకలోని (Karnataka)  మంగళూరులో షాకింగ్ ఘటన వెలుగులోనికి వచ్చింది. పాటూర్ తాలూకా సమీపంలోని నిర్మానుష్య ప్రదేశంలో.. ఒకే కాలేజీకి చెందిన ముస్లిం యువకుడు మహ్మద్ సన్నీఫ్, మరో హిందూ అమ్మాయితో ఏకాంతంగా కన్పించారు. దీంతో కాలేజ్ కు చెందిన ఇతర విద్యార్థులు, అతగానిపై ఇష్టమోచ్చినట్లు దాడులు చేశారు. కర్రలతో బాదారు.


ఈ క్రమంలో పోలీసులు బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో.. దీక్షిత్, ధనుష్, ప్రజ్వల్, తనుజ్, అక్షయ్, మోక్షిత్, గౌతమ్ తదితరులపై ఐపీసీ కింద కేసులను నమోదు చేసినట్లు పోలీసు అధికారి రిషికేష్ సోనావానే తెలిపారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర దుమారంగా మారింది.
ఇదిలా ఉండగా జార్ఖండ్ లో (Jharkhand)  వింత ఘటన జరిగింది.
దుమ్కా జిల్లాలోని రెసిడెన్షియల్ పాఠశాలలో షాకింగ్ ఉదంతం చోటుచేసుకుంది. సదరు పాఠశాలలో ఉపాధ్యాయుడు సుమన్ కుమార్.. 9, 10 వ తరగతులకు బోధిస్తుంటాడు. అయితే.. తాజాగా ప్రకటించిన ఎగ్జామ్ ఫలితాలలో 32 మందికి గాను 11 మంది ఫెయిల్ అయ్యారు. వీరంతా సుమన్ కుమార్ పై కోపం పెంచుకున్నారు. ఆ టీచర్ తమను కావాలనే ఫెయిల్ చేశాడని కోపంలో రగిలిపోయారు. దీంతో అతడిని ఫెయిల్ అయిన విద్యార్థులంతా ఒక నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ చెట్టుకు కట్టేసి కొట్టారు.
ఇతడితో పాటు.. స్కూల్ క్లర్క్ సోనేరామ్ ని కూడా కొట్టినట్లు సమాచారం. ఈ ఘటన సోమవారం జరుగగా, మంగళవారం వెలుగులోనికి వచ్చింది. అయితే.. ఇది కాస్త పాఠశాల ఉన్నతాధికారుల వరకు వెళ్లింది. అదే విధంగా పోలీసులకు తెలిసింది. దీంతో వారు పాఠశాలకు చేరుకున్నారు. 9,10 క్లాసులలో దాదాపు 200 మంది విద్యార్థులు చదువుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు.

Published by:Paresh Inamdar
First published:

Tags: Crime news, Karnataka

ఉత్తమ కథలు